నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్ | Prabhas takes care on my look says Gopichand | Sakshi
Sakshi News home page

నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్

Published Mon, Mar 23 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్

నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్

‘‘ఇది స్నేహితులతో కలిసి చేసిన సినిమా.  ప్రభాస్ పరిచయం అయినప్పట్నుంచీ వంశీ, ప్రమోద్‌తో నాకు పరిచయం ఉంది. ఈ చిత్రంలో  నా లుక్ డిఫెరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దర్శక, నిర్మాతలతో పాటు నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు. ఈ చిత్రం రషెస్ చూశాను. కథ ఎంత బాగా చెప్పాడో దర్శకుడు అంత బాగా తీశాడు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని గోపీచంద్  చెప్పారు. ఆయన కథానాయకునిగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘జిల్’.
 
  రాశీ ఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్న  ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ మిర్చి, రన్ రాజా రన్ వంటి విజయాల తర్వాత ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘జిల్’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారనిపిస్తోంది’’ అన్నారు.  ఇంకా ఈ వేడుకలో రాధాకృష్ణకుమార్, రాశీఖన్నా, వంశీ, ప్రమోద్ పాల్గ్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement