వైట్‌హౌస్‌లో క్రిస్మస్‌ వేడుకలు..డెకరేషన్‌లో బిజీగా ఉన్న బైడెన్‌ | US President Joe Biden Decorating Christmas Tree With Jill Biden | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ చెట్టుకు బైడెన్‌ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్‌

Published Sun, Dec 25 2022 5:39 PM | Last Updated on Sun, Dec 25 2022 6:36 PM

US President Joe Biden Decorating Christmas Tree With Jill Biden - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జిల్‌ బైడెన్‌ దంపతులు వైట్‌హౌస్‌లో క్రిస్మస్‌ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తాము కిస్మస్‌ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్‌​ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్‌ చేశారు.

బైడెన్‌ ఈ వారం ప్రారంభంలోనే వైట్‌హౌస్‌ నుంచి క్రిస్మస్‌ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్‌ నాయకుడు బైడెన్‌ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు.

ఈ క్రిస్మస్‌ సీజన్‌లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్‌ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్‌ లేదా రిపబ్లికన్‌లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న  భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు.  

(చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement