Swiggy online portal
-
ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ.. స్విగ్గీ కొత్త కార్యక్రమం
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దేశవ్యాప్తంగా ఆహార వృథాను అరికడుతూ, పేదల ఆకలిని తీర్చేందుకు కొత్తగా ‘స్విగ్గీ సర్వ్స్(Swiggy Serves)’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆహార వృథాను కట్టడి చేసేందుకు మిగులు ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనే స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.స్విగ్గీ సర్వీసెస్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల విస్తృత నెట్వర్క్ నుంచి మిగులు ఆహారాన్ని గుర్తించి, దాన్ని సేకరించేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ సహకారం తీసుకోనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. తినదగిన ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేస్తామని చెప్పింది. పైలట్ దశలో స్విగ్గీ సర్వీసెస్ 126కి పైగా రెస్టారెంట్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ప్రాథమికంగా 33 నగరాల్లో ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.ప్రతిష్టాత్మక లక్ష్యాలుఈ కార్యక్రమం ద్వారా తినదగిన ఆహారం వృథా కాకుండా 2030 నాటికి 50 మిలియన్ల మందికి భోజనం అందించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్విగ్గీ(Swiggy), ఆర్‌హెచ్‌ఏ తెలిపాయి. ఇది సామాజిక బాధ్యత పట్ల స్విగ్గీ నిబద్ధతను, స్థిరమైన, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి చేసే ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.టెక్నాలజీ అండస్విగ్గీ సర్వీసెస్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. మిగులు ఆహార సేకరణ, పునఃపంపిణీని సమన్వయం చేయడంలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించనుంది. ఆహార మిగులును అంచనా వేయడానికి, ఆహార పునఃపంపిణీ లాజిస్టిక్స్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అధునాతన అల్గారిథమ్‌లను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. భోజనం అవసరమైన వారికి నాణ్యత ప్రమాణాలతో సమర్థవంతంగా చేరేలా చూస్తుంది.ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ..‘స్విగ్గీ సర్వ్స్తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ఆర్‌హెచ్‌ఏ సహకారం కీలకం. ఆహారం వృథాను, ఆకలి సమస్యను ఏకకాలంలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మా రెస్టారెంట్ భాగస్వాముల నుంచి అవసరమైన వారికి ఆహారాన్ని పునఃపంపిణీ చేయడానికి ఆర్హెచ్ఏతో భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరిస్తాం’ అని అన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు నీల్ ఘోస్ మాట్లాడుతూ..‘ఆకలిని తగ్గించే ఈ భాగస్వామ్య మిషన్ కోసం రాబిన్ హుడ్ ఆర్మీ స్విగ్గీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆకలి సమస్యను తీర్చేందుకు ఇతరులను ప్రేరేపించడం మంచి పరిణామం’ అన్నారు.స్విగ్గీ సర్వ్స్లో ఎలా చేరాలంటే..రెస్టారెంట్ భాగస్వాములు స్విగ్గీ ఓనర్ యాప్‌లోని ఫామ్‌ను పూరించడం ద్వారా ఈ స్విగ్గీ సర్వ్స్లో చేరవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి సమన్వయం కోసం ఆర్‌హెచ్‌ఏ రెస్టారెంట్ భాగస్వాములతో వాట్సప్ సమూహాల ద్వారా కమ్యునికేట్ అవుతుందని తెలిపింది. ఆర్‌హెచ్‌ఏ వాలంటీర్లు ఈ భాగస్వాముల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటారు.తలసరి 55 కిలోల ఆహారం వృథాఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 195 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో నాలుగోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు. 2024లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI)లో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా తలసరి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతరాబిన్ హుడ్ ఆర్మీరాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనేది వేలకొద్దీ యువకులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, గృహిణులు, కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా ఉన్న స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థలో వాలంటీర్లను రాబిన్స్ అని పిలుస్తారు. ఈ వాలంటీర్లు రెస్టారెంట్లు/ పెళ్లిల్లు/ ఇవత కార్యక్రమాల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేస్తారు. పదేళ్లలో RHA ప్రపంచవ్యాప్తంగా 406 నగరాల్లో 153 మిలియన్ల మందికి పైగా భోజనాన్ని అందించింది. ప్రస్తుతం 13 దేశాల్లో 2,60,000+ మంది రాబిన్స్ ఉన్నారు. -
బిర్యానీ క్రేజ్ వేరే లెవల్.. 8.3 కోట్ల ఆర్డర్లు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) కొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుండడంతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘హౌ ఇండియా స్విగ్గీ ఇట్స్ వే త్రూ 2024’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది2024లో 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా బిర్యానీ(Biryani) నిలిచింది. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.2.3 కోట్ల ఆర్డర్లతో దోశ టాప్ బ్రేక్‌ఫాస్ట్‌గా నిలిచింది. 25 లక్షల మసాలా దోశ ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.డిన్నర్లోనే ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ పెట్టారు. 21.5 కోట్ల ఆర్డర్లతో లంచ్ ఆర్డర్ల కంటే డిన్నర్ సమయాల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది.అర్ధరాత్రి భోజనం చేయాలనుకునేవారికి చికెన్(Chicken) బర్గర్లు టాప్ ఛాయిస్‌గా నిలిచాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 18.4 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’బెంగళూరు వినియోగదారుడు పాస్తా విందు కోసం రూ.49,900 ఖర్చు చేయగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 250 ఉల్లిపాయ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.స్విగ్గీ డైనౌట్(Dineout) ద్వారా 2.2 కోట్ల మంది వినియోగదారులకు రూ.533 కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. డిస్కౌంట్లలో రూ.121 కోట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.స్విగ్గీ డెలివరీ భాగస్వాములు సమష్టిగా 1.96 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భారతదేశం చుట్టుకొలత కంటే చాలా రెట్లు ఎక్కువ. -
బిర్యానీయే బాస్!
సాక్షి, హైదరాబాద్: వంటకాల్లోకెల్లా బిర్యానీయే మరోసారి బాస్‌గా నిలిచింది. దేశంలోని ఆహారప్రియుల ఫేవరేట్ డిష్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధికం మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా తొమ్మిదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుంచి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచి్చనట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకనుకు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్‌తో వార్షిక నివేదికను విడుదల చేసింది.నివేదికలోని విశేషాలు ఇవీ.. ⇒ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. ⇒ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తేడిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. ⇒ అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్‌క్రీం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ⇒ బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాదిలో ఏకంగా రూ. 49,900 ఖర్చు చేశాడు. ⇒ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడుల్స్. ⇒ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్ల డెలివరీలు పూర్తి చేశారు. ఇది కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షలసార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ⇒ ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. ⇒ బ్రేక్‌ఫాస్ట్‌గా 85 లక్షల దోసెలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాదివాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. ⇒ బెంగళూరువాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా.. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా నగరాల ప్రజలు చోలే, ఆలూ పరాటా, కచోరీలను ఆరగించారు. ⇒ 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్‌గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలూ ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ⇒ చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్నైట్ ఆర్డర్లలో టాప్‌లో నిలవగా రెండవ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకుంది. ⇒ ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.‘హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు అనే కస్టమర్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్షిప్ కార్డును వినియోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్ ఆర్డర్ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్ తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..సురేష్ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్షాట్లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
‘సింగం ఎగేన్’ టీమ్‌తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ అనే ఎన్జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్‌కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్‌వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్‌డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్‌లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్‌లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్‌స్లాబ్‌కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్‌ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
ఏడాదిలో 42శాతం పెరిగిన కంపెనీ ఇదీ..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది. అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
అరచేతిలో హోటళ్లు..
భద్రాద్రి: జోరుగా వాన కురుస్తుంది.. బిర్యానీ తినాలనిపించింది..బయటకు వెళ్లాలంటే వర్షం.. ఎలా అనిఆలోచించాల్సిన పనిలేదిప్పుడు. చేతిలో సెల్‌ఫోన్ ఉండి అందులో ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటే చాలు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి ఆన్లైన్లో పేమెంట్ చేయవచ్చు. లేకుంటే ఆర్థర్ బాయ్‌కి డబ్బులు చెల్లించవచ్చు. అనుకోకుండా చుట్టాలో, స్నేహితులో ఇంటికి వచ్చారనుకొండి ఏ మాత్రం టెన్సన్ పడాల్సిన పనిలేదు. వారు ప్రెషప్ అయ్యే సరికి వేడివేడిగా వారికి మనం ఆర్డర్ చేసిన ఆహారం అందించవచ్చు. ఎండ, వాన, చలి ఏ సమయంలోనైనా ఫుడ్ డెలివరీ యాప్స్‌తో మనకు ఇష్టామైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. గతంలో నగరాలు, పట్టణాలపై పరిమితమైన ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు ఇప్పుడు పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంలోని హోటళ్లు, బేకరీల నుంచి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్‌తో సారపాక, ఐటీసీ, తాళ్లగొమ్మూరు, కోయగూడెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ అందుతుంది. ప్రస్తుతం భద్రాచలం, సారపాకలలోని హోటళ్లు, బేకరీల నుంచి పరిసర గ్రామాలకు స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి సేవలు అందుతున్నాయి. బిర్యానీ, స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్ తదితర మాంసాహార వంటకాలు ఆర్డర్ చేసిన అరగంటకే వేడివేడిగా అందుబాటులోకి వస్తున్నాయి.స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. తొలిసారి యాప్‌లను వినియోగిస్తే ఫుడ్ బిల్లులో ఆఫర్లు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా పండుగలకు, ఓపెనింగ్లకు కూడా కొన్ని హోటళ్లు ఆర్డర్లపై ఆఫర్లను ప్రకటిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లతో సేవలందించేందుకు స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. సొంత పనులు చేసుకుంటునే చాలామంది యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న యువకులు, చదువుకుంటున్న యువకులు కూడా ఈ యాప్‌ల నుంచి సేవలను అందిస్తు ఉపాధిపొందుతున్నారు. పగటిపూట రోజువారీ పనులు చేసుకునే చాలామంది.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆర్డర్లను హోమ్ డెలివరీ చేస్తు ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ చేసే దూరం, ఫుడ్ పరిమాణాన్ని బట్టి బాయ్స్‌కు వేతనాన్ని అయా సంస్థలు అందిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లతో అటు వినియోగదారులకు, ఇటు హోటళ్లు, బేకరీల నిర్వహకులకు కూడా సౌకర్యవంతంగా ఉంది. ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్‌తో స్థానికంగా చాలామంది యువతకు ఉపాధి లభిస్తుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలపై పరిమితమైన ఈ యాప్‌లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలను అందిస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్‌తో ఈజీగా ఉంది మనకు కావాల్సింది తినాలనుకున్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం ఈజీగా ఉంది. మనం ఆర్డర్ చేసిన అరగంట వ్యవధిలోనే ఫుడ్ ఇంటికి వస్తుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో మన ఆకలి తీర్చేందుకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయటం సులభమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు మనకు కావాలి్సన ఫుడ్‌ను ఇంటికే తీసుకువస్తున్నాయి. – వై శివారెడ్డి, రెడ్డిపాలెం బంధువులొస్తే భయం లేదు మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బంధువులు ఇంటికి వస్తే వారికి అప్పటికప్పుడు వండి పెట్టలేము. వాళ్లు ఫ్రెష్ అయ్యేసరికి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే అరగంటలోపే ఫుడ్ ఇంటికి వస్తుంది. స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు అన్నిరకాల ఫుడ్ ఐటెమ్స్‌ను మనం ఆర్డర్ చేసుకున్న దానిని బట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ సేవలు చాలా బాగున్నాయి. – రాజశేఖర్, సారపాక -
స్విగ్గీకి పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టాఫ్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్‌వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ) పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్‌స్టామార్ట్.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది. (షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?) 3 గంటల వరకు.. ‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సందేశాలు పంపించింది. జూన్ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్‌స్టామార్ట్ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు. జెప్టో సైతం.. ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సేవలు ఆఫర్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే ప్రశ్నగా పేర్కొన్నాయి. -
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
Swiggy Delivery: తెగ లాగించేశారట..!!
-
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
హైదరాబాద్: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ సమ్మెబాట, స్పందించిన యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనుననారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫార్మ్ వర్కర్స్ యూనియన్.. పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతోంది. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్. ఒకవేళ స్విగ్గి యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. స్స్విగ్గి డెలివరీ బాయ్స్ డిమాండ్స్ 1. డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి. 2. ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి. 3. నెల రేటింగ్స్ కి 4000 బోనస్ ఇవ్వాలి. 4. కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి. 5. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్ జోన్స్ తీసేయాలి. స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ముందుగానే స్విగ్గీ బాయ్స్ సమ్మెకు దిగారు. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అధికం..! డెలివరీ బాయ్స్ నిరసనలపై స్విగ్గీ యాజమాన్యం స్పందించింది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ మేర సంపాదిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అధిక ఆదాయాలను పొందుతున్నారు. పేఅవుట్ స్ట్రక్చర్‌లో ఏలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్‌లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు గత ఏడాదితో పోలిస్తే గంటకు 30 శాతం ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా స్విగ్గీ ఇంధన ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టిందని వెల్లడించింది. దురదృష్టవశాత్తూ, కొంతమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని కంపెనీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌లోని వేలాది మంది ఎగ్జిక్యూటివ్‌లకు మెడికల్ ఇన్సూరెన్స్, కోవిడ్ కవర్ ఎక్స్టెన్షన్, యాక్సిడెంట్ కవర్ వంటి ప్రయోజనాలతో పాటుగా విశ్వసనీయమైన, స్థిరమైన సంపాదన అవకాశాలను కల్పిస్తున్నందుకు కంపెనీ గర్విస్తోందని పేర్కొంది. -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!
కరోనా మహమ్మూరి సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జోమాటో, స్విగ్గీ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫుడ్‌ని డెలివరీ చేశాయి. అంతేకాదు ఆ క్లిష్ట సమయంలో డెలివరీ బాయ్స్ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్లి ఆహారం, నిత్య అవసరాలను ఇళ్ల వద్దకే నేరుగా తీసుకు వచ్చి అందించారు. ఈ మహమ్మారీ సమయంలో డెలివరీ బాయ్స్ హీరోల్లా సేవంలందించి అందరీ ప్రశంసలను అందుకున్నారు. కానీ ఉదయ్‌పూర్‌లోని ఒక మాల్ డెలివరీ బాయ్స్‌ని ఇబ్బందికీ గురి చేసేలా ఒక నోటీస్ అంటించింది. ఈ నోటీస్ చాలా మందిని కలవరపాటుకు గురి చేయడమే కాక ఈ ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి వివక్షత కొనసాగుతోందా అని ఒకింత ఆశ్చర్యపోక తప్పదేమో! (చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి) ఇంతకీ ఆ నోటిస్ సారాంశం ఏంటంటే "జోమాటో, స్విగ్గీ ఫుడ్ డెలిరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయకండి...మెట్ల వైపు నుంచే వెళ్లండి " అని ఉంది. ఈ క్రమంలో వాళ్లు వినియోగదారులకు సమయానికీ ఫుడ్ అందించలేరు, పైగా మరో ఆర్డర్‌ని కూడా తీసుకోలేరు. ఈ నోటిస్ని జర్మలిస్ట్ శోభనా నాయర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పాటు " ఆధునిక కాలపు భూస్వామ్యం" అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌వుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆగ్రహంతో తమదైన శైలిలో ఘాటుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకే ఈ దేశం ఇంకా వెనుకబడి ఉందని ఒకరు, ఇది డెలివరీ బాయ్స్ పట్ల వివక్ష, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని...పలురకాలుగా నెటిజన్లు ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా) Modern day feudalism pic.twitter.com/edqYwQe5Qj — Sobhana K Nair (@SobhanaNair) September 18, 2021 -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ!
