క్రిస్మస్, న్యూ ఇయర్‌లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్‌లో 31 అనే కొత్త పిన్ కోడ్‌తో అమీర్‌పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్‌రామ్‌గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది.
బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి.
హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment