Jill
-
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్‌లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
వైట్‌హౌస్‌లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్‌హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్) -
జీ, సోనీ విలీనం దిశగా మరో ముందడుగు
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడింది. విలువ మదింపునకు సంబంధించి చర్చల ప్రక్రియకు గడువు ముగియడంతో నెట్‌వర్క్‌లు, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసే విధంగా ఇరు సంస్థలు నిర్దిష్ట ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జీల్, ఎస్పీఎన్ఐ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్‌పీఎన్‌ఐలో జీల్ విలీన డీల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ (ఎస్పీఈ) 1.575 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. దానికి ప్రతిగా 50.86 శాతం వాటాలు దక్కించుకుంటుంది. జీల్ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులు) 3.99 శాతం, ఇతర జీల్ షేర్హోల్డర్లకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. డీల్ పూర్తయ్యాక విలీన సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేస్తారు. జీల్ సీఈవో పునీత్ గోయెంకా ఎండీ, సీఈవోగా కొనసాగుతారు. ‘భారతీయ వినియోగదారులకు మెరుగైన వినోదం అందించేందుకు.. మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన 2 టీమ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, ఫిలిమ్ లైబ్రరీలను ఒక తాటిపైకి తెచ్చే దిశగా మా ప్రయత్నాల్లో ఇది కీలక అడుగు‘ అని ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఎస్పీఈ చైర్మన్ (గ్లోబల్ టెలివిజన్ స్టూడియోస్) రవి అహుజా తెలిపారు. వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్ అందించేందుకు ఈ డీల్ దోహదపడగలదని పునీత్ గోయెంకా పేర్కొన్నారు. -
విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు..
పెళ్లయిన వాళ్ల జీవితంలోని పెద్ద విషాదం.. విడాకులు. స్త్రీకి ఆ బాధ ఇంకాస్త ఎక్కువేనేమో. ‘కానీ గైస్.. If you take one day at a time (రేపటి గురించి కూడా ఈరోజే ఆలోచించకుండా ఉంటే) things will be better' అని యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ‘కెల్లీ క్లార్క్సన్ షో’ లో చెప్పడం ఇప్పుడు మహిళలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అయింది. ప్రథమ మహిళగా ఆమె ఇచ్చిన ఆ తొలి ఇంటర్వూలోనే.. మొదటి భర్త నుంచి తను వేరు పడటం గురించి మాట్లాడారు! అసలు అంత పర్సనల్ విషయం లోకి షో ఎందుకు వెళ్లింది! షో హోస్ట్ కెల్లీ కూడా ఈమధ్యే భర్తకు విడాకులు ఇచ్చారు. ఇంటర్వూలో జిల్ బైడెన్ తన విడాకుల అనంతర జీవితం గురించి ఇంకా ఏం చెప్పారు? ‘నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది‘ అని ఆమె అనడానికి కారణమైన ఆనాటి పరిణామాలు ఏమిటి? అవి మహిళలకు ఎలా ఆదర్శం? మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తూ ఉండే బతుకు జట్కా బండి వంటి షో లను మీరు చూసే ఉంటారు. అలా.. దాంపత్య జీవితపు ఒడిదుడుకుల ఉద్వేగాలను ఒడిసిపట్టి, వాటిని వడకట్టకుండా ప్రసారం చేస్తుండే ఒక అమెరికన్ షో లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కనిపించారు! ప్రథమ మహిళ అయ్యాక ఒక టీవీ షో కు జిల్ బైడెన్ ఇంటర్వూ్య ఇవ్వడం ఇదే తొలిసారి. షో లో తొలిసారి మాట్లాడ్డంలో విశేషం ఏమీ లేదు. అయితే తన తొలి వివాహం గురించి జిల్ బైడెన్ ఆ షో లో మనసు విప్పారు. ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ అనే ఆ పగటి పూట షో గురువారం ప్రసారం అయింది. హోస్ట్ కెల్లీ (38). గెస్ట్ జిల్ బైడెన్ (69). హోస్టు, గెస్టు ఇద్దరికిద్దరూ సాధారణమైన వారేమీ కాదు. కెల్లీ గాయని. టెలివిజన్ పర్సనాలిటీ, నటి, రచయిత్రి. ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ను రోజూ కనీసం 10 లక్షల 80 వేల మంది టీవీ వీక్షకులు చూస్తుంటారు. ఎన్.బి.సి టీవీ తరఫున ఆమె ఈ డైలీ షో ను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో చిన్న బ్రేక్‌తో ఇటీవలే తిరిగి మొదలైంది. ఇక జిల్ బైడెన్ గురించి ఇంతే గొప్పగా చెప్పాలంటే ఆమెను ‘గృహిణి’ అని గానీ, ‘టీచర్’ అని గానీ చెబితే సరిపోతుంది. వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ జిల్ బైడెన్, కెల్లీ ఇటువంటి షోలు ప్రసారం అవుతున్నప్పుడు సాధారణంగా ఒక ఉద్వేగ స్థితిలోకి గెస్టు చేరుకుంటారు. అప్పుడు గెస్టును హోస్టు ఓదారుస్తారు. కానీ గురువారం నాటి షోలో ఇందుకు భిన్నంగా జరిగింది. సాఫీగా సాగుతున్న సంసార నౌకను విడాకులనే ప్రతికూల గాలులు ఎంతగా అల్లకల్లోలానికి గురి చేస్తాయో చెబుతూ హోస్ట్ కెల్లీ గుండె తడితో మాట్లాడారు. అది ఆమె సొంత అనుభవం. ఆ అనుభవాన్ని స్క్రీన్‌పై జిల్ బైడెన్‌తో పంచుకున్నారు. కెల్లీ భర్త బ్రాండెన్ ట్యాలెంట్ మేనేజర్. అతణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కెల్లీ. అప్పటికే అతడు తన మొదటి భార్యతో విడిపోయి ఉన్నాడు. ఒక కూతురు. ఒక కొడుకు. వారిని కూడా తన పిల్లలుగా స్వీకరించారు కెల్లీ. తర్వాత వీళ్లిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. కూతురు వయసిప్పుడు ఆరేళ్లు. కొడుకు వయసు నాలుగేళ్లు. 2012లో డేటింగ్, 2013 పెళ్లి, 2020 నవంబరులో లో విడాకులు. భర్తే విడాకులు కావాలన్నాడు. కోర్టుకు అతడు చెప్పిన కారణం.. తమ మధ్య ‘సమసిపోయే స్వభావం లేని మనస్పర్థలు’ ఎన్నో ఉన్నాయని. విడాకులు వచ్చాక కెల్లీ ఏడ్చింది. పిల్లల్ని తీసుకుని పక్కకు వచ్చేసింది. ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులు అయినట్లయింది. తనకున్న వ్యాపకాలు ఆమెకు ఆ జ్ఞాపకాలు రాకుండా సహాయపడ్డాయి. అయినా కష్టమే. భర్త నుంచి దూరంగా వచ్చి మూణ్ణెల్లయినా కాలేదు. భర్త విడిపోయినట్లనిపిస్తుందా! ఏదో ఊరెళ్లినట్లు అనిపిస్తుంది కానీ. షోలో కెల్లీ గుండె తడిని తుడిచే ప్రయత్నం ఏమీ చేయలేదు జిల్ బైడెన్. అది సోలో చాట్. వాళ్లిద్దరే మాట్లాడుకోవడం. కెల్లీ బాధను చూసి రెండు విషయాలు చెప్పారు జిల్. ఒకటి: విడాకులతో స్త్రీ జీవితమేమీ అంతమైపోదు. రెండు : రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు మాటల్ని కెల్లీ ఊరికే విన్నారు తప్ప, ఆమెకేమీ ఊరటనిచ్చినట్లు లేవు! ‘‘కెల్లీ చూడు.. నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది’ అన్నారు. అదేదో నవ్వుతూ అనడం కాదు. నిజంగానే అన్నారు. గతాన్ని వెనకే వదిలేసి ముందుకు సాగిపోవాలని ఆ మాటలోని అంతరార్థం. విడాకుల తర్వాత స్త్రీలందరి జీవితం ఒకేలా ఉంటుంది. పురుషుడి సంగతి వేరే. ‘తట్టుకోలేకపోవడం’ అన్నది స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. ఆ బలహీనత పైకి కనిపించి పోతుంటే మరింతగా జీవితం ఆ స్త్రీని హడలుకొడుతుంది. కెల్లీ జీవితంలో జరిగినట్లే జిల్ బైడెన్ జీవితంలోనూ జరిగింది. కాకపోతే, కెల్లీ తన మొదటి భర్త పిల్లలిద్దరికీ మారుతల్లి అయ్యారు. జిల్ తన రెండో భర్త బైడెన్ కొడుకులిద్దరికీ తల్లిగా ప్రేమను పంచారు. జిల్ 1970 ఫిబ్రవరిలో బిల్ స్టీవెన్సన్ని పెళ్లి చేసుకున్నారు. 