జీఎస్టీ కౌన్సిల్ అనూహ్య నిర్ణయానికి సిద్ధమైంది. ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకురాబోతోంది. జీఎస్టీ విధించే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇక మీదట ఫుడ్ డెలివరీ యాప్‌లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ-కామర్స్ ఆపరేటర్లైన ఫుడ్ డెలివరీ సర్వీసులు.. జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్ సర్వీస్ స్టార్టప్‌లకు జీఎస్టీ భారం తప్పేలా కనిపించడం లేదు. శుక్రవారం(సెప్టెంబర్ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో.. ఫుడ్ డెలివరీ యాప్‌లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే.. ఆన్లైన్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ పరిధిలోకి తీసుకొచ్చి మరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారీ నష్టం కారణంగానే.. ఒకవేళ ఈ నిర్ణయం గనుక అమలు చేస్తే.. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి సదరు యాప్‌లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ బావిస్తోంది. ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్ ప్రకారం.. ఫుడ్ డెలివరీ యాప్‌లను ట్యాక్స్ కలెక్టర్స్ ఎట్ సోర్స్‌గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం లెక్కగట్టింది!. రెస్టారెంట్ కార్యకలాపాలను అన్‌రిజిస్ట్రర్ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ట్యాక్స్ తక్కువే అయినా.. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి పన్ను ఎగవేత మొత్తం కూడా గణనీయమైనదిగా భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అందుకే జీఎస్టీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. చదవండి: జొమాటో అతలాకుతలం -
షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్
గ్రేటర్ నోయిడా(లక్నో): స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యమైందని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఓ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి డెలివరీ ఏజెంట్‌ని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘స్విగ్గీ ఏజెంట్ చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ సేకరించడానికి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బిర్యానీ సిద్ధంగా ఉన్నప్పటికీ రెస్టారెంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఆర్డర్‌కు మరికొంత సమయం పడుతుందన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట ఈ క్రమంలో రెస్టారెంట్ ఉద్యోగిని డెలివరీ ఏజెంట్ అసభ్యంగా దూషించాడు. కాగా రెస్టారెంట్ యజమాని సునీల్ అగర్వాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే డెలివరీ ఏజెంట్ అతని స్నేహితుడి సహాయంతో అతని తలపై కాల్చాడు’’ అని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ ఉద్యోగి, ఇతర సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు గురైన వ్యక్తిని సునీల్ అగర్వాల్‌గా గుర్తించారు. అతడు మిత్రా అనే నివాస సముదాయం లోపల ఓ రెస్టారెంట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ -
స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సిగ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీలో తన మార్క్ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది. గ్రోసరీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్‌కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్ సిటీస్ వరకు డెలివరీ సర్వీసెస్‌లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్, డిన్నర్‌కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా, పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్ వేసింది. త్వరలోనే ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రోసరీస్ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష తెలిపారు. దూకుడుగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. -
స్విగ్గీకి షాక్! రూ.4.50 జీఎస్టీకి... రూ.20వేల ఫైన్
పంచకుల(హర్యానా): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది! కస్టమర్ నుంచి అనుచితంగా పన్ను వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరం ఫైర్ అయ్యింది. అనవసరంగా పన్ను విధించినందుకు, వినియోగదారున్ని మానసిక వేధనకు గురి చేసినందుకు భారీగా ఫైన్ విధించింది. కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్ గార్గ్ స్విగ్గీ ద్వారా స్విగ్గీ మొబైల్యాప్ ద్వారా చీజ్ గార్లిక్ స్టిక్‌తో పాటు మూడు సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. ఇందులో గార్లిక్ స్టిక్కి రూ. 144, కూల్‌డ్రింక్స్‌కి రూ.90లు అయ్యింది. అయితే బిల్ వచ్చిన తర్వాత పరిశీలిస్తే సాఫ్ట్‌డ్రింక్స్‌కి ప్రత్యేకంగా రూ. 4.50 జీఎస్టీగా స్విగ్గీ వసూలు చేసినట్టు గమనించాడు. కొనుగోలు చేసిన వస్తువులకు ఎంఆర్పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్‌డ్రింక్‌కి జీఎస్టీ వసూలు చేయడం కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పంచకుల వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. మా తప్పేం లేదు అయితే తాము కేవలం మధ్యవర్తులమేనని, సాఫ్ట్‌డ్రింక్ అమ్మకం దారు పాలసీకి అనుగుణంగానే జీఎస్టీ వసూలు చేశామని, తమ సేవల్లో లోపం లేదంటూ పేర్కొంది. అయితే స్విగ్గీ వాదనలు విన్న ఫోరం మండిపడింది. స్విగ్గీ ఏమీ ఛారిటబుల్ ట్రస్ట్ కాదని, వినియోగదారు, అమ్మందారుల మధ్యవర్తిగా ఉంటూ డెలివరీ పనులు నిర్వహిస్తోందని పేర్కొంది. రూ. 20,000 ఫైన్ కట్టండి చట్ట విరుద్ధంగా సాఫ్ట్‌డ్రింక్‌పై జీఎస్టీగా రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా వసూలు చేసిన రూ. 4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు కోర్టు, ఇతర ఖర్చుకు గాను అభిషేక్ గార్గ్‌కి రూ. 10,000 చెల్లించాలంది. దీంతో పాటు జరిగిన పొరపాటుకు జరిమానాగా రూ. 10,000 హర్యాణా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వేల్ఫేర్‌కి డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రముఖ హీరోయిన్‌కు చేదు అనుభవం.. భోజనంలో చచ్చిన బొద్దింక!
ప్రముఖ దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సాయంత్రం తను ఆర్డర్ చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దిక వచ్చందంటూ సదరు రెస్టారెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆహరంలో ఉన్న బొద్దింక ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రెస్టారెంట్ పేరు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం సాయంత్రం నివేదా చెన్నైలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి ప్రముఖ ఫుడ్డెలివరి యాప్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంది. ఆర్డర్ రాగానే పార్శిల్ తెరిచి చూడగా అందులో చచ్చిన బొద్దింక దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె మండిపడుతూ తన పోస్టులో ‘ప్రస్తుత రోజుల్లో స్విగ్గీ ఇండియా, ఆయా రెస్టారెంట్స్ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో అర్థం కావడం లేదు. నిన్న నేను ఆర్డర్ పెట్టుకున్న ఆహారంలో బొద్దింక వచ్చింది. ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి రెస్టాంటెంట్స్ను రోజు తనిఖీ చేసి క్వాలిటీ లోపం ఉంటే భారీగా జరిమాన విధించడం చాలా అవసరం. ప్రస్తుతానికి అయితే ఈ రెస్టారెంట్‌పై ఓ కన్నేసి అది సరైన ప్రమాణాలను పాటిస్తుందో లేదో చెక్ చేయాలని కోరుకుంటున్న’ అంటూ ఆమె సదరు రెస్టారెంట్ పేరును ట్యాగ్ చేసిందే అంతేగాక తమ రెస్టారెంట్ల జాబితా నుంచి ఈ రెస్టారెంట్న తొలగించాల్సిందిగా స్విగ్గీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. చదవండి: ‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ! -
స్విగ్గీ డెలివరీ బాయ్‌ని చితకబాది.. నగదు చోరీ
బెంగళూరు: జొమాటో డెలివరీ బాయ్ సంఘటన మరువక ముందే కర్ణాటకలో అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ సారి బాధితుడు స్విగ్గీ డెలివరీ బాయ్. ఉచితంగా భోజనం ఇవ్వనన్నందుకు స్విగ్గీ డెలివరీ బాయ్‌ని నలుగురు యువకులు దారుణంగా చితకబాదారు. మే 28న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కార్తీక్ హరిప్రసాద్(25) అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న సాయంత్రం 4 గంటలకు రాజాజీనగర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ క్రమంలో కార్తీక్ వారు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆర్డర్ చేశాక సదరు వ్యక్తులు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. ఇక కార్తీక్ ఫుడ్ తీసుకెళ్లి వారికి ఇచ్చి.. డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ వారు తాము ఆర్డర్ క్యాన్సిల్ చేశామని.. ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కార్తీక్ అందుకు ఒప్పుకోలేదు. ఈ ఆహారాన్ని బయట ఆకలితో ఉన్న వారికి ఇస్తానని తెలిపాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు, ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో నిందితులు కార్తీక్‌ను చితకబాది.. అతడి చేతిలో నుంచి మొబైల్, హెల్మెట్ లాక్కుని విసిరేశారు. ఆ తర్వాత అతడి వాలెట్ నుంచి 1800 రూపాయలు దొంగతనం చేశారు. కార్తీక్ తలపై రాళ్లతో కొట్టి.. రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి పారిపోయారు. కార్తీక్ అదృష్టం కొద్ది వేరే డెలవరీ బాయ్స్ అతడిని గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్ స్నేహితుడు ఒకరు జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చాలా మంది నెటిజనులు కార్తీక్‌కు ధన సహాయం చేయడానిక ముందుకు వచ్చారు. ఈ సమయంలో తనకు మగాది రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా సాయం చేశాడని.. తనతో నిరంతరం టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. ఇక త్వరలోనే బెంగళూరుకు వచ్చి.. తన మీద దాడి చేసిన కస్టమర్ల మీద ఫిర్యాదు చేస్తానని తెలిపాడు కార్తీక్. స్విగ్గీ కంపెనీ సదరు కస్టమర్ల వివరాలు పోలీసులకు అందజేస్తుందన్నాడు. ఇక కంపెనీ, పోలీసులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపాడు కార్తీక్. 4 CUSTOMERS BEAT UP DELIVERY EXECUTIVE! A delivery executive from #Swiggy was assaulted & left to bleed in #Bengaluru after customers refused to pay for food on May 28. 4 customers who failed to cancel the order, refused to pay which led to an argument.@NehaHebbs reports! pic.twitter.com/i4FkR4GCL0 — Mirror Now (@MirrorNow) June 8, 2021 చదవండి: ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే... స్విగ్గీ ఆర్డర్..ఇల్లు దోచేశారు! -
స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్పే, థ్రైవ్ వంటి టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చింజన్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్లైన్ ఆర్డర్ల లింక్‌లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్‌పై ఇంత చొప్పున కమీషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్‌ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఎక్కువ మందిని చేరుకోవచ్చు.. ‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్ వివరించారు. హంగర్ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్‌షాప్ తదితర బ్రాండ్లున్నాయి. థ్రైవ్ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్‌ఫామ్‌పైనే వీటిని ఆఫర్ చేస్తోంది. ‘‘మార్కెటింగ్‌కు ఇన్‌స్ట్రాగామ్ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్ చిల్ కేఫ్ సైతం సొంతంగానే ఆన్ లైన్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కోరుకున్న రుచులు రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్మ్యాటర్స్ ఇండియా పార్ట్నర్ గౌరీదేవిదయాళ్ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ. -
స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడులు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుడ్ ఆర్డర్లు, డెలివరీ సంస్థ స్విగ్గీలో గ్లోబల్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (రూ. 3,348 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే యోచనలో సాఫ్ట్‌బ్యాంక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌తో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్, కార్మిగ్నాక్, గోల్డ్‌మన్ శాక్ 80 కోట్ల డాలర్లు(రూ. 5,862 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు ఇంతక్రితం స్విగ్గీ వెల్లడించింది. ఉద్యోగుల ద్వారా: కంపెనీ ఉద్యోగులకు వ్యవస్థాపక సీఈవో శ్రీహర్ష మాజేటి ఈ నెల మొదట్లో పంపిన ఈమెయిల్ ద్వారా స్విగ్గీ తాజా డీల్ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రత్యర్థి సంస్థ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గీ డీల్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రోహిత్‌శర్మను ఇంతలా అవమానిస్తారా.. ‘స్విగ్గీ’పై ఫ్యాన్స్ ఫైర్
ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీపై నిప్పులు చెరుగుతున్నారు. భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, లక్షలాది మంది యువకులకు ఆరాధ్య క్రికెటర్ అయిన హిట్‌మాన్‌ను ఇంతలా అవమానిస్తారా? అని మండిపడుతున్నారు. ‘‘ఈ అహంకారపూరిత ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదు. మీకు తగిన శాస్తి చేస్తాం. ఇకపై మేము ఇలాంటి చెత్త ప్లాట్‌ఫాం నుంచి ఫుడ్ఆర్డర్ చేయబోం’’ అంటూ #BoycottSwiggy హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో దిగివచ్చిన స్విగ్గీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్ సేన కోల్‌కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌కు ముందు రోహిత్‌ను ఉద్దేశించి స్విగ్గీ ఓ ట్వీట్ చేసింది. హిట్‌మాన్ వడాపావ్ కోసం పరిగెత్తుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందుకు.. ‘‘తనను ద్వేషించే వాళ్లు దీనిని ఫొటోషాప్ చేసిందిగా చెబుతారు’’అంటూ క్యాప్షన్ జతచేసింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తికొచ్చింది. వెంటనే బాయ్‌కాట్ స్విగ్గీ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కాగా, ఫిట్నెస్ విషయంలో రోహిత్ శర్మ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ‘‘తనకు ఆట కంటే వడాపావ్ తినడమే ముఖ్యం’’ అంటూ కొంతమంది కామెంట్ చేయడం.. ఇప్పుడు స్విగ్గీ కూడా అదే తరహా ఫొటో షేర్ చేయడంతో అభిమానులు ఇలా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. ‘‘హిట్‌మాన్ అభిమానులకు ఓ ప్రత్యేక సందేశం. సరదాగా ఓ ఫ్యాన్ షేర్ చేసిన ట్వీట్‌ను మేం రీపోస్ట్ చేశాం. ఆ ఫొటో మేం సృష్టించింది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మేం ఎల్లప్పుడూ పల్టన్తోనే ఉంటాం’’ అని స్విగ్గీ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చింది. #BoycottSwiggy 😠 this isn't funny @swiggy_in pic.twitter.com/cdWBp6V1ql — Abhijeet🥇 (@KING__Ro45) April 13, 2021 Shameless Big Apps can do for Publicity!😕 Running Agendas On Social Media, Defaming National Players.Huh! Should Issue Public Apology to Rohit Sharma...#BoycottSwiggy #RohitSharma pic.twitter.com/4OUoO0wTTz — Trishaᴶᵃˢᵐⁱⁿⁱᵃⁿ♡ (@Prettyxfollies_) April 13, 2021 Dear @swiggy_in disrespecting our national hero is not acceptable. Shameful act! Do apologies or will uninstall your App & #BoycottSwiggy RT pic.twitter.com/o5uGTOnzrv — Rajeev Rajput (@TheRoyalRaajput) April 13, 2021 A special message to the Hitman’s fans We reposted a fan’s tweet in good humour. While the image was not created by us, we do admit it could’ve been worded better. It was not meant to offend anyone in the least. Needless to say, we’re always with the Paltan. — Swiggy (@swiggy_in) April 13, 2021 -
కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ చేస్తుండడంతో మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు లాక్డౌన్ అమల్లో చేస్తున్నారు. ఇక వారాంతాల్లో (శని, ఆదివారం) పూర్తి లాక్డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని వ్యాపార కార్యకలాపాలు అందుకనుగుణంగా వాటి పనివేళలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా దానికి అనుగుణంగా పనివేళలు మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్రలో రాత్రి 8 గంటల తర్వాత తాము డెలివరీ చేయలేమని జొమాటో, స్విగ్గీ సంస్థలు నిర్ణయించాయి. వినియోగదారులు కూడా ఇదే విషయాన్ని తమకు విజ్ఞప్తులు చేశారని ఆ సంస్థలు తెలిపాయి. రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు మినీ లాక్డౌన్ విధించడంతో ఈ మేరకు ఆయా సంస్థలు తమ సేవల సమయాన్ని కూడా మార్చేశాయి. ఈ మేరకు ఈ విషయాన్ని తమ వినియోగదారులకు యాప్‌లలో నోటిఫికేషన్ ద్వారా ఆ సంస్థలు తెలియజేశాయి. ఈ మారిన వేళల్లో భాగంగా ఉదయం 7 నుంచి రాత్రి 8గంటలలోపు మాత్రమే స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆహారం అందించనున్నాయి. ఈ సందర్భంగా తాము వినియోగదారులు, తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డెలివరీ చేస్తున్నామని ఆ సంస్థలు తెలిపాయి. చదవండి: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం -
గుడ్ న్యూస్ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ
సాక్షి, ముంబై: కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తమ సిబ్బంది అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్లు అందరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరిస్తామని వెల్లడించారు. అలాగే ఆ టీకా స్వీకరణ నిమిత్తం సెలవు తీసుకుంటే ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని వివేక్ సుందర్ పేర్కొన్నారు. టీకాలు తీసుకోవడానికి ముందు తమ డెలివరీ భాగస్వాములకు వర్క్‌షాప్, కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. అలాగే తగిన జాగ్రత్తలను తెలియచెప్పేలా ఒక ఆరోగ్య భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్విగ్గీ తాజా నిర్ణయంతో సుమారు 2 లక్షల డెలివరీ పార్ట్నర్లకు ప్రయోజనం లభించనుంది. కాగా దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారందరూ 2021 ఏప్రిల్ 1 నుంచి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
స్విగ్గీ ఆర్డర్..ఇల్లు దోచేశారు!
లక్నో: ప్రస్తుతం నడుస్తోంది ఆన్లైన్ యుగం. ఇల్లు దాటకుండా.. కాలు కదపకుండా నచ్చిన వస్తువులను, ఆహారాన్ని మనం ఉన్న చోటకే తెప్పించుకోగలుతున్నాం. ఇందుకు గాను ఆయా సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ బాయ్‌లను నియమించుకుంటారు. వీరు మన ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాటిని మనం ఉన్న చోటకు తీసుకొచ్చి అందజేస్తారు. అయితే యూపీకి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్స్ మాత్రం కాస్త డిఫరెంటు. వీరు కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటికి తీసుకురావడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల మీద కన్నేస్తారు. ఇంటి పరిసరాలను.. అందులో ఉన్న వస్తువులను స్కాన్ చేసుకుని వెళ్లి.. తీరిగ్గా రాత్రికి వచ్చి వాటిని దొంగతనం చేస్తారు. తాజాగా నోయిడాలో ఇలా దొంగతనం చేసి పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు.. నోయిడా స్విగ్గీ సంస్థ ఫుడ్ డెలివరీ కోసం కాంట్రాక్ట్ బేస్‌లో బులంద్‌షహర్ జిల్లాకు చెందిన మహమ్మద్ కఫిల్, రవి శంకర్ నియమించింది. ఈ క్రమంలో వీరు రెండు రోజుల క్రితం నోయిడాలోని ఒక ఇంట్లో రాత్రిపూట అక్రమంగా ప్రవేశించి, తాళం పగలగొట్టి, అక్కడున్న 32 ఇంచ్‌ల ఎల్ఈడీ టీవీ, 2 ట్రాక్సూట్లు, 2 వ్రిస్ట్ వాచ్‌లు, కొంత సొమ్మును దొంగిలించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సిగ్గీ డెలివరీ బాయ్‌ల నిర్వాకం వెలుగు చూసుంది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని.. వీరి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని నోయిడా అడిషనల్ డీసీపీ రన్వీజయ్సింగ్ తెలిపారు. అయితే నిందితులిద్దరిని ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు స్విగ్గీ సంస్థ ప్రకటించింది. తాము దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని స్విగ్గీ సంస్థ తెలిపింది. కాగా, దొంగిలించిన వస్తువులను కొన్న మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా తొందరలొనే పట్టుకుంటామని నోయిడా పోలీసులు తెలిపారు. చదవండి: ‘కుక్కలా ఉన్నావ్’ : బిగ్‌బాస్ ఫేమ్‌పై దారుణ ట్రోలింగ్ -
మిర్చీ బజ్జీ.. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: మీకు స్ట్రీట్‌ఫుడ్ అంటే ఇష్ట మా? తోపుడు బండ్లు, చిన్న స్టాల్స్‌లో విక్రయిం చే ఇడ్లీ, దోశ, మిర్చీ బజ్జీ, పానీపూరి, కట్లెట్, పావ్‌బాజీ వంటి వాటిని ఇష్టంగా లాగిస్తుంటారా? అయితే ఇకపై మీరు వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలను సైతం ఎంచక్కా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికెట్గల హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు స్వీకరించి ఆహారాన్ని డెలివరీ చేయడానికి మాత్రమే ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్విగ్గీతో చేసుకున్న ఒప్పందంతో రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు, స్టాల్స్‌లలో ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారులకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సురక్షిత ఆహారం తయారీపై శిక్షణ.. ఈ కార్యక్రమంలో భాగంగా సురక్షిత ఆహారం తయారీపై ‘ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్’(ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఆన్లైన్ శిక్షణ అందనుంది. అలాగే పాన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రిజిస్ట్రేషన్ పొందడంలో సహకారం, స్విగ్గీ యాప్ వినియోగంలో శిక్షణ లభించనుంది. డిజిటల్ మెనూ రూపకల్పన, ధరల ఖరారు వంటి అంశాల్లోనూ ఎఫ్‌ఓఎస్‌టీఏసీ అవగాహన కల్పించనుంది. ప్రస్తుతం చాలా చోట్ల వీధివ్యాపారులు వార్తాపత్రికల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండగా ఇకపై అలా కాకుండా ఆహార భద్రతా ప్రమాణాల మేరకు సురక్షిత ప్యాకింగ్ పద్ధతులపై వారికి శిక్షణ ఇవ్వనుంది. ఒక్కో వీధి వ్యాపారికి శిక్షణ ఖర్చుల కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ రూ.700 చెల్లించనుంది. ఎఫ్‌ఓఎస్‌టీఏసీ సంస్థ ఆన్లైన్ ద్వారా 4 గంటల శిక్షణ అందించనుంది. చిన్న నగరాల్లో సైతం... ప్రస్తుతానికి జీహెచ్ఎంసీతోపాటు గ్రేటర్ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ఆయా నగరాలు, పట్టణాల మెప్మా మిషన్ కో-ఆర్డినేటర్లకు ఈ కార్యక్రమం అమలు బాధ్యతను అప్పగించింది. మార్చిలోగా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన 9 పురపాలికల్లో అమల్లోకి తీసుకురానున్నారు. స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులపై కనీసం రూ. 25 వరకు సర్వీసు చార్జీలు విధించనున్నారని, దీని ద్వారా ఆయా పట్టణాల్లో చాలా మంది నిరుద్యోగ యువతకు డెలివరీ బాయ్స్‌గా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: భారీగా పెరిగిన ఉల్లి ధర గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ -
కరెంట్ షాక్‌తో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
అబిడ్స్: అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో విద్యుత్ వైరు తెగిపడడంతో స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని గోడేకికబార్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ముస్తాఫ్‌ఉద్దీన్(40) స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గోషామహల్ పాన్‌మండి నుండి మంగళ్‌హాట్ ప్రాంతానికి గురువారం అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి అతనిపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్ ఉద్దీన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న కొంత మంది స్థానికులు షాహినాయత్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్ఐ కిషన్‌లు విద్యుత్ అధికారులను రపించి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దాదాపు 3 గంటల పాటు శుక్రవారం తెల్లవారు జాము వరకు గోడేకికబర్, మంగళ్‌హాట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ సర్వే
బెంగళూరు: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీకి చెందిన స్థానిక కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సర్వే చేపట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలకూ సిబ్బందిని సరఫరా చేసిన మెర్లిన్ ఫెసిలిటీస్ ప్రయివేట్, సూర్య టీమ్ మేనేజ్మెంట్లకు చేసిన చెల్లింపులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదాయ పన్ను శాఖకు పూర్తి తోడ్పాటును అందిస్తున్న్లట్లు ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ విడిగా పేర్కొన్నాయి. పన్ను విధానాలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. చట్టాలకు అనుగుణంగా పనిచేసే తాము పన్ను, న్యాయ సంబంధ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు ఈ సందర్భంగా స్విగ్గీ స్పష్టం చేసింది. ఇదేవిధంగా ఆదాయపన్ను శాఖ అధికారులు తమను సంప్రదించినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వారికి అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. జీఎస్టీ ఎగవేత? ఇన్‌స్టాకార్ట్, స్విగ్గీ జారీ చేసిన ఇన్వాయిస్లను ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. సిబ్బందిని సరఫరా చేసిన రెండు కంపెనీలతో స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్ రూ. 300-400 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వీటిపై ఆరాతీస్తున్నట్లు అధికారి తెలియజేశారు. ఈ అంశంలో థర్డ్‌పార్టీ వెండర్స్గా వ్యవహరించిన కంపెనీలకు స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్ చేపట్టిన చెల్లింపులు, ఇన్వాయిస్లను సమీక్షిస్తున్నట్లు వివరించారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు బోగస్ ఇన్వాయిస్ల సృష్టి జరిగిందా అన్న అంశంపై సర్వే చేపట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ పొందడం ద్వారా పన్ను ఎగవేతదారులుగా నిలిచేవారిపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ దృష్టిసారించినట్లు తెలియజేసింది. -
చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
ఏం తిందాం? రెస్టారెంట్‌కు వెళ్లినా... ఇంటికి పార్శిల్ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్ ఎప్పుటినుంచో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. మనోళ్లు చికెన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్‌వెజ్, వెజ్ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్ స్టాట్‘ఈట్’స్టిక్స్ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్ హెల్తీఫుడ్కు మెట్రోల మొగ్గు: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్ గ్రెయిన్స్ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్ ఫుడ్ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్‌కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్ ఇడ్లీ, హైప్రోటీన్ కిచ్డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్విచెస్, గ్లూటెన్ రహిత ఐస్‌క్రీమ్‌లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కూ డిమాండే.. పానీపూరి, ఇతర స్ట్రీట్‌ఫుడ్‌ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. ► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్ చికెన్ బిర్యానీయే. ► ఈ ఏడాది 1 వెజ్బిర్యానీకి 6 చికెన్ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి ► లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్ చేశారు ► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్‌దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్‌ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి. ► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. ► ఈ ఏడాది ‘లాక్డౌన్ బర్త్‌డేస్’సెలబ్రేషన్స్ కోసం 6 లక్షల కేక్‌లు డెలివరీ అయ్యాయి. ► స్విగ్గీ డెలివరీ స్టాఫ్‌కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు . హైదరాబాద్ అభి‘రుచు’లు 1) చికెన్ బిర్యానీ 2) ఇడ్లీ 3) మసాలా దోశ 4) చికెన్ 65 5) పన్నీర్ బటర్ మసాలా 6) వడ 7) మటన్ బిర్యానీ 8) వెజ్ బిర్యానీ ఆర్డర్లలో టాప్–5 నగరాలు 1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్ 5) ఢిల్లీ -
ప్రతీ సెకనుకో బిర్యానీ : స్విగ్గీ సీక్రెట్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఇండియన్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటెంల జాబితాను ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. చికెన్ బిర్యానీ భారతదేశానికి ఇష్టమైన వంటకంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ,లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన ఇండియన్స్ 2020లో సెకనుకు ఒక చికెన్ బిర్యానీ లాగించేశారట. స్విగ్గీ స్టేట్ఈటిక్స్ 2020 ప్రకారం, ఈ ఏడాది ప్రతి సెకనుకు బిర్యానీ ప్లేట్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఆర్డర్ చేశారు. ప్రతి వెజ్ బిర్యానీకి, ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ అందుకుందట. "వెజ్, చికెన్, మటన్, ఆలూ ఇలా మొత్తంగా 2020లో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీని అర్డర్లను అందుకున్నామని స్వీగ్గీ మంగళవారం ప్రకటించింది. కరోనా కాలంలో సెకనుకో బిర్యానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెస్టారెంట్లు నెలల తరబడి మూసి వేయడంతో, నిబంధనల సడలింపు తరువాత తమ ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరిగిందని స్విగ్గీ తెలిపింది. మైటీ చికెన్ బిర్యానీ దేశానికి అత్యంత ఇష్టమైన వంటకంగా నిలిచిందని పేర్కొంది. ఇంకా ‘పన్నీర్ బటర్ మసాలా', 'మసాలా దోస', 'చికెన్ ఫ్రైడ్ రైస్' 'మటన్ బిర్యానీ' వంటి వంటకాలు భారతదేశానికి ఇష్టమైన పిక్-మీ-అప్ వంటకాలుగా ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రెండు లక్షల 'పానిపురి' ఆర్డర్లను డెలివరీ చేశామని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన స్విగ్గి హెల్త్‌హబ్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కూడా వృద్ధిని సాధించిందని కంపెనీ తెలిపింది. చికెన్ బిర్యానీ కోసమే 3 లక్షల మంది యాప్ ఇన్స్టాల్ మూడు లక్షల మంది కొత్త వినియోగదారులు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయడం కోసమే స్విగ్గి యాప్‌ను ఇన్స్టాల్ చేశారని వెల్లడించింది. దీంతోపాటు సూపర్ ధాన్యాల వంటకాల ఆర్డర్లలో 127 శాతం, శాకాహార వంటకాలు 50 శాతం, అధిక ప్రోటీన్ ఆహార పదార్థాలు 49 శాతం, కీటో- ఫ్రెండ్లీ ఐటెమ్స్ 46 శాతం పెరుగుదల నమోదు చేశాయి. అలాగే "హై-ఫైబర్ ఇడ్లీ, హై-ప్రోటీన్ కిచ్డీ, వేగన్ గ్రేవీ, లోఫ్యాట్ సలాడ్లు, కీటో-ఫ్రెండ్లీ శాండ్విచ్లు, గ్లూటెన్-ఫ్రీ ఐస్ క్రీమ్" లాంటి వంటకాలు స్విగ్గీ ప్లాట్ఫామ్లో 2020 లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆరు ఆరోగ్యకరమైన వంటకాలుగా నిలిచాయి. 2014 లో స్థాపించబడిన స్విగ్గి ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఉంది. ఏప్రిల్ 2020లో 43 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన స్విగ్గీ విలువ 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. -
వయసులో చిన్న.. వ్యాపారంలో మిన్న..!
న్యూఢిల్లీ: చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదాసీదా ఉద్యోగంతో తృప్తిచెందక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతృప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జీరోధా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండిల్ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. ఇంటర్నెట్ వేదికగా విస్తరణ 40 ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హరూన్ ఇండియా సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 ఆఫ్ ఎంటర్ ప్రెన్యుర్స్ అండర్ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్ వర్త్ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్ వేదికగా స్టార్టప్ పెట్టి జాక్ పాట్ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో తొలి 2 స్థానాల్లో ఉన్న జీరోధా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58% పెంచుకున్నారు. జాబితాలో 9వ స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్ అగర్వాల్ సంపద ఈ ఏడాది 40% పడింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం దీనికి కారణం. వీయూ టెక్నాలజీస్ (వూ బ్రాండ్) దేవిత సరాఫ్ సంపద కూడా 33% తగ్గింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత. ‘‘కొందరు స్టార్టప్‌ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా వైదొలగి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు దన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల వృద్ధిపై ఎంతో ప్రభావం చూపింది’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. -
స్విగ్గీ, జొమాటోతో టీకా డెలివరీ!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మరో కొద్ది నెలల్లో భారత్‌లో అందుబాటులోకి రావచ్చనే అంచనాల నేపథ్యంలో టీకా పంపిణీకి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకా డోసుల్ని ఉంచడానికి దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టీకా డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వ్యాక్సిన్ డోసుల్ని ఉంచడానికి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అవసరం. కేంద్ర ఆరోగ్య శాఖ భారీ కోల్డ్ స్టోరేజ్‌లను రెండు నెలల పాటు వాడుకోవడానికి వీలుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. -
ఇకపై స్విగ్గీలో స్ట్రీట్ ఫుడ్
న్యూఢిల్లీ: రోడ్డుపక్కన తినుబండారాలను త్వరలోనే తమ ఇళ్ళవద్దనే రుచి చూసే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో కలిసి, ఈ చిన్న వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురానుంది. పైలెట్ పథకంలో భాగంగా దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి నగరాల్లోని 250 వీధి ఆహార సరఫరా దారులతోటి ప్రారంభించి, దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది. వీధి వర్తకులు, వేలాది మంది వినియోగదారులను ఆన్లైన్లో చేరడానికి ఈ పథకాన్ని ‘ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్నిధి’ కిందకు తీసుకువస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. వీధి వర్తకులకు పాన్ కార్డ్ పొందడానికి, ఆహారభద్రతా ప్రమాణాల అథారిటీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, యాప్‌ల వినియోగంపై సహకరించనుంది. ఈ దుకాణం పెట్టుకోవడానికి, 50 లక్షల మంది వీధి వర్తకులకు రూ.10 వేల æసాయాన్ని అందించనుంది. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) -
కొనసాగుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన నాలుగవ రోజు కూడా కొనసాగుతోంది. తమ బేస్ పే తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ(శుక్రవారం) తమ 14 డిమాండ్లను తీర్చాలని యాజమాన్యాన్ని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు. ఇందులో ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చకపోయినా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి డెలివరీ చేస్తున్నప్పటికి తమ బేస్ పేను తగ్గించడం దారుణమన్నారు. గతంలో మాదిరిగా తమ బేస్ పే 35 రూపాయలను ఇవ్వాల్సిందిగా స్విగ్గీ బాయ్స్ డిమాండ్ చేశారు. (చదవండి: స్విగ్గీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు) -
స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం తమకు కమిషన్ తక్కువగా ఇస్తోందని మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా మంగళవారం ఆందోళన నిర్వహించారు. గతంలో 2 కిలోమీటర్ల పరిది లోపు ఒక డెలివరీ ఐటెమ్‌కు 35 రూపాయల కమిషన్ ఇస్తున్న సంస్థ ప్రస్తుతం భారీగా కోత విధించిందని తెలిపారు. ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దూరం పెరడంతో రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతోందని స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆరోపించారు. థర్టీ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ చెల్లిస్తోందని పేర్కొన్నారు. స్విగ్గీ మోసం చేస్తోందంటూ మాదాపూర్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామినిచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని డెలివరీ బాయ్స్ తెగేసి చెప్పారు. (చదవండి: ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది) -
బుట్ట భోజనం ఆర్డర్: ఓపెన్ చేస్తే ఈగ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా బయట ఫుడ్ తినాలంటేనే జనాలు జంకుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ భయాన్ని జిహ్వచాపల్యం అణిచివేస్తుంది. ముఖ్యంగా నగరవాసులు ఆహారం కోసం ఎక్కువగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలమీదే ఆధారపడుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఈగ వచ్చిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భాగ్యనగరానికి చెందిన బెల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కొండాపూర్‌లోని సుబ్బయ్యగారి హోటల్ నుంచి స్విగ్గీలో బుట్ట భోజనం ఆర్డర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ అతని ఆహారాన్ని తీసుకువచ్చి ఇవ్వగానే ఎంతో ఆతృతగా దాన్ని ఓపెన్ చేశాడు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) ఇంతలో హల్వాలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని మరింత పరిశీలించి చూడగా అది ఈగ అని తెలిసింది. దీంతో అతను సోషల్ మీడియాలో స్వీటు ఫొటోను పోస్ట్ చేశాడు. "ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కరోనా కాలంలోనూ మంచి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్తారు. కానీ తీరా ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు. అదృష్టం బాగుండి నేను దాన్ని తినకముందే చూశాను" అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన స్విగ్గీ క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొంది. (ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం?) -
ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్వోఎస్ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులిచ్చింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దన్నుగా ఉన్న డ్రోన్ స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌కు ఇది తొలి అడుగు కానుంది. గతేడాది నుంచే ప్రయత్నాలు .. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్ ఫ్లయిట్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్‌తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్ అధిగమించినట్లు గోయల్ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్ స్టార్టప్ సంస్థ టెక్‌ఈగిల్‌ను కూడా కొనుగోలు చేసింది. డ్రోన్ ట్రయల్స్‌కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మే నెలలో వెల్లడించింది. అనుమతి తప్పనిసరి... డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్..
సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ తమ వినియోదారులకు ఫుడ్ డెలీవరీ సదుపాయాన్నికల్పించనుంది. అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇక నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. కరోనా నేపథ్యంలో చిన్న రెస్టారెంట్లను ఆదుకునేందుకు, తామను తాము మెరుగుపరుచుకోడానికి ఫుడ్ డెలీవరీ సంస్థలు స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం అవుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ గురువారం వెల్లడించింది. ఇందుకు వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోడానికి ప్రత్యేక ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను సైతం ఇన్స్టాగ్రామ్ విడుదల చేసింది. ఈ విషయంపై ఈ- కామర్స్, రిటైల్ ఇండస్ట్రీ హెడ్ నితిన్ చోప్రా మాట్లాడుతూ.. "చిన్న వ్యాపారాలు కొనసాగడానికి, కస్టమర్లతో సన్నిహితంగా ఉండటానికి మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ కోసం, మేము ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్‌ను రూపొందిస్తున్నాము. స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది.’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..) అయితే ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్‌ను ఉపయోగించడానికి, రెస్టారెంట్లు, హోటళ్లు ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉండాలి. దీంతో చిన్న స్థాయి రెస్టారెంట్లు తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంస్థ కొత్తగా ప్రారంభించిన ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఇన్‌స్టా స్టోరీ, ప్రొఫైల్‌లో స్విగ్గీ, జోమాటో లింక్‌ను షేర్ చేసుకోవచ్చు దీని వల్ల వినియోగదారులు స్విగ్గీ, జోమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు తమ స్టోరీలలో జోమాటో,స్విగ్గీకి లింక్‌తో స్టిక్కర్లను పంచుకోవడం ద్వారా చిన్న తరహా వ్యాపారాలకు సహాయం చేయడంతోపాటు ఎక్కువ మంది రెస్టారెంట్లకు చేరడానికి సహాయపడుతుందని స్విగ్గీ పేర్కొంది. (అమెజాన్ డీల్ : ఎయిర్టెల్ క్లారిటీ) -
స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, డన్‌జోలు సరికొత్త రీతిలో వినియోగదారులను ఆకర్శించనున్నాయి. అందులో భాగంగానే త్వరలో డ్రోన్లను ఉపయోగించుకుంటు పుడ్ డెలివరీలు చేయనున్నాయి. దాదాపు 13 సంస్థల యాజమాన్యాలు డ్రోన్లను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. డ్రోన్లను ఉపయోగించేందుకు భారత వైమానిక దళం గతంలోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాగా జులై మొదటి వారంలోనే డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తామని త్రొట్టల్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నాగేందర్ కందస్వామి పేర్కొన్నారు. తాము ఉపయోగించే ముందు డ్రోన్లును పరీక్షించాలనుకున్నాం.. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆలస్యం జరిగిందని అన్నారు. అయితే, పరిస్థితులు కుదుటపడిన వెంబడే డ్రోన్ల పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మరోవైపు డ్రోన్లను రూపొందించడానికి బిలియన్ డాలర్లు అవసరం ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో భారత్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవర్ జెనరేటర్స్, ఆయిల్ కంపెనీలలో సాఫ్టవేర్‌ను ఉపయోగించడంలో దేశీయ ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని.. అలాగే డ్రోన్ల ఉపయోగించే క్రమంలో ఐటీ సేవల ద్వారా ఖర్చును తగ్గించవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు -
ఆన్లైన్ మద్యం డెలివరీకి స్విగ్గీ సై!
కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో తాగుబోతులకు తిప్పలు పెరిగాయి. గతంలో లాగా విచ్చలవిడిగా కొని, తాగి తూలే అవకాశం లేకపోవడంతో డ్రింకర్ బాబులంతా డీలా పడ్డారు. కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలు షురూ చేయడంతో కరువుబట్టినట్లు మందుబాబులంతా వైన్స్ ముందు క్యూలు కట్టారు. అయితే ఈ అమ్మకాలకు సవాలక్ష పరిమితులుండడం వీళ్లని పాపం బాగా నిరాశ పరిచింది. ఇలాంటి మందుమాలోకాలకు ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు ఫుడ్, గ్రాసరీ, మెడిసన్స్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసిన స్విగ్గీ ఇకపై ఆల్కహాల్ డ్రింక్స్‌ను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తమ యాప్‌లో తాజాగా ‘‘వైన్‌షాప్’’ కేటగిరీని చేర్చింది. ఈ వార్త వినగానే హడావుడిగా స్విగ్గీయాప్ ఓపెన్ చేసి మందు బుక్ చేయాలని కంగారు పడకండి... ప్రస్తుతానికి ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికే పరిమితం. త్వరలో ఈ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీసును అందిస్తామని స్విగ్గీ తెలిపింది. అంతేకాదండోయ్! ఆన్లైన్ లిక్కర్ డెలివరీ కోసం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, వీలును బట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలారంభిస్తామని ప్రకటించింది. ఆషామాషీ కాదు... ఆన్లైన్ లిక్కర్ డెలివరీ అనగానే ఠక్కున యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం కాదని స్విగ్గీ తెలిపింది. ముందుగా కస్టమర్ తన వయసును ధృవీకరించుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీని, ఒక సెల్ఫీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని డెలివరీ సమయంలో చెప్పాల్సిఉంటుంది. అంతేకాకుండా ఝార్ఖండ్ ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక్కో కస్టమర్ చేసుకునే లిక్కర్ బుకింగ్‌కు పరిమితి ఉంటుంది. ఆన్లైన్ డెలివరీ ద్వారా వైన్స్ వద్ద గుంపులుకూడకుండా సాయం చేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి చెప్పుకున్నారు. తమ డెలివరీ పార్టనర్స్‌కు శుభ్రత, సురక్షిత విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. -
స్విగ్గీ, జొమాటోలో మద్యం హోం డెలివరీ
రాంచీ: మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో మందుబాబులు గంటల తరబడి మండుటెండలో క్యూ లైన్లో నిల్చోవాల్సిన పనిలేదు. షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మాటిమాటికీ గడియారం చూడాల్సిన పని అసలే లేదు. చేతిలో ఫోన్, దానిలో రెండు యాప్స్ ఉన్నాయంటే కళ్ల ముందు మద్యం సాక్షాత్కరించాల్సిందే. అదెలాగో వివరంగా తెలుసుకుందాం... లాక్డౌన్లో ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు దాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం అమ్మకాల వైపు మొగ్గు చూపక తప్పలేదు. కానీ మందుషాపులు ఓపెన్ అవగానే కిలోమీటర్ల కొద్దీ లైనులు, సామాజిక దూరం అన్న మాట నామమాత్రం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ క్యూలైన్లో నిల్చోవడాలు.. దీనివల్ల ప్రభుత్వానికి ఖజానా వస్తుందన్న మాట అలా ఉంచితే కరోనా కేసులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీనికో పరిష్కారం కనిపెట్టింది. (మద్యం హోం డెలివరీకి జొమాటో..!) అందులో భాగంగా దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో మద్యం డెలివరీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా నాలుక పిడచకట్టుకుపోయిన మద్యంప్రియుల దాహార్తిని తీర్చడంతోపాటు కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకున్నట్లైంది. ఇప్పటికే జార్ఖండ్ రాజధాని రాంచీలో మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ సదుపాయాన్ని త్వరలోనే మిగతా నగరాలకు సైతం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఓ షరతు కూడా ఉందండోయ్. ముందు మీ వయసు నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్‌ను స్వీకరిస్తుంది. కూర్చున్న చోటకే మద్యం అందించడంపై మందుబాబులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 'మద్యం-హోం డెలివరీ' అనే అంశంపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి. (ఒకే ట్రక్కులో శవాలతో పాటు కూలీలు) -
కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్
సాక్షి, ముంబై: కోవిడ్-19 సంక్షోభం అన్ని వ్యాపార సంస్థలను ఘోరంగా దెబ్బతీసింది. ఫలితంగా కార్పొరేట్ దిగ్గజాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దేశవ్యాప్త సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా డిమాండ్ పతనమై, కుదేలైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఖర్చులను తగ్గించడానికి, రాబోయే కొద్ది రోజుల్లో 1100మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు స్విగ్గీ సోమవారం (మే 18) ప్రకటించింది. అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించాల్సి రావడం తమకు (స్విగ్గీకి) విచారకరమైన రోజుల్లో ఒకటి అని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో శ్రీహర్ష మాజేటి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తమ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించారు. ప్రభావిత ఉద్యోగులందరికీ వారి నోటీసు వ్యవధి లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా కనీసం మూడు నెలల జీతం అందుతుందని వర్చువల్ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులకు చెప్పారు. ప్రతి సంవత్సరానికి ఒక నెల అదనంగా జీతం ఇస్తామని, పదవీకాలాన్ని బట్టి 3-8 నెలల జీతాన్ని అందిస్తామని చెప్పారు. సంబంధిత ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులతోపాటు, అదనంగా వారి తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా సదుపాయం డిసెంబర్ 31, 2020 వరకు అందుబాటులో వుంటుందనీ వెల్లడించారు. కరోనాకు సంబంధించి అతిపెద్ద ప్రభావం క్లౌడ్ కిచెన్స్ వ్యాపారంపై పడిందని స్విగ్గీ సీఈవో చెప్పారు. ఇది ఇంకా చాలా అస్థిరంగా ఉండనున్న నేపథ్యంలో రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు. ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, దీని ప్రభావం స్విగ్గీపై అయితే తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. కరోనా కల్లోలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే తమ కిచెన్ ఫెసిలీటీస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేసే ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో ఉండే వ్యాపారం, లాభదాయకతను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రూ. 250 కోట్ల పెట్టుబడితో 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 12 కొత్త నగరాల్లో క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటు చేయనున్నామని గత ఏడాది డిసెంబరు లో ప్రకటించింది. చైనా తర్వాత క్లౌడ్ కిచెన్ల సౌకర్యాన్ని అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని, 8 వేల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారుకావడంతో తాజా నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే తమ ఉద్యోగులలో13 శాతం మందిని తొలగించినట్లు ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని ఆంక్షల సడలింపులతో లాక్ డౌన్ 4.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. (కుప్పకూలిన మార్కెట్లు : 9 వేల దిగువకు నిఫ్టీ) -
ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల సీజ్
పంజగుట్ట: జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ వల్ల కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి ఆ సేవలపై బ్యాన్ విధించింది. ఈ నిబంధనలు ధిక్కరించి కొందరు స్విగ్గి, జొమాటో డ్రైవర్లు సోమవారం కూడా తమ సేవలను కొనసాగించారు. అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఈ డెలివరీ బాయ్స్‌ను ఎక్కడికక్కడ నిలువరించి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారినైనా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. (తెరుచుకోనున్న మద్యం దుకాణాలు..కండీషన్స్ అప్లై) -
సీఎం వైఎస్ జగన్‌కు స్విగ్గీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఏపీలో ఆన్లైన్ ద్వారా కూరగాయల డోర్ డెలివరీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న ఈ గడ్డు సమయంలో వినియోగదారులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఏపీ ఈ-పాస్ పద్ధతి దరఖాస్తుదారులకు సహాయకారిగా నిలిచిందని పేర్కొంది. త్వరలో ఏపీ వ్యవసాయశాఖతో కలిసి తాజా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీ ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీకి స్విగ్గీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : గుడ్‌న్యూస్: ‘కరోనా ఫ్రీ’గా మరో రాష్ట్రం 2/2: Soon we will be delivering fresh Fruits and Vegetables at your doorstep in partnership with Department of Agriculture Marketing Andhra Pradesh so that you can stay home and stay safe. — Swiggy (@swiggy_in) April 20, 2020 -
స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం
మియాపూర్: అతడిది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూనే ఎస్ఐ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మియాపూర్‌లో ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కానీ.. అతడిని విధి చిన్నచూపు చూసింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్‌పై వెళ్లి ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. అతడి భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. భర్త మృతిని జీర్ణించుకోలేని ఆమె భోరున విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఎస్ఐ రవికిరణ్, మృతుడి స్నేహితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంనకు చెందిన లునావత్ మితియా నాయక్, మోతి దంపతుల రెండో కుమారుడు లునావత్ సుమన్ (22). మియాపూర్ రెడ్డి ఇన్‌క్లేవ్‌లో భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. లక్ష్మి ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తోంది. సుమన్ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. అతను రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరాడు. మియాపూర్ టాకీ టౌన్ సమీపంలో ఇడ్లీ దోశ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకొని బొల్లారం క్రాస్ రోడ్డు వైపు వెళుతున్నాడు. హోటల్ నుంచి 100 మీటర్ల దూరంలో బైక్‌పై వెళ్లగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను కిందపడ్డాడు. సుమన్ తలపై నుంచి వెనక చక్రం వెళ్లింది.హెల్మెట్ ఉన్నప్పటికీ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డెలివరీ బాయ్ వెంటపడుతున్న నెటిజన్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విశాల్. అతను స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఓ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిఖిల్ డెలివరీ బాయ్‌ను మంచినీళ్లు కావాలా అని అడిగాడు. ఆ తర్వాత మాటలు కలుపుతూ మీరేం చేస్తారు? అని అడిగాడు. అతను ఆర్టిస్ట్ అని చెప్పాడు. అతను గీసిన చిత్రాలను చూసి ముగ్ధుడైన నిఖిల్ విశాల్ గురించి సోషల్ మీడియాలో వివరంగా చెప్పాడు. దాంతోపాటు అతను గీసిన కళాఖండాలను కూడా పోస్ట్ చేశాడు. అతను తనకు సరిపడే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు అని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది తమకు పెయింటింగ్ గీసిపెడతావా? అని ఆర్డర్లు ఇస్తూ అతని వెంటపడుతున్నారు. మరికొంతమందైతే జాబ్ ఆఫర్ కూడా చేస్తున్నారు. ఇలా ఒక్క ట్వీట్‌తో అతని జాతకమే తిరిగిపోయిందనుకోండి. దీనిపై విశాల్ మాట్లాడుతూ.. నా గురించి ట్వీట్ చేశారని నాకు తెలియదు. నేను మామూలుగా ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాను. అప్పుడు ఆ వ్యక్తి నా గురించి అడిగితే నేను ఆర్టిస్ట్నని చెప్పాను. నేను గీసిన చిత్రాలు చూసిన అతనికి నా పని చాలా నచ్చినట్లుంది. అందుకే ట్వీట్ చేశాడనుకుంటా’నని చెప్పుకొచ్చాడు. విశాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వృత్తిరీత్యా ఆర్టిస్ట్.. తప్పని పరిస్థితుల్లో డెలివరీ బాయ్’, ‘నచ్చిన పని చేస్తూ కాస్త బ్రెడ్ ముక్క సంపాదించుకున్నా సంతోషమే’ అని రాసుకున్నాడు. -
భళారే.. బిర్యానీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడే ఆహారంగా బిర్యానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అదే సమయంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వెలుగుచూశాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఆహారం తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో తేలింది. స్టాట్‘ఈట్’స్టిక్స్ పేరిట స్విగ్గీ ఏటా నిర్వహించే సర్వేలో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో సేవలందిస్తోంది. ఆన్లైన్ ఆహార సరఫరా మార్కెట్లో 50 శాతంపైగా వాటాతో స్విగ్గీ మొదటి స్థానంలో ఉండగా, 26 శాతం వాటాతో జొమాటో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని ఫుడ్‌పాండా, ఫాసోస్, బాక్స్ 8 వంటి యాప్స్ పంచుకుంటున్నాయి. మార్కెట్లో 35,056 రకాల బిర్యానీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలను సరఫరా చేస్తున్న స్విగ్గీ.. బోన్‌లెస్ చికెన్ బిర్యానీ, చికన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్ ఉందని తేల్చింది. ముంబైలో ‘చాల్ థానో తావా బిర్యానీ’ అతి తక్కువ ధర రూ.19కే లభిస్తుంటే.. పూణేలో లభించే ‘చికెన్ సజక్ తప్’ బిర్యానీ రూ.1,500లతో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అంతేకాదు.. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు ఉన్న మోజును అర్థంచేసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో చికెన్ బిర్యానీ మొదటిస్థానంలో ఉండగా, శాఖాహారంలో మసాలా దోశ, పన్నీర్ బట్టర్ మసాలాకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆరోగ్యమూ ముఖ్యమే.. ఈ ఏడాది భోజన ప్రియులు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నట్లు స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఫుడ్‌కి ఆర్డర్లు మూడు రెట్లు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్లు 306 శాతం పెరిగి 3.15 లక్షలకు చేరాయి. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కాన్ చికెన్, హెల్దీ రెడ్ రైస్ పోహా వంటి వాటిని అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఇంటి వద్ద తయారుచేసే ఆహారానికీ ఆదరణ పెరుగుతోందట. ఈ ఏడాది పప్పు–బియ్యంతో తయారు చేసే కిచిడీ ఆర్డర్లలో 128 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే సమయంలో రాజ్మా చావల్, పెరుగు అన్నం వంటి వాటికి కూడా డిమాండ్ బాగుంది. దూసుకుపోతున్న గులాబ్‌జామ్ ఇక తీపి పదార్థాలు, శీతల పానీయాల విషయానికి వస్తే.. అత్యధిక ఆర్డర్లతో గులాబ్‌జామ్ దూసుకుపోతోంది. ఈ ఏడాది పది నెలల కాలంలో 17.69 లక్షల మంది గులాబ్‌జామ్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత 11.94 లక్షల ఆర్డర్లతో ఫలూదా రెండో స్థానంలో నిలిచింది. శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ పెరగడంపై స్విగ్గీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కేకుల్లో బ్లాక్ ఫారెస్ట్ 3 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్‌క్రీం, తిరమిసూ ఐస్‌క్రీం, కేసరి హల్వాలను కూడా అత్యధికంగా ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకేరోజు అత్యధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భోజన ప్రియులు ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త జాతీయ ఆహార తేదీలను కూడా ప్రకటించుకున్నారట. ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్‌జామ్ డే, మే 12 కాఫీ డే, జూన్ 16 ఫ్రెంచ్ ఫ్రైస్, సెప్టెంబర్ 22 పిజ్జా, అక్టోబర్ 20 బిర్యానీ, టీ డేలుగా ప్రకటించుకోవడం గమనార్హం. -
హోటళ్ల ఆగ్రహం.. నిలిచిపోనున్న స్విగ్గీ సేవలు
సాక్షి, విజయవాడ : నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సేవలు నిలిచిపోనున్నాయి. కమీషన్ పెంచమని తమపై ఒత్తిడి తెస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల తమకు నష్టం జరుగుతుందని, దీంతో ఈ నెల 11 నుంచి స్విగ్గీతో లావాదేవీలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ భారీ ప్రణాళికలతో వస్తోంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడంతోపాటు, ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా స్విగ్గీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న18 నెలల్లో 3లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. దీంతో తనఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థగా అవతరిస్తుంది. గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్నివెల్లడించారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది. ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 4.5 లక్షలతో ప్రయివేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ. 5 లక్షల ఉద్యోగుల లక్ష్యం నెరవేరితే టీసీఎస్‌ను అధిగమించి అతిపెద్ద ప్రైవేటు రంగ యజమానిగా స్విగ్గీ దూసుకురానుంది. -
ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నారా..?
తమిళనాడు : డిస్కౌంట్లో కావాల్సిన ఆహారం లభిస్తోందంటూ సెల్‌ఫోన్ నుంచే ఆన్లైన్లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ఇస్తున్నారా..? ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో నాణ్యత లోపం ఉందంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్లైన్ వినియోగదారుల విషయంలో జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహారానికి ఒక నాణ్యతతో..రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు పంపిణీ చేసే ఆహారానికి మరో నాణ్యతను పాటిస్తున్నారు. తిరుపతిలో పలు హాటళ్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులకు రెండు మూడు రోజుల మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి, తీవ్ర స్థాయిలో యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోదఫా ఇలాంటివి పునరావృతం అయితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధర తక్కువ కదా అని ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తే అందులో నాణ్యత ఏమాత్రం ఉండడం లేదని పలువురు వినియోగదారులు ఆహార నియంత్రణ భద్రతా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘పాలక్ పనీర్ అసలు ధర రూ.200.. మీ కోసం రూ.140 కే అందిస్తున్నాం. చికెన్ బిర్యానీ రూ.250.. ప్రత్యేక ఆఫర్‌కింద మీకు రూ.149కే అందిస్తున్నాం.. ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే. నాటు కోడి బిర్యానీ అసలు ధర రూ.299.. ఈ రోజు ప్రత్యేక ఆఫర్‌గా రూ.179కే అందిస్తున్నాం’ అంటూ 15 శాతం, 20 శాతం, 50 శాతం తగ్గింపు డిస్కౌంట్ వంటి రకరకాల ఆఫర్లతో ఫుడ్ డెలివరీ సంస్థలుఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఆకర్షితులై ధర తక్కువని ఆర్డర్ చేస్తే అందులో నాణ్యత ఉండడం లేదు. బాగా లేని ఆహారాన్ని ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా పొందిన బాధితులు అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థలతో పాటు రెస్టారెంట్లపై వినియోగదారుల ఫిర్యాదులతో ఆశాఖ అధికారులు పలు హోటళ్లు రెస్టారెంట్లపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌కు ప్రత్యేక ఆహారమా? రెస్టారెంట్లో వండిన ఆహారానికి, ఆన్లైన్ ద్వారా పొందిన ఆహారానికి చాలా తేడా ఉంటోందని ఫిర్యాదులు అధికారులకు వచ్చినట్లు సమాచారం. ఆన్లైన్ ఆర్డర్‌కు వేరే ఆహారం ఇవ్వాలంటూ హోటళ్ల యజమానులు సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు సమాచారం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లిన సమయంలో,ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థల్లో నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రముఖ రెస్టారెంట్లు, ఎప్పుడూ జన సందోహం ఉండే హోటళ్లనుఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆహారం నిల్వ ఉండేందుకు అక్కడ అవకాశం ఉండదు. ముఖ్యంగా నాన్‌వెజ్ ఆహారం కొనుగోలు చేస్తున్న సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని హోటళ్లలో డిమాండ్ తగ్గిన సమయంలో మాంసం, తరిగిన కూరగాయలు తదితరాలను నిల్వచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా మిగిలిపోయిన వాటితో వండిన ఆహారం త్వరగా పాడయ్యే ఆస్కారముంది. వేరుగావండేస్తున్నారు.. ఎక్కడో వండిన వంటకాలను రెస్టారెంట్ వరకు తీసుకొచ్చి ఆన్లైన్ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇలా వండి పెట్టేందుకు చిన్న హోటళ్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. నాణ్యత పాటించకుండా వండిన ఆహారం వినియోగదారులకు చేరేసరికి పూర్తిగా పాడయిపోతున్న సందర్భాలు ఉన్నాయి. -
‘ఎన్నో ప్రశ్నలు.. అందుకే ఈ జాబ్ చేస్తున్నా’
హైదరాబాద్ : ప్రస్తుతం వివిధ పట్టణాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోల హవా నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా ఆయా సంస్థల లోగోలతో టీ షర్టులు ధరించిన డెలివరీ బాయ్స్ బైక్‌లపై రయ్‌మంటూ దూసుకుపోవడం మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే అన్ని రంగాల్లో పురుషులతో సమాన అవకాశాలు దక్కించుకున్న మహిళలు.. ఫుడ్ డెలివరీ విషయంలో మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలనే ఆలోచన... జననీ రావు అనే అమ్మాయిని హైదరాబాదీ స్విగ్గీ డెలివరీ గర్ల్‌గా అవతారం ఎత్తించింది. పురుషాధిక్యం ఉన్న సమాజంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేయగలరనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన జననీ రావు(21) నగరంలోని విల్లామేరీ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్న జననీకి సవాళ్లు ఎదుర్కోవడం అంటే ఇష్టం. అందుకే ఇంతవరకూ నగరంలో ఎక్కడా లేని విధంగా ఫుడ్ డెలివరీ సంస్థలో డెలివరీ గర్ల్‌గా పనిచేయడం ప్రారంభించారు. స్కూటీపై దూసుకుపోయే జనని.. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ వంటి ప్రాంతాల్లో స్విగ్గీ కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఈ విషయం గురించి జనని మాట్లాడుతూ... ‘ ఫుడ్ డెలివరీ విభాగంలో నేను ఇంతవరకు ఒక్క మహిళను కూడా చూడలేదు. అందుకే ఈ జాబ్‌ను ఎంచుకున్నాను. చాలా మంది నేను చేసే పనిని సంప్రదాయ విరుద్ధమైనదిగా చూస్తారు. అయితే ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది కస్టమర్లు ప్రోత్సహించడం నాలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఫుడ్ డెలివరీకి వెళ్లినపుడు చాలా మంది నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. చాలా ప్రశ్నలు వేస్తుంటారు. నిజానికి స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేసే అమ్మాయిల కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెప్పర్ స్ప్రే అందుబాటులో ఉంచడంతో పాటుగా .. ఆపదలో ఉన్న సమయాల్లో ఫోన్లో ఉన్న కాంటాక్టులకు ఎమర్జెన్సీ కాల్ వెళ్లేట్లుగా యాప్‌ను రూపొందిస్తోంది’ అని పేర్కొన్నారు. తన లాగే మరికొంత మంది అమ్మాయిలు ఈ జాబ్‌ను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
యువకుడిని ఢీకొన్ననటి కారు
చెన్నై,పెరంబూరు: అర్ధరాత్రి నటి యాషికా కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికి నుంగంబాక్కం సమీపంలో శనివారం రాత్రి ఒక ఖరీదైన కారు వేగంగా వచ్చింది. స్థానిక హారింగ్టన్ రోడ్డు వద్ద అదుపు తప్పి వ్యక్తిని ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సంఘటనపై పాండిబజార్ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వచ్చారు. కాగా పోలీసుల విచారణలో ఆ కారులో నటి యాషిక తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ముగించుకుని వస్తూ ఈ యాక్సిడెంట్ చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ
బెంగళూరు: స్విగ్గీ పికప్ డ్రాపింగ్ విధానంద్వారా తన ఫోన్‌ని అమ్మాలనుకొని చిన్నపొరపాటుతో 95 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలోనుంచి పోగొట్టుకుంది బెంగుళూరుకి చెందిన అపర్ణ థక్కర్. బెంగుళూరులోని ఇందిరానగర్‌లో నివాసముంటోన్న అపర్ణాథక్కర్ సూరి ఓఎల్ఎక్స్ ద్వారా తన ఫోన్‌ని అమ్మకానికి పెట్టింది. మహ్మద్ బిలాల్ అనే వ్యక్తి అపర్ణకి ఫోన్ చేసి తాను ఆ ఫోన్‌ని కొంటానని చెప్పాడు. స్విగ్గీ గో యాప్ ద్వారా బిలాల్‌కి తన ఫోన్‌ని పంపింది. అయితే ఫోన్ బిలాల్‌కి చేరకపోగా ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు బిలాల్ అపర్ణకి సమాచారం ఇచ్చాడు. స్విగ్గీ బాయ్‌ని అపర్ణా నిలదీయగా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందనీ ఫోన్ తన ఆఫీసులో ఉందనీ సమాధానమిచ్చాడు. స్విగ్గీ నుంచి మాట్లాడిన వ్యక్తి వస్తువు ఎవరికి పంపాలో పూర్తి సమాచారం ఇవ్వలేదనీ, పొరపాటున ఆమె కొడుకు నంబర్ ఇవ్వడం వల్ల ఫోన్ డెలివరీ కాలేదనీ చెప్పాడు. గూగుల్‌లో ఉన్న స్విగ్గీ గో కస్టమర్ కేర్ కి ఫోన్ చేసిన అపర్ణ వాళ్లడిగిన బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ పిన్ నంబరు వంటి వివరాలన్నీ అందించింది. దీంతో ఆమె ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ళు అవలీలగా 95 వేలు కాజేయగలిగారు. ఈ మొత్తం డెబిట్ అయినట్టు మెసేజ్‌ని అందుకున్న అపర్ణ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. స్విగ్గీ బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ కనుకనే తాను ఆగంతుకులకు అన్ని వివరాలిచ్చానని అపర్ణ తెలిపారు. -
జొమాటో, స్విగ్గీల్లో..ఇలా ‘వేటే’శారు..
