Drug Dealer Decorated Christmas Tree With Cash And Cocaine: కొంతమంది అత్యుత్సహం లేదా వింతగా చేయాలనో చేసే పనులు వాళ్లను ఏ స్థితికి తీసుకువెళ్లుతుందో కూడా చెప్పలేం. ఒకచోట ఒక కుటుంబం క్రిస్మస్ చెట్టుని మంచి విద్యుత్ బల్బులతో అలంకరించి పెద్ద అగ్నిప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యక్తి విన్నూతనంగా క్రిస్మస్ చెట్టును అలంకరించి తనను తానే పోలీసులకు పట్టుబడేలా చేసుకున్నాడు.
(చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!)
అసలు విషయలోకెళ్లితే.... యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మార్విన్ పోర్సెల్లి అనే ఒక డ్రగ్ డీలర్ క్రిస్మస్ చెట్టుని డబ్బులతోనూ, మాదక ద్రవ్యాలతోనూ అందంగా అలంకరించాడు. పోనీ అక్కడితే ఆగకుండా వాటిని తన మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అంతే ఆ ఫోటోలు కాస్త ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ పోలీసులకు చేరడంతో పోర్సెల్లిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ క్రిస్మస్ చెట్టు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
పైగా డ్రగ్స్‌కి బానిసైతే వారి అభిరుచి ఇంతటి విచిత్రమైన అలంకరణకు పురిగొలుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తి నుంచి సుమారు రూ 37 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు. అంతేకాదు ఓవర్‌బోర్డ్ అనే పేరుతో ఒక సంవత్సరం పాటు సాగిన ఆపరేషన్‌లో పోర్సెల్లిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో పోర్సెల్లి తోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్టు చేసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్‌లు)
Can you imagine our surprise when we searched the mobile of Wavertree drug dealer Marvin Porcelli and found this?! 😮 pic.twitter.com/CvLOiFOwyJ
— Merseyside Police (@MerseyPolice) December 20, 2021
We also caught eight other (un)wise men as part of Overboard and found lots of interesting parcels under the tree (as well as in other parts of their houses), namely drugs worth £1.3m pic.twitter.com/PeHOv8n4RO
— Merseyside Police (@MerseyPolice) December 20, 2021
Comments
Please login to add a commentAdd a comment