1975 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ‘జో బైడెన్‌తో తన భార్య పరిచయం తమ వివాహబంధాన్ని దెబ్బతీసిందని స్టీవెన్సన్ అంటాడు. ‘అతడివన్నీ మనసును బాధించే ఆరోపణలు’ అని జిల్ అంటారు. అతడితో విడాకులు తీసుకున్న రెండేళ్లకు 1977లో బైడెన్‌తో జిల్ పెళ్లి జరిగింది. బైడెన్ ఆమెకు పరిచయమైన తొలి రోజు జిల్ ఇంటికి వచ్చి రాగానే.. ‘మామ్, ఐ ఫైనల్లీ మెట్ ఎ జెంటిల్మన్’ అని చెప్పారట. ఆ సంగతిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు జిల్. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన బాధలో ఉన్నప్పుడు.. ‘రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది’ అని తల్లి తనతో అన్నమాటనే ఇప్పుడు తను చెబుతున్నానని టీవీ షోలో కెల్లీతో అన్నారు జిల్ బైడెన్. షోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు జిల్. విడాకుల టాపిక్కే షోకి హైలైట్ అయింది. సగటు మనిషి అయినా, సెలబ్రిటీ అయినా జీవితం ఒక దశలో ప్రతి ఒక్కరికీ ఇరుగ్గా అనిపిస్తుంది. అప్పుడే ధైర్యంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయాలి. నిజమే కదా. రేపటికి ఊపిరెలా అని అలోచిస్తామా?! -
చోరీ.. చోరీ
కొందరికి కార్లంటే ఇష్టం. ముఖ్యంగా వింటేజ్ కార్లు. ఈ బిజినెస్ ఐడియా ఏదో బావుందే అనుకున్నాడు మన హీరో. వెంటనే చేతివాటం చూపించడం మొదలెట్టాడు. తాళం లేకుండా నేర్పుగా డోర్ ఓపెన్ చేయడం, ఓనర్‌కు తెలియకుండా కార్లను చోరీ చేయడం లాంటి పనుల్లో స్టీరింగ్ తిరిగిన చేయి అయిపోయింది తనది. ప్రస్తుతం ఇలాంటి పాత్రనే ప్రభాస్ పోషిస్తున్నారంటూ ఫిల్మ్‌నగర్‌లో కొత్త టాక్. ‘జిల్’ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడి పాత్ర చేస్తున్నారని, దొంగ పాత్ర అని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ కార్లను దొంగలించే వ్యక్తిగా కనిపిస్తారట. ఈ కార్లను దొంగలించే ప్రయత్నంలోనే హీరోయిన్ పూజాతో ప్రేమలో పడతారట. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 1920ల కాలంలో జరగనుంది. ఇందుకోసం పురాతన కార్లను, సెట్లను డిజైన్ చేసి వాడుతున్నారు. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: అమిత్ త్రివేది. -
‘జిల్’సక్సెస్ మీట్
-
‘జిల్’మూవీ పోస్టర్స్
-
‘జిల్’ మూవీ స్టిల్స్
-
నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్
‘‘ఇది స్నేహితులతో కలిసి చేసిన సినిమా. ప్రభాస్ పరిచయం అయినప్పట్నుంచీ వంశీ, ప్రమోద్‌తో నాకు పరిచయం ఉంది. ఈ చిత్రంలో నా లుక్ డిఫెరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దర్శక, నిర్మాతలతో పాటు నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు. ఈ చిత్రం రషెస్ చూశాను. కథ ఎంత బాగా చెప్పాడో దర్శకుడు అంత బాగా తీశాడు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని గోపీచంద్ చెప్పారు. ఆయన కథానాయకునిగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘జిల్’. రాశీ ఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ మిర్చి, రన్ రాజా రన్ వంటి విజయాల తర్వాత ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘జిల్’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారనిపిస్తోంది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో రాధాకృష్ణకుమార్, రాశీఖన్నా, వంశీ, ప్రమోద్ పాల్గ్గొన్నారు. -
జిల్మనిపించేలా...
