Merry Christmas 2023
-
Merry Christmas: బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు. వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్బైజాన్లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్ ఆవేదన వ్యక్తంచేశారు. -
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె -
దివిలో దివ్యంగా క్రిస్మస్ ట్రీ!
ఆకాశం అనే కాన్వాస్ అద్భుత చిత్రాలకు వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే... అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ’ కాప్చర్ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్మస్ ట్రీ కనువిందు చేస్తోంది. భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్జీసీ 2264’ అని పిలుస్తారు. దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ బెంగళూరులో ఉంది. వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు సబ్రీ నగర్‌లోని ‘ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా’ పరిసరాల్లో ఉంది. ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా మారింది. మరో విశేషం ఏమిటంటే మూడుసార్లు గ్రామీ అవార్డ్ గెలుచుకున్న మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ ఈ ట్రీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా లైవ్ మ్యూజిక్ షో చేశాడు. బెంగళూరులో దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
కొత్త పిన్ కోడ్‌తో బిర్యానీ డెలివరీ.. సిద్దమైన బావర్చి
క్రిస్మస్, న్యూ ఇయర్లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్‌లో 31 అనే కొత్త పిన్ కోడ్‌తో అమీర్‌పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్‌రామ్‌గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు. -
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్‌లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ సేల్‌లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023