
ప్రభాస్
కొందరికి కార్లంటే ఇష్టం. ముఖ్యంగా వింటేజ్ కార్లు. ఈ బిజినెస్ ఐడియా ఏదో బావుందే అనుకున్నాడు మన హీరో. వెంటనే చేతివాటం చూపించడం మొదలెట్టాడు. తాళం లేకుండా నేర్పుగా డోర్ ఓపెన్ చేయడం, ఓనర్‌కు తెలియకుండా కార్లను చోరీ చేయడం లాంటి పనుల్లో స్టీరింగ్ తిరిగిన చేయి అయిపోయింది తనది. ప్రస్తుతం ఇలాంటి పాత్రనే ప్రభాస్ పోషిస్తున్నారంటూ ఫిల్మ్‌నగర్‌లో కొత్త టాక్. ‘జిల్’ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడి పాత్ర చేస్తున్నారని, దొంగ పాత్ర అని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ కార్లను దొంగలించే వ్యక్తిగా కనిపిస్తారట. ఈ కార్లను దొంగలించే ప్రయత్నంలోనే హీరోయిన్ పూజాతో ప్రేమలో పడతారట. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 1920ల కాలంలో జరగనుంది. ఇందుకోసం పురాతన కార్లను, సెట్లను డిజైన్ చేసి వాడుతున్నారు. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: అమిత్ త్రివేది.
Comments
Please login to add a commentAdd a comment