మనసుకు ఏదైనా హాయిగా అనిపిస్తే ‘జిల్’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ పేరుతోనే ప్రేక్షకులకు ఆ అనుభూతి పంచడానికి వస్తున్న చిత్రం ‘జిల్’. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గోపీచంద్, రాశీ ఖన్నా జంట కనువిందు చేస్తుంది. గిబ్రాన్ అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్లస్’’ అన్నారు. ప్రేమకథ నేపథ్యంలో నడిచే ఈ యాక్షన్ సినిమాలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్ అవసరాల, ప్రభాస్ శ్రీను, సుప్రీత్, కబీర్ తదితరులు నటించారు. ఎగ్జి క్యూటివ్ నిర్మాత: ఎన్. సందీప్. -
లుక్ బాగా కుదిరింది
‘‘నేను హీరోను కాక ముందు గోపీచంద్‌ను గోపీకృష్ణా మూవీస్ ఆఫీస్‌లో ఓసారి కలిశాను. ‘వర్షం’ సినిమా చేస్తున్నప్పుడు మా స్నేహం పెరిగింది. అప్పట్నుంచీ మేం చేసే సినిమాల గురించి చర్చించుకుంటాం. ఈ చిత్రానికి మంచి కథ, స్క్రీన్‌ప్లే కుదిరాయి. పాటలు కూడా బాగున్నాయి. నాకు ‘స్వింగ్ స్వింగ్’ అనే పాట బాగా నచ్చింది’’ అని హీరో ప్రభాస్ అన్నారు. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం - ‘జిల్’. ప్రమోద్, వంశీ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల సీడీని ప్రభాస్ ఆవిష్కరించి, గోపీచంద్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ -‘‘వాస్తవానికి ఈ చిత్రకథను రాధాకృష్ణ ఏడాదిన్నర క్రితం చెప్పాడు. నా కోసం వెయిట్ చేశాడు. దర్శక, నిర్మాతలు నన్నో కొత్త లుక్‌లో చూపించాలని, ఈ సినిమా మొదలుపెట్టారు. నిజంగానే లుక్ బాగా కుదిరింది. సినిమా కూడా బాగా వచ్చింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే స్టయిల్ యాక్షన్ మూవీ ఇది. పాటలు, డాన్సులు, ఫైట్స్, ఫొటోగ్రఫీ... అన్నీ బాగుంటాయి’’ అన్నారు. జిబ్రాన్, రాశీఖన్నా తదితరులు చిత్ర విజయంపై తమ నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇందులో గోపీచంద్ కొత్తగా కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. నిర్మాత ఆనంద ప్రసాద్, దర్శకులు శ్రీవాస్, సుజిత్, అశోక్, మారుతి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. -
కొత్త లుక్... సరికొత్త కథాంశం...
ఈ వేసవికి ‘జిల్’ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు గోపీచంద్. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. రాశీ ఖన్నా నాయిక. రాధాకృష్ణ కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, వి. వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ పాటలు స్వరపరిచారు. ఈ నెల 12న పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
థ్రిల్ కలిగించే జిల్
‘‘యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాకు ‘జిల్’ టైటిల్ అన్నప్పుడే అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. రేపు సినిమా చూసి ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలిపారు. ప్రభాస్‌తో‘మిర్చి’, శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసిన యు.వి. క్రియేషన్స్ సంస్థలో ఇది మూడో చిత్రం. రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా కథానాయిక. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘యాక్షన్ ఎపిసోడ్లు బాగా వచ్చాయి. ‘ఐ’, హిందీ ‘కిక్’ చిత్రాలకు ఫైట్‌మాస్టర్‌గా పనిచేసిన అణల్ అరుసు దీనికి పనిచేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.