ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్ శాంటోస్ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.
గాయని, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది. ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్ అయింది.
1960లో క్వీన్ ఆఫ్‌హైట్ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్. వీరికి ముగ్గురు పిల్లలు. మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట.
Comments
Please login to add a commentAdd a comment