ఆహారప్రియుల ఆన్‌లైన్ ఆర్డర్లలో వరుసగా తొమ్మిదో ఏడాదీ అగ్రస్థానం
8.3 కోట్ల ఆర్డర్లతో దేశంలోకెల్లా అత్యధిక ఆదరణ చూరగొన్న వంటకం
158 సగటున నిమిషానికి నెటిజన్లు బుక్ చేసుకున్న ఆర్డర్లు
2.3 కోట్ల ఆర్డర్లతో రెండో స్థానంలో నిలిచిన దోశ
పాస్తా కోసం రూ. 49,900 ఖర్చు చేసిన ఓ వినియోగదారుడు
స్విగ్గీ వార్షిక నివేదికలో వెల్లడైన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్‌గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్‌లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్‌తో వార్షిక నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని విశేషాలు ఇవీ..
⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది.
⇒ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్‌లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్‌ల కంటే దాదాపు 29% ఎక్కువ.
⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్‌క్రీం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి.
⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు.
⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్.
⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం.
⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్‌లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్‌లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు.
⇒ బ్రేక్‌ఫాస్ట్‌గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు.
⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు.
⇒ 24.8 లక్షల ఆర్డర్‌లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్‌గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్‌లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్‌లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్‌నైట్ ఆర్డర్లలో టాప్‌లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది.
⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్‌లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment