క్రిస్మస్ పండగ అనంగానే అందరికి ముందుగా గుర్తు వచ్చేది శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత), క్రిసమస్ చెట్లు అవునా!. పైగా పిల్లలకు మంచి గిఫ్ట్‌లు ఇచ్చే శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత)నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ క్రిస్మస్ చెట్టు. ప్రతి ఒక్కరూ చాలా అందంగా అలంకరిస్తారు. అయితే ఈ అలంకరించేటప్పడూ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా పెద ప్రమాదాలు సంభవిస్తాయంటున్నారు నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధికారులు.
(చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!)
అసలు విషయంలోకెళ్లితే...అందరూ క్రిస్మస్ పండుగ రోజు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ చెట్టుని చాలా అందంగా అలంకరిచటమే కాకుండా విద్యుత్ దీపాలతో ధగధగ మెరిసేలా చేస్తుంటారు. అయితే క్రిస్మస్ మొక్కను డ్రైగా ఉంచకూడదట. అలంకరించడానికి ముందే క్రిస్మస్ చెట్టుని నీటిలో ఉంచితే ఎటువంటి ప్రమాదం జరగదంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ నెట్టింట ఒక వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!)
Comments
Please login to add a commentAdd a comment