భారతీయలు, అమెరికన్ల ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ స్పష్టంగా ఇలా ఉంటాయని మాత్రం తెలియదు. అయితే ఇక్కడొక అమెరికా మహిళ ఆ విషయంలో ఇరు దేశాల ప్రజలకు ఎంత వ్యత్యాసం ఉందనేది చేసి చూపించింది. అది చూస్తే వామ్మో ఇంత తేడానా అని ఆశ్యర్యపోతారు.
భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లకు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వాళ్లకు వినోధభరితంగానూ, ఆశ్యర్యానికి గురి చేసే విధంగానూ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయతను బట్టి భాష, సంప్రదాయాల్లో చాలా వైరుధ్యాలు అడగడుగున కనిపిస్తుంటాయి. ఇక భారతీయులు, అమెరికన్ల ఆహారపు అలవాట్లు, ఫ్లోర్‌ని తుడిచే విధానంతో సహా ఉండే వ్యత్యాసాల గురించి సవివరంగా తెలిపేలా వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్.
అమెరికా పౌరురాలు. 2017లో భారత్‌కు వచ్చి న్యూఢిల్లీ నివసిస్తున్నప్పుడు తనకెదురైనా అనుభవాన్ని ఇలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ముందుగా వంటకాల దగ్గర నుంచి మొదలుపెట్టింది. యూఎస్‌లో ఉప్పు మిరియాలను మసాలాగా ఉపయోగిస్తే..భారత్‌లో ఎండు మిర్చి కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాల, జీరా పొడి, నల్లమిరియాలు వంటివి ఉపయోగిస్తారు. ఇక భోజనం చేసే సమయాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. యూఎస్‌లో డిన్నర్ టైం సాయంత్రం 5 గంటలకే ప్రారంభం కాగా, అదే భారత్‌లో రాత్రి పదిగంటల సమయంలో మొదలవ్వుతుంది.
ఇక కాఫీ, టీలు తాగే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. అమెరికన్లు పెద్ద కప్పులలో కాఫీ తాగేందుకు ఇష్టపడగా, భారతీయులు చిన్న కప్పులలో చాయ్‌ని సిప్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక తినే విషయంలో కూడా తీరు వేరుగా ఉంటుంది ఇరు దేశాల ప్రజలకు. అమెరికన్లు ఫోర్క్‌ని ఉపయోగించగా, భారతీయులు చేతితో తినేందుకు ఇష్టపడతారని. అలాగే పిల్లలను అమెరికన్లు ఉయ్యాలలోనూ లేదా సెపరేట్ బెడ్‌పై పడుకోపెట్టగా..భారతీయుల మాత్రం తమ పక్కనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఇల్లుని తుడిచే విధానంలో భారతీయులు కాళ్లపై కూర్చొని క్లీన్ చేయగా వాళ్లు క్లీనింగ్ స్టిక్‌తో శుభ్రపరుస్తారంటూ.. చాలా అందంగా వివరించింది క్రిస్టెన్ వీడియోలో.
(చదవండి: దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..)
Comments
Please login to add a commentAdd a comment