డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ సీజన్. నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇంటిని అలంకరించడండతో మొదలు కొని అన్నీ ఏర్పాట్లతో బిజీబిజీగా గడుపుతుంటారు. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. సరిగ్గా ఇలాగే ఓ పెద్ద క్రిస్మస్ చెట్టును ఇంటికి తీసుకొచ్చారు. దానిని అందంగా ముస్తాబు చేస్తుండగా ఓ విషపూరితమైన పాము కనిపించింది. ఆ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
చదవండి: ఓరి వీడి వేశాలో... తల ఆరబెట్టాలంటే ఇలా చేయాలా!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ట్రీని ఇంటికి తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది. దీనితో భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన అతడు.. ఆ పామును చెట్టును నుంచి తీసి దూరంగా అడవుల్లో విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. ఎలా వచ్చిందో గానీ సడన్‌గా ప్రత్యక్షమైంది!
Comments
Please login to add a commentAdd a comment