దివిలో దివ్యంగా క్రిస్‌మస్‌ ట్రీ! | NASA Finds Christmas Tree Cluster Twinkling in Space, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Christmas Star Cluster Photo: దివిలో దివ్యంగా క్రిస్‌మస్‌ ట్రీ!

Published Sun, Dec 24 2023 4:57 AM | Last Updated on Sun, Dec 24 2023 6:03 PM

NASA Finds Christmas Tree Cluster Twinkling in Space - Sakshi

ఆకాశం అనే కాన్వాస్‌ అద్భుత చిత్రాలకు వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే... అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్‌–రే అబ్జర్వేటరీ’  కాప్చర్‌ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్‌మస్‌ ట్రీ కనువిందు చేస్తోంది.

భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్‌ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్‌జీసీ 2264’ అని పిలుస్తారు.

దేశంలోనే పెద్దదైన క్రిస్‌మస్‌ ట్రీ బెంగళూరులో ఉంది. వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్రిస్మస్‌ చెట్టు సబ్రీ నగర్‌లోని ‘ఫినిక్స్‌ మాల్‌ ఆఫ్‌ ఏషియా’ పరిసరాల్లో ఉంది. ‘సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌’గా మారింది.

మరో విశేషం ఏమిటంటే మూడుసార్లు గ్రామీ అవార్డ్‌ గెలుచుకున్న మ్యూజిక్‌ కంపోజర్‌ రిక్కీ కేజ్‌ ఈ ట్రీ గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెర్మనీ సందర్భంగా లైవ్‌ మ్యూజిక్‌ షో చేశాడు.
బెంగళూరులో దేశంలోనే పెద్దదైన క్రిస్‌మస్‌ ట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement