
ప్రపంచంలోనే అతి పొడవైన క్రిస్‌మస్ చెట్టు...
బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో రోడ్రిగో డి ఫ్రీటస్ లాగూన్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపొడవైన , నీటిపై తేలే క్రిస్‌మస్ ట్రీ ఇది. 85 మీటర్ల పొడవు, 542 టన్నుల బరువు ఉన్న ఈ క్రిస్‌మస్ చెట్టు 31 లక్షల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. జనవరి 6 దాకా మెరిసిపోనున్న ఈ క్రిస్‌మస్ చెట్టు ప్రపంచంలోనే అతిపెద్దదని గిన్నిస్ బుక్‌వారు కూడా రికార్డు కట్టబెట్టేశారు.