సాక్షి, సిటీబ్యూరో: ‘అకస్మాత్తుగా కమీషన్లు తగ్గించేశారు. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఆరు కిలోమీటర్లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా రూ.700 కూడా దాటడం లేదు. రెండేళ్లు కష్టపడి పని చేశాను. ఇప్పుడు ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నాను. ఇంకేదైనా పని చేసుకోవాల్సిందే...’ స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నరేష్ ఆవేదన ఇది. ఒక్క నరేషే కాదు. వేలాది మంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌లోనూ ఇదే ఆవేదన గూడు కట్టుకొని ఉంది. ఒకప్పుడు నెలకు రూ.20 వేలకు పైగా సంపాదించిన వాళ్లు ఇప్పుడు రూ.12 వేల కంటే ఎక్కువ ఆర్జించలేకపోతున్నారు. ♦ తమ ఆకలి సంగతి మరిచిపోయి ఎంతోమంది వినియోగదారుల ఆకలి తీర్చే డెలీవరీ బాయ్స్ ఇప్పుడు కనీస వేతనాలను సైతం అందుకోలేకపోతున్నారు. కొంతకాలంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అనేక మార్పులు తెచ్చాయి. కమిషన్లలో కోత విధించాయి. ప్రోత్సాహకాలను తగ్గించాయి. దీంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు గురవుతున్నారు. జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఫుడ్‌పాండా వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లోనూ కమిషన్లను భారీగా తగ్గించి టార్గెట్లను పెంచారు. నిజానికి కొన్నేళ్లుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ నగరవాసుల జీవన శైలిలో భాగమైంది. అన్ని వర్గాల ప్రజలు తమకు నచ్చిన ఆహారం కోసం ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆర్డర్లు అందుకున్న డెలివరీ పసందైన రుచులతో క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న చిన్న హోటళ్లు మొదలుకొని అతి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇప్పుడు ఆన్‌లైన్‌పైన ఆధారపడి ఉన్నాయి. కానీ డెలివరీ బాయ్స్ మాత్రం తమ ఆదాయాలను కోల్పోయి ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ‘వేటే’శారు.... నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్‌లలో జొమాటో, స్విగ్గీ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధాన యాప్‌ల ద్వారా ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్లు సరఫరా అవుతున్నట్లు అంచనా. 25 వేల మందికి పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా వేలమంది నిరుద్యోగ యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా దీనిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల వరకు నిరుద్యోగులకు ఒక చక్కటి ఉపాధి మార్గంగా ఉన్న ఈ యాప్‌లలో ప్రస్తుతం కోతలు మొదలయ్యాయి. స్విగ్గీలో గతంలో ఒక ఆర్డర్‌పై రూ.35 చొప్పున కమీషన్ లభించింది. ఇప్పుడు కొత్తగా ఆ యాప్‌తో అనుంధానమయ్యే వారికి రూ.15 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక రోజుకు ఆర్డర్లపైన రూ.900 లభిస్తే మరో రూ.200 ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇన్సెంటివ్‌లలో కోత విధించారు. ‘మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తే 15 ఆర్డర్లు అందజేయగలుగుతున్నాం. ఒకప్పుడు రూ.1300 కు పైగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.600 నుంచి రూ.700 దాటడడం లేదు.’’ అని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి వివిధ ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ చేస్తున్న భాస్కర్ విస్మయం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా పని చేస్తున్న తనకు ఎప్పుడు ఇంత తక్కువ ఆదాయం లభించలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో 6 కిలోమీటర్లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బోనస్ నిలిపివేశారు. ‘ కమిషన్లను సగానికి తగ్గించిన విషయం తెలియక చాలామంది కొత్తగా వచ్చి చేరుతున్నారు. దీంతో పాత వాళ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా కొత్త వాళ్లకే ఎక్కువగా ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం.’అని రాజు అనే డెలివరీ బాయ్ అభిప్రాయపడ్డారు. సైకిల్‌పై వస్తే తక్కువే.... మరోవైపు ఇటీవల జొమాటాలో బైక్‌లకు బదులు సైకిళ్ల పై వచ్చే డెలివరీబాయ్స్ను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఒక ఆర్డర్‌కు రూ.40 కమిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.30 కి తగ్గించారు. పైగా సైకిల్‌పై డెలివరీ చేసేవాళ్లకు రూ.20 మాత్రమే ఇస్తున్నారు. 2 నెలల క్రితం వరకు రోజుకు 18 ఆర్డర్లపై కమిషన్లు, ప్రోత్సాహకాలు కలిపి రూ.1000 సంపాదించిన శివ ఇప్పుడు రూ.700 మాత్రమే పొందగలుగుతున్నాడు. ఎల్బీనగర్ కేంద్రంగా అతడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కమిషన్లు, ప్రోత్సాహకాలు తగ్గడంతో డెలివరీ బాయ్స్ నగరంలో ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల కొండాపూర్, హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో డెలివరీని నిలిపివేసి సమ్మెకు దిగారు. కానీ సమ్మెకు ప్రోత్సహించారనే నెపంతో కొంతమంది ఐడీలను బ్లాక్ చేసినట్లు సమాచారం. ఆన్లైన్ ఫుడ్ వెరీగుడ్... నగరవాసి జీవితంలో ఆన్లైన్ ఫుడ్ ఒక భాగమైంది. బ్యాచ్‌లర్స్‌కు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం మొదలుకొని చికెన్, మటన్ బిర్యానీల వరకు ఆన్‌లైన్‌పై ఆర్డర్ చేయడం సాధారణమైంది. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్‌లు ఎక్కువగా కార్యాలయాలకు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి నెలా ఆర్డర్లు సుమారు : 15 లక్షలు స్విగ్గీ, జొమాటా,తదితర యాప్‌ల డెలివరీ బాయ్‌లు : 25వేల మందికి పైగా గతంలో స్విగ్గీ నుంచి ఒక ఆర్డర్‌పై లభించిన కమిషన్ రూ.35. ఇప్పుడు రూ.15 జొమాటా నుంచి గతంలో లభించిన కమిషన్ రూ.40. ఇప్పుడు రూ.30 -
జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌పై హోటల్స్ గుస్సా!!
జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని హోటళ్ల సమాఖ్య నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) తీవ్రంగా ఖండించింది. అగ్రిగేటర్స్ సంస్థలు.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని, తక్షణమే ఈ విధానాలను మానుకోవాలని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యత్వం ఉన్న రెస్టారెంట్లన్నీ లాగ్అవుట్ ఉద్యమాన్ని ఇతర ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాంలకు కూడా విస్తరించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ .. అగ్రిగేటర్స్‌తో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. స్విగీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా సంస్థలకు వేర్వేరుగా ఎన్ఆర్ఏఐ ఈ మేరకు లేఖలు రాసింది. పారదర్శకత లోపించడం, భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం, ఆన్లైన్ డెలివరీ అగ్రిగేటర్స్ తమ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటం వంటి అంశాలపై తమ సభ్యులు, అసోసియేషన్స్, ఇతర రెస్టారెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డెలివరీ పరిశ్రమకు ఇలాంటి పరిణామాలు ఆందోళనకర విషయాలని హెచ్చరించింది. టెక్నాలజీకి తాము వ్యతిరేకం కాదని.. కాకపోతే తాజా పరిణామాలు చిన్న రెస్టారెంట్లు, స్టార్టప్‌ల మనుగడకు, ఉపాధి అవకాశాల వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ అగ్రిగేటర్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ పలు రెస్టారెంట్లు లాగ్అవుట్ ఉద్యమం పేరుతో ఆన్లైన్ యాప్స్ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో నాసిరకం ఫుడ్!
సాక్షి, న్యూఢిల్లీ : జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్..అన్లైన్ ఆహార సరఫరా సంస్థలు కొన్ని వేల రెస్టారెంట్లను మన మునివేళ్ల ముందుకు తీసుకొచ్చాయి. వీటిలో ఏ రెస్టారెంట్ నుంచి ఆహారం కావాలన్నా అరగంటలో మన కళ్ల ముందుంటుంది. ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఆహారంలో క్రమంగా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయని, రెస్టారెంట్లో సరఫరా చేస్తున్న నాణ్యత కన్నా...ఆర్డర్ ద్వారా తెప్పించుకున్న ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటుందని మెజారిటీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పేరెన్నికగన్న రెస్టారెంట్లే కాకుండా చిన్న చిన్న ఆహారం కొట్లు కూడా ‘యాప్స్’ పరిధిలోకి వస్తున్నాయని, వాటిలో పరిశుభ్రత సరిగ్గా ఉండదని ఆరోపిస్తున్నారు. ఎప్పటికీ తాము పరిమాణంకన్నా నాణ్యతా ప్రమాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఎక్కువ మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక వేదిక ఆన్లైన్ ఆహారంపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని 66 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడగా, సకాలంలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తామని 22 శాతం మంది, ప్యాకింగ్, రవాణా సందర్భంగా ఆహారం నాణ్యత పడిపోతోందని 53 శాతం మంది, రెస్టారెంట్లో ఉన్నట్లే ఆన్లైన్ ద్వారా తాము అందుకున్న ఆహారం ఉంటుందని 30 శాతం మంది, క్రమంగా నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని 17 శాతం మంది అభిప్రాయపడగా, ధరలు అధిక ధరలు వసూలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 218 జిల్లాల పరిధిలో 27 వేల మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. స్టార్టప్ కంపెనీలు ఏవైనా మార్కెట్ విస్తరణ, వద్ధిపైనే ముందుగా దృష్టిని సారిస్తాయని, అందుకనే నాణ్యతా ప్రమాణాలు పెద్దగా పట్టించుకోవని ఓ స్టార్టప్ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ స్వతంత్ర విశ్లేషకుడు హెచ్వీ హరీష్ తెలిపారు. మార్కెట్‌పై పట్టు సాధించాక ఆపరేషన్లు, వినియోగదారుల సంతప్తిపై దృష్టిని సారిస్తారని చెప్పారు. రెస్టారెంట్లు, వినియగదారుల మధ్యనున్న దూరాన్నే తగ్గించడం కోసమే ప్రస్తుతం ఈ యాప్స్ వచ్చాయని, అందులో చాలా వరకు విజయం సాధించాయని, ఇక నాణ్యతా ప్రమాణాలపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘టెక్‌సై రీసర్డ్’ సంస్థ కన్సల్టెంట్ సుకతీ సేథ్ వ్యాఖ్యానించారు. ప్యాకేజ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కొన్ని రెస్టారెంట్లకు జొమాటో స్వయంగా ప్యాకేజీ కవర్లను పంపిణీ చేస్తోందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అది విస్తరించే ప్యాకింగ్ సందర్భంగా ఆహారం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు అంటున్నాయి. ప్యాకేజీ మధ్యలో ఆహారం మారటం చాలా అరుదని, రెస్టారెంట్లే ప్యాకేజీ ఆహారానికి సరైన ప్రమాణాలను పాటించడం లేదని స్విగ్గీ, ఉబర్ ఈట్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమైనా ఇక నుంచి తాము కూడా ఆహారం నాణ్యతపై దష్టిని కేంద్రీకరిస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. -
జొమాటో, స్విగ్గీ పోటా పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్లో ఆర్డరిస్తే ఆహారాన్ని సరఫరా చేసే ఆహార సంస్థలు జొమాటో, స్విగ్గీలు నేటి పోటీ ప్రపంచంలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఈ రంగంలో మూడొంతుల డిమాండ్‌ను ఈ రెండు సంస్థలే నెరవేరుస్తున్నాయి. మొత్తం దేశంలోని స్మార్ట్ఫోన్లలో 12 శాతం ఫోన్లు జొమాటో యాప్‌ను కలిగి ఉండగా, 10 శాతం ఫోన్లు స్విగ్గీ యాప్‌ను కలిగి ఉన్నాయి. మిగతా పోటీ సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట్ లాంటి ‘టూటైర్’ నగరాల్లో ఈ రెండు సంస్థలు పోటాపోటీగా దూసుకుపోతుండడం విశేషమని మార్కెట్ అధ్యయన సంస్థ ‘ఉనోమర్’ తెలియజేస్తోంది. గత మే నెల నాటికి దేశంలో మొత్తం 60 లక్షల స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. ‘జొమాటో ప్రారంభించిన గోల్డ్ ప్రోగ్రామ్’ బాగా పనిచేసిందని, అది వినియోగదారుల్లో విశ్వాసాన్ని బాగా పెంచిందని, పర్యవసానంగా పదే పదే ఆర్డర్లు జొమాటోకు వచ్చి పడ్డాయని ఉనోమర్ సంస్థ డైరెక్టర్ రిచా సూద్ తెలిపారు. దేశంలో దాదాపు 1200 రెస్టారెంట్లు, బార్లు, పబ్‌ల నుంచి సరఫరా చేసే ఏటా వెయ్యి రూపాయల ఆహారంపై గోల్డ్ ప్రోగామ్ కింద సబ్స్క్రిప్షన్ రాయితీ కల్పించడం జొమాటోకు బాగా కలిసివచ్చింది. ఇటీవల దాన్ని ఆహార పరిణామాన్ని బట్టి పరిమితం చేయడం పట్ల వినియోగదారుల్లో కొంత అసంతప్తి వ్యక్తం అయిందని, అయితే దాని వల్ల వ్యాపారం పెద్దగా దెబ్బతినలేదని రిచా సూద్ వివరించారు. క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మంచి డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా కూడా జొమాటో, స్విగ్గీ సంస్థలు మార్కెట్లో తమ స్థానాలను నిలబెట్టుకో గలిగాయి. స్మార్ట్ఫోన్ల ఆధారపడి సరఫరా చేసే ఆహారం గతేడాదిలో ఏడు శాతం వృద్ధి చెందింది. వాస్తవానికి ఇది పెద్ద వృద్ధిరేటు కాదు. మొత్తానికి ఆహార పరిశ్రమలో దీని వాటా 17 శాతానికి మాత్రమే చేరుకుంది. మొత్తం 79 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ కేటగిరీలో ఎంతో అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌లను వినియోగదారులు ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ వాటికన్నా తక్కువ వినియోగదారులను కలిగి ఉన్న హైదరాబాద్, జైపూర్ లాంటి టూ టైర్ నగరాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా నడుస్తోంది. ఢిల్లీ, కోల్‌కతా, చండీగఢ్ నగరాల్లో జొమాటో ముందుండగా, చెన్నై, గోహతి, కోచి నగరాల్లో స్విగ్గీ దూసుకుపోతోంది. -
తమిళ హిజ్రాకు కీలక పదవి
సాక్షి, చెన్నై: తమిళనాట పుట్టి, ఇక్కడే చదువుకుని ఐరోపా, అమెరికాల్లో రాణించి మళ్లీ భారత్‌కు వచ్చిన మూడో కేటగిరి (హిజ్రా)కి చెందిన సంయుక్తా విజయన్‌కు స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యతను కల్పించే విధంగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. పురుషులు, స్త్రీలతో సమానంగా ఏ రంగంలో నైనా తామూ రాణిస్తామన్నట్టుగా హిజ్రాలూ దూసుకొస్తున్నారు. మూడో కేటగిరిలో ఉన్న ఈ హిజ్రాలకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. కోర్టులు సైతం అండగా నిలబడుతుండడంతో పట్టభద్రులైన వారు వారికి నచ్చిన ఉద్యోగాల్ని దక్కించుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువులపై దృష్టి పెట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు. మూడో కేటగిరిలో తాము ఉన్నా, ఏ రంగంలోనైనా రాణిస్తామన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం తమిళనాడుకు చెందిన హిజ్రా సంయుక్తా విజయన్ ప్రముఖ ఫుడ్ డెలివర్ సంస్థ స్విగ్గిలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. మూడో కేటగిరికి ప్రాధాన్యత.... సంయుక్త విజయన్ తమిళనాడు వాసి. పుట్టింది ఇక్కడే. ఇక్కడి పీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. తాను హిజ్రాగా ఉన్నా, కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహంతో అడుగుల వేగాన్ని పెంచారు. ఐరోపా, అమెరికాల్లో ఫ్యాషన్ రంగంలోని కొన్ని సంస్థల్లో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌లో పనిచేశారు. సొంతంగా ఫ్యాషన్ సంస్థతో ముందుకు సాగుతూ వచ్చిన సంయుక్తా విజయన్ ప్రస్తుతం స్విగ్గీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆ సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించబడ్డ సంయుక్త తమిళనాడు వాసి కావడంతో ఇక్కడి మీడియా ఆమె హిజ్రాలకు ఆదర్శంగా పేర్కొంటూ వార్తలను ప్రచూరించడం విశేషం. ఇక, తాను టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా స్విగ్గీలో హిజ్రాలకు ప్రాధాన్యతను కల్పించే దిశగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. మూడో కేటగిరిలో ఉన్న వారికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతను పెంచే విధంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేటగిరిలో పట్టభద్రులైన వారికి ఉద్యోగ అవకాశాలు మరింతగా మెరుగుపడాలని, అవకాశాలు దరి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి చేరానని పేర్కొంటూ ఈ కేటగిరిలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఆదరించాలని, అక్కున చేర్చుకుని ప్రోత్సాహాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కల్గిన వారికి తన వంతుగా ఉద్యోగ అవకాశాల కల్పనలో సహాకారం అందిస్తానని, అలాగే, ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహించి మూడో కేటగిరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ ’సూపర్’పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్ పేరిట హైపర్ లోకల్ డెలివరీ వ్యాపారంలోకి, స్విగ్గీ డెయిలీ పేరిట సబ్స్క్రిప్షన్ ఆధారిత ఇంటి వంట డెలివరీ సేవల విభాగంలోకి స్విగ్గీ ప్రవేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఆరు నెలల్లో స్విగ్గీ నెలవారీ యూజర్ల సంఖ్య 10 రెట్లు పెరిగి 1,50,000 స్థాయికి చేరింది. తమ బ్రాండ్ పేరును, సొంత లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకునే ఉద్దేశంతో తాజాగా సూపర్ కార్యకలాపాలను కూడా విస్తరిస్తోంది. గతేడాది డిసెంబర్లో 1 బిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 500–600 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రోజుకు లక్ష డెలివరీలు.. సూపర్‌ను స్విగ్గీ గతేడాదే కొనుగోలు చేసినప్పటికీ.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. 2015లో శ్రేయస్ నగ్దావనె, పునీత్ కుమార్ దీన్ని ప్రారంభించారు. స్విగ్గీ చేతుల్లోకి వచ్చాక కూడా సూపర్ వారి సారథ్యంలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ– ఎన్సీఆర్ సహా ఆరు నగరాల్లో రోజుకు లక్ష పైచిలుకు డెలివరీలు అందిస్తోంది. మైక్రోడెలివరీ వ్యాపార విభాగంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న మిల్క్‌బాస్కెట్, డెయిలీ నింజా తదితర సంస్థలకు స్విగ్గీ సారథ్యంలోని సూపర్ ఎంత మేర పోటీనిస్తుందన్నది చూడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. సాధారణంగా ఇలాంటి స్టార్టప్స్‌కి ఎక్కువగా రోజూ సగటున రూ.70–90 ఆర్డర్లిచ్చే యూజర్లు ఉంటున్నారు. పాల డెలివరీ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నప్పటికీ ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ‘సూపర్’ మోడల్.. వారంవారీ, నెలవారీ చందాదారులకు పాలతో పా టు బ్రెడ్డు, గుడ్లు మొదలైన వాటికి కూడా సూపర్ డెలివరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థ స్థూల అమ్మకాల్లో 70 శాతం వాటా పాలది కాగా.. మిగతాది ఇతర ఉత్పత్తులది ఉంటోంది. సుమారు అరవై శాతం ఆర్డర్లు భారీ గేటెడ్ సొసైటీల నుంచి ఉంటున్నాయి. దీంతో తక్కువ వ్యయాలతో డెలివరీ సాధ్యపడుతోంది. సూపర్ పోటీ సంస్థల వ్యాపార విధానం కూడా ఇదే రకంగా ఉంది. ఈ విభాగంలో కార్యకలాపాలను టాప్ 10 నగరాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా చేరువవుతున్నందున.. సూపర్‌ను కూడా ఆయా మార్కెట్లలో ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నాయి. మరోవైపు సూపర్ పోటీ సంస్థ డైలీ నింజా కూడా కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. గతేడాదే ఇది మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించింది. రోజువరీ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో 30,000 ఉండగా.. ప్రస్తుతం 90,000కు పెరిగినట్లు సమాచారం. అటు మిల్క్‌బాస్కెట్ కూడా యూనిలీవర్ వెంచర్స్, కలారి క్యాపిటల్ నుంచి 26 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
క్లిక్ కొట్టు.. పుడ్ పట్టు
కిచెన్లు బోసిపోతున్నాయి. అయినా విభిన్న రకాల ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. జిహ్వకు నచ్చిన రుచులు క్షణాల్లో ముంగిట వాలుతున్నాయి. దీంతో పొయ్యిలకు పని లేకుండా పోతుంది. నగర జీవనంలో ఇది ప్రస్ఫుటిస్తుంది. ఉరుకుల పరుగుల జీవనానికి .. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు తోడవడంతో గృహిణులకు వంట భారం తప్పింది. మూడు పూటలా బయట ఫుడ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. నగర వాసుల అభిరుచులను పసిగట్టిన వివిధ యాప్‌లు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులు కూడా బయటఫుడ్కే మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు పోతే ఇళ్లల్లో కిచెన్ కనిపించకుండాపోతుందేమో..! సాక్షి, విశాఖపట్నం: ఉరుకుల పరుగుల జీవితాల్లో కనీసం వంట చేసి తినడానికి కూడా జనానికి సమయం.. ఓపిక దొరకడం లేదు. ఎవరికి వారు బిజీబీజీగా గడుపుతున్నారు. ముప్పొద్దులా వండి కాస్త రుచిగా తినేందుకు సైతం వారికి సమయం ఉండటం లేదు. ఉదయం హడావుడిగా లేవడం.. రెడీ అయ్యేందుకే సమయం సరిపోకపోవడం.., మధ్యాహ్నం ఇంటికి రాలేకపోవడం రాత్రి ఆలస్యంగా రావడం మొదలైన కారణాలు కడుపు నిండా కాస్త తిండి తినేందుకు కూడా తీరిక ఉండటం లేదు. ఫలితంగా ఇటీవల అధిక శాతం ప్రజలు బయటే కొని తింటున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం కూడా ఇంటి ఫుడ్ దూరమవడానికి కారణమవుతోంది. చిన్న కుటుంబాలు పెరిగిపోవడం పల్లెల నుంచి జనం నగరాలకు అధికంగా వలసలు రావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం పిల్లల కార్పొరేట్ చదువులు వంటి కారణాలతో ప్రతీ ఒక్కరూ బిజీగా మారుతున్నారు. ఫలితంగా జిల్లాలో హోటళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ప్రధానంగా రోడ్డు సైడ్ హోటళ్లు, మొబైల్ క్యాంటీన్లు రెస్టారెంట్లు, దాబాలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు అధికమవుతున్నాయి. రద్దీగా హోటళ్లు... ముఖ్యంగా ఎన్ఎడీ జంక్షన్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, వీఐపీరోడ్, అక్కయ్యపాలెం, అశీల్‌మెట్ట, సిరిపురం, బీచ్‌రోడ్డు, సీతమ్మధార, మద్దిలపాలెం మొదలైన కేంద్రాల్లో హోటళ్ల వ్యాపారం జోరందుకుంటోంది. ఇంట్లో వంట చేయకుండా హోటళ్ల నుంచే ఆహారం కొనుగోలు చేసుకొని భోజనం కానిచ్చేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు పెరగుతున్నాయి. ఉద యం వేళల్లో టిఫిన్ సెంటర్లు, మొబైల్ క్యాంటీ న్లు, హోటళ్ల వద్ద అల్పాహారం కోసం రద్దీ కనిపిస్తోంది. ఇంట్లో నలుగురు ఉంటే హోటళ్లో టిఫిన్ కొనాలంటే కనీసం రూ.150 అవుతుంది. అదే ఇంట్లో టిఫిన్ తయారు చేసుకుంటే రూ.50 సరి పోతుంది. కానీ ఖర్చుకు జనం వెనుకాడటం లే దు. కేవలం మధ్యాహ్న భోజనం మాత్రం వండుకుని ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఒక్కోసారి అన్నం మా త్రం వండుకుని మార్గమధ్యంలోని కర్రీ పాయింట్లో కూరలు, సాంబార్ కొని తింటున్నారు. యువతకు ఉపాధి.. ఫుడ్ డెలివరీ సంస్థలు రావడంతో స్థానికంగా ఉన్న యు వతకు ఉపాధి లభిస్తోంది. ఆహారం డెలివరీ చేసే సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తి నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లో రూ.20 వేల దాకా సంపాదిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటున్నారు. ఒక్క నగరంలోనే ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని..చేసే వారి సంఖ్య 500 దాకా చేరుకుందని సమాచారం. కేవలం ఇంటర్, డిగ్రీ చదివి ఉండి, సొంతంగా బైక్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు హోటళ్లు సైతం ఫుడ్ డెలివరీ సంస్థలకు డిస్కౌంట్లు ఇస్తుండటం, ఫుడ్ డెలివరీ చేసినందుకు కమీషన్లు ఉండటంతో ఈ సరికొత్త వ్యాపారం లాభసాటిగా ఉంటోందని యువత అభిప్రాయపడుతోంది. ఆన్లైన్ ఆర్డర్ల జోరు.. ఏడాది కిందట నుంచి నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఉబెర్‌ఈట్స్, ఫుడ్‌పాండా.. ఇలా.. పలు ఆన్లైన్ సంస్థలు వచ్చాక ప్రజలు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. మొదట్లో పిజ్జాలు, బర్గర్లు మాత్రమే ఆర్డర్ ద్వారా ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాటి స్థానంలో టిఫిన్లు, భోజనం, బిర్యానీలు కూడా చేరాయి. స్మార్ట్‌ఫోన్‌లో సదరు సంస్థల యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని, అందులో నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతి తక్కువ సమయంలో కోరుకున్న ఆహారం ఇంటి ముందు..ప్రత్యక్షమవుతోంది. ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే వంటి సంస్థలు పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించడం ఈ వ్యాపారానికి మరింత ఊతమిస్తోంది. రెండు కొంటే ఒకటి ఉచితమన్నట్లు ఈ వ్యాపారం ఉండటంతో జనం ఆసక్తి చూపుతున్నారు. రాత్రి వేళా టిఫిన్లకే మొగ్గు రాత్రి వేళ అన్నం బదులు టిఫిన్ తినడం ఇటీవల అధికమైంది. దీంతో వివిధ మోడళ్లలో రోడ్ల వెంబడి వెలసిన దుకాణాల్లో తిని ఇంటికి వెళ్తున్నారు. మరికొందరు తీరిగ్గా రెస్టారెంట్లకు వెళ్లి మాంసాహారం, ఇతర వెరైటీ వంటకాలు ఆరగించి వెళ్తున్నారు. దీంతో ఇంట్లో వండుకోవడం, అనంతరం పాత్రలు కడగడం వంటి శ్రమ తగ్గుతోందని అధిక శాతం భావిస్తున్నారు. బయట ఫుడ్‌కే జై.. మేము ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారంలో బిజీబిజీగా ఉంటున్నాం. ఒక్కోసారి మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనానికి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కువసార్లు బయట నుంచే టిఫిన్లు, భోజనాలు తెచ్చుకుంటున్నాం. ఫుడ్ డెలివరీ సంస్థలతో హోటళ్లకు వెళ్లి తెచ్చుకునే కష్టం కూడా తప్పింది. – జి.వేణుగోపాలరావు, వ్యాపారి, పెదవాల్తేరు అలసట దూరం భార్యా భర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కాలం వెళ్లదీయలేని రోజులివి. ఈ నేపథ్యంలో.. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారమంతా ఇంటి పని, ఆఫీస్.. ఇలా బిజీ బిజీగా గడుపుతాం. వారాంతంలోనూ పనిలో పడితే.. శారీరక అలసట ఎక్కువవుతోంది. అందుకే వీకెండ్లో హోటళ్లకు వెళ్లడం, లేదంటే.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ.. రిలాక్స్ అవుతుంటాం. – సీహెచ్ హిమబిందు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నందగిరినగర్ ఇష్టమైనవన్నీ ఇంటికే ఇంట్లో నచ్చిన వంటలు చేసుకొని తినాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. హోటల్‌కి వెళ్లి తినాలన్నా.. అక్కడ ఫుడ్ వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి. అదే.. ఆన్లైన్లో ఆర్డర్ చేసి.. ఇంటిలో ఇతర పనులు పూర్తి చేసుకొనే సరికి ఇష్టమైన ఫుడ్ ఇంటికే వచ్చేస్తోంది. మనకు నచ్చినట్లుగా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. – శారద, గృహిణి -
మా ఆకలి వాయిదా.. బ్యాచిలర్స్ ఇబ్బంది పెడతారు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతోంది. యాప్స్ అందుబాటులోకిరావడంతో ఆన్లైన్లో క్లిక్ చేస్తే చాలు ఇంటికే ఆహారం వచ్చేస్తోంది. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్.. ఇలా ప్రతిదీ సిటీజనులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో ప్రతినెలా 15లక్షలకు పైగా ఆర్డర్లుఅందుతున్నాయి. వీటిలో దాదాపు 85శాతం బిర్యానీ ఆర్డర్లే ఉండడం విశేషం. అందులోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటేస్తున్నారు. ఉదయం 7–10గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12–3గంటల వరకు లంచ్ ఆర్డర్లువస్తుండగా... సాయంత్రం స్నాక్స్, అర్ధరాత్రి 2:30గంటల వరకు డిన్నర్ ఆర్డర్లు ఉంటున్నాయి. ఇది తమకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతోందని డెలివరీ బాయ్స్ పేర్కొన్నారు. చదువుకుంటూ కొందరు, ఉద్యోగాలు చేస్తూ మరికొందరు డెలివరీ బాయ్స్‌గా ఆదాయం పొందుతున్నారు. వీరు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకుసంపాదిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎంతోమంది ఆకలి తీర్చే విధి నిర్వహణ వాళ్లది. ఆర్డర్ రాగానే ఉరకాల్సిందే. ఆ క్షణంలో వారు తమ ఆకలిని మరిచిపోతారు. ఆర్డర్లు అందిన వెంటనే సదరు హోటల్‌కు వెళ్లి ఆహార పదార్థాలను తీసుకుని ఆర్డర్ వచ్చిన చోట వాలిపోతారు. కస్టమర్‌కు ప్యాకెట్ అందించాక ఓ చిన్న కోరిక కోరతారు.. అది టిప్ ఇవ్వమని కాదు.. ‘సార్.. సర్వీస్ రేటింగ్ చూసి ఇవ్వండి’ అంటూ వినయంగా అడుగుతారు. వారే ‘ఫుడ్ డెలివరీ బాయ్స్’. పెరుగుతున్న నగర జనాభా.. తీరిక లేని జీవితం ఫలితంగా చాలామంది గ్రేటర్ వాసులు ఇంటి భోజనం మరిచిపోతున్నారు. దీంతో ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం ఊపందుకుంది. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఫుడ్ డెలివరీ ఉపాధిగా మారింది. ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ సరైన ఉద్యోగవకాశాలు లభించని వారు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారిపోయారు. జొమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండా, ఉబర్.. వంటి ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ మొబైల్ యాప్స్ ఒకవైపు నగరవాసుల ఆకలి తీరుస్తూ మరోవైపు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకలేసినా, దాహమేసినా, గరం గరం ఇరానీ చాయ్ సిప్ చేయాలనిపించినా, కరకరలాడే స్నాక్స్ ఆరగించాలన్నా ఇప్పుడు అన్నింటికీ మొబైల్ ఫుడ్ యాప్‌లు మేమున్నాయంటున్నాయి. ఇంటికి బంధుమిత్రులొచ్చినా, మరే అత్యవసరమైనా సరే అప్పటికప్పుడు వంట చేయాల్సిన పనిలేదు. మొబైల్ ఫోన్ అందుకొని ఆర్డర్ బుక్ చేస్తే చాలు కొరుకున్నవన్నీ వచ్చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఆర్డర్లు ఇలాగే బుక్ అవుతున్నట్లు అంచనా. ఈ ఆర్డర్లలో 85 శాతానికి పైగా బిర్యానీలే ఉంటున్నాయి. అందులోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యాని పట్ల ఆసక్తి చూపుతున్నారు. అటు వినియోగదారులకు, ఇటు ఫుడ్ డెలివరీ బాయ్‌లకు చక్కటి అవకాశంగా మారిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆహారంలో అగ్రస్థానం బిర్యానీదే ‘ఇంటి వద్దకే భోజనం’ డిమాండ్‌లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డిమాండ్‌ను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బిర్యానీ తర్వాత చికెన్ 65, కబాబ్, పలావ్ వంటివి ఉన్నాయి. నగరవాసులతో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా బిర్యానీకే మొగ్గుచూపుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసేటపుడు శాకాహారంతో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్ ఉంటోందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా బీమా, కుటుంబానికి అత్యవసర వైద్యసేవలతో పాటు మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. డెలివరీ చేసే ఆర్డర్ల మేరకు చెల్లించే కమీషన్ ఉంటుంది. ఫుడ్ డెలివరీ సంస్థలు ఇప్పుడు రెస్టారెంట్లతో ఒప్పందం మేరకు ఆఫర్లను సైతం అందిస్తున్నాయి. నగరంలో దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్ పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్ అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఐపీఎల్ సీజన్లో స్విగ్గీకి ఫుల్.. ♦ ఐపీఎల్ సీజన్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తినట్లు సంస్థ తాజా ప్రకటనలో తెలిపింది. ♦ ప్రధానంగా చికెన్ బిర్యానీకి దేశంలోని పలు మెట్రో నగరాలతో పాటు పలు నగరాల్లోనూ ఆర్డర్లు 30 శాతం మేర పెరిగినట్లు ప్రకటించింది. ఇక ఏపీలోని విజయవాడ, కడప, తెలంగాణాలోని నిజామాబాద్ నగరంలోనూ స్విగ్గీకి ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. ♦ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య తమ ఆర్డర్లలో 30 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ♦ పిజ్జాలు, సమోసాలు, చికెన్ వింగ్స్‌కు సైతం భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయట. ♦ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ సీజన్లో ఆర్డర్లు భారీగా పెరిగినట్లు పేర్కొంది. ♦ గులాబ్ జామూన్, రస్మలాయ్, డబల్ కా మీఠా, బ్లాక్ ఫారెస్ట్ కేక్ వంటి స్వీట్స్‌కు కూడా గిరాకీ అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇడ్లీ నుంచి పెరుగన్నం వరకు.. నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు తినే అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్లైన్ ఆర్డర్లపై వచ్చేస్తున్నాయి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం కోసం ఆర్డర్లు మొదలువుతాయి. ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, చాయ్, కాఫీ, వాటర్ బాటిళ్ల కోసం డిమాండ్ ఉంటుంది. బ్యాచిలర్స్, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైన కుటుంబాల్లో ఉదయం లేచిన వెంటనే అల్పాహారం కోసం ఆర్డర్ ఇస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు లంచ్ కోసం ఆర్డర్లు ఉంటాయి. ఎక్కువ శాతం నచ్చిన ఫుడ్డు బుక్ చేసుకుంటారు. అందులోనూ నగరవాసులు బిర్యానీకే పెద్ద పీట వేస్తున్నారు. ఆఫీస్‌లలో పార్టీలకు, ఇళ్లల్లో చిన్న చిన్న వేడుకలకు ఆర్డర్లపైనే ఫుడ్, స్వీట్లు, కూల్ డ్రింక్స్ వచ్చేస్తున్నాయి. ఒకటేంటి.. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెష్, పెరుగన్నం.. పులిహోర వరకు ఆర్డర్లు ఇస్తున్నారు. ‘ఫోన్లో యాప్ ఆన్ చేస్తే చాలు ఆర్డర్లు వచ్చి పడుతూనే ఉంటాయి. మధ్యాహ్నం పూట మాకు అన్నం తినే అవకాశం ఉండదు. ఆర్డర్లు అన్నీ డెలివరీ అయ్యాక 3 గంటల తర్వాతే భోజనం చేస్తాం’ అని ఎల్బీనగర్కు చెందిన డెలివరీ బాయ్ శివప్రసాద్ తెలిపాడు. ప్రతిరోజు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇతడు రోజుకు రూ.600 నుంచి రూ.1000 వరకు ఆదాయం వస్తుందని, అయితే, అన్ని రోజుల్లో ఆర్డర్లు ఒకేలా ఉండవన్నాడు. వీకెండ్స్‌లో ఉండే డిమాండ్ ఇతర రోజుల్లో ఉండకపోవచ్చు. సాధారణంగా టిఫిన్లకు ఎక్కువగా కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏ హోటల్‌కు ఎంత రేటింగ్ ఉందనే సమాచారం ఆధారంగా ఆర్డర్లు ఉంటాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాలకు కూడా ఆర్డర్లు నగరంలో బాగానే చేస్తున్నారు. అందులోనూ మధ్యాహ్నం కంటే రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉండడం విశేషం. ఇక మిడ్నైట్ బిర్యానీ ప్రియులు ఉండనే ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 2.30 వరకూ డెలివరీ బాయ్స్ సేవలు అందిస్తునే ఉంటున్నారు. డెలివరీ ఉపాధి బాగుంది నాగర్ కర్నూలుకు చెందిన శివప్రసాద్ ఒక కొరియర్ సంస్థలో 10 ఏళ్ల పాటు పనిచేశాడు. నెల జీతం రూ.15వేలు దాటలేదు. ‘ఏడాది క్రితం ‘జొమొటో’లో చేరాను. నాటి నుంచి ప్రతి నెలా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. ఒకఆర్డర్పై రూ.40 చొప్పున ఇస్తున్నారు. రోజుకు 25 ఆర్డర్లు డెలివరీ చేస్తే రూ.1000 లభిస్తుంది. టార్గెట్ ప్రకారం ఆర్డర్లు చేసిన వాళ్లకు ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రోత్సాహకాలను కూడా ఇస్తాయి. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగులుగా కమీషన్ ప్రాతిపదికపై వేలాది మంది పనిచేస్తున్నారు. చదువుకుంటూ కొందరు ఉపాధి పొందున్నారు. గత ఉద్యోగాలతో పోలిస్తే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటంతో మరికొందరు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. సగటున 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పైబడిన వారు కూడా ఫుడ్ డెలివరీ విధుల్లో ఉన్నారు. సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ ఉంటే చాలు.. ఉద్యోగం వచ్చినట్లే. సూర్యాపేట్‌కు చెందిన నగేష్ ఒక ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేసేవాడు. ‘రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా రూ.12 వేలు కూడా వచ్చేది కాదు. పైగా డ్రైవింగ్ చాలా రిస్క్. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి డెలివరీ బాయ్ ఏదో ఒక జోన్‌కు మాత్రమే పరిమితమవుతాడు. ఆ జోన్లో 10 కిలోమీటర్ల మేర ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒక జోన్ మారుతూ ఉంటుంది. ఏ జోన్ వాళ్లు అక్కడే పని చేస్తారు. జోన్లో మార్పులు టీమ్ లీడర్లపై ఆధారపడి ఉంటాయి. ప్రతి 3, 4 జోన్లకు కలిపి ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తారు. పలు మెట్రో నగరాల్లో ఐపీఎల్ సీజన్లోఆర్డర్లు వెల్లువెత్తిన వంటకాలివే.. చెన్నై, కోల్‌కతా: చికెన్ బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ బెంగళూరు: మసాలా దోశ, చికెన్ వింగ్స్ ఢిల్లీ: దాల్ మఖానీ, పిజ్జా, సమోసా ముంబై: దాల్ కిచిడీ హైదరాబాద్: చికెన్ బిర్యానీ, కబాబ్స్ మా ఆకలి వాయిదా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టిఫిన్లు, లంచ్ వరుసగా ఆర్డర్లుంటాయి. దీంతో మాకు తినేందుకు తీరిక ఉండదు. మధ్యాహ్నం 3 తర్వాతే భోజనం చేస్తాం. ఒక్కోసారి మిర్చీలు, బజ్జీలు, సమోసాలతో కడుపునింపుకుంకొని డెలివరీ ఇస్తున్నాం. బ్యాచిలర్స్ కొద్దిగా ఇబ్బంది పెడతారు. వారు ఒక ఆర్డర్ ఇచ్చి డెలివరీ మరొకటి అడుగుతారు. వాపస్ చేస్తారు. అలాంటప్పుడు ఆ నష్టం మేం భరించాల్సి వస్తుంది. – శివప్రసాద్, జొమొటో లస్సీ ఆర్డర్లు వస్తున్నాయి వేసవి కావడం వల్ల లక్సీకి ఆర్డర్లు ఇస్తున్నారు. బిర్యానీకి డిమాండ్ బాగా ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 15 పార్శిళ్లను డెలివరీ చేశాను. ఇందులో ఆరు పార్శిళ్లు బిర్యానీ. మూడు లస్సీ ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని చట్నీస్ హోటల్ నుంచి మూడు వెజ్ లంచ్‌బాక్స్‌లు సరఫరా చేశాను. రెండు చోట్ల కూల్‌డ్రింక్ అందజేశాను. లంచ్‌లో ఎక్కువగా బిర్యానీలు పంపిణీ చేశాను. – మనోహర్, డెలివరీ బాయ్ అర గంటకే డెలివరీ ఇష్టమైన ఫుడ్‌ను ఆన్లైన్లో బుక్ చేస్తే అరగంటలో డెలివరీ ఇస్తాం. ప్రతి రూ.900 బుకింగ్ ఆర్డర్‌పై రూ.300 వరకు కమీషన్ వస్తుంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్‌పై ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం మిల్క్, థిక్‌షేక్, బాదం పాలు, ఫ్రూట్ సలాడ్ వంటి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్డర్లు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం విరామం తీసుకుంటాం. – యశ్వంత్, స్విగ్గీ డెలివరీ బాయ్ -
ఇక స్విగ్గీ, జొమాటోలకు ‘ఎసరు’!
సాక్షి, బెంగళూరు: హఠాత్తుగా వేసవి వర్షాలు పలకరించడంతో బెంగళూరు వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇంకా కురుస్తున్న చినుకుల మాటున వీస్తున్న సన్న గాలులకు మట్టి పరిమళాలు వచ్చి ముక్కును తాకుతుంటే డాక్టర్ జయశ్రీ గోపాలన్ మైమరచిపోతున్నారు. మహాదేవపురలోని అపార్ట్మెంట్, 15వ అంతస్తులో నిలబడి వర్షపు జల్లులకు పులకించిపోతున్న ఆమెకు హఠాత్తుగా ఆకలి గుర్తుకు వచ్చింది. ‘అబ్బా! ఈ వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటేనా!’ అనుకోగానే ఆమె నోటిలో నీళ్లూరాయి. ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉంది. తాను ఒక్కదాని కోసం ఇప్పుడు బజ్జీలు చేసుకోవాలా? అనుకున్నట్లున్నారు. వెంటనే చేతిలోకి సెల్ తీసుకున్నారు. అందులో ‘స్నాక్స్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు ‘స్నాక్స్ ఏమున్నాయి ?’ అంటూ మెస్సేజ్ పెట్టారు. ‘ఎనిమిది ప్లేట్ల ఆలు, ఉల్లిపాయ బజ్జీలు చేస్తున్నాను. ఇప్పటికే ఆరు ఆర్డర్లు వచ్చాయి, మీకు కావాలంటే ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి, అరగంటలో పంపిస్తాను’ అంటూ వెంటనే సమాధానం వచ్చింది. జయశ్రీ వెంటనే ఓ ప్లేట్ ఆర్డర్ ఇచ్చారు. 20 నిమిషాలు తిరక్కుండానే టిఫిన్ డబ్బాలో వేడి వేడి బజ్జీలు పట్టుకొని ఆ వంట మనిషి పిల్లవాడు వచ్చి ఇచ్చాడు. 30 రూపాయల బిల్లు తీసుకొని వెళ్లిపోయాడు. ‘ఆహా! ఎంత బాగున్నాయి. అచ్చం నేను చేసికున్నట్లే ఉన్నాయి’ అంటూ జయశ్రీ వాటన్నింటిని తినేసింది. ఇలా అడిగిన వారికి అడిగినట్లుగా ఉదయం ఇష్టమైన టిఫిన్లు, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ చేసి పెడుతోంది అదే ఆపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న ