
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు!
ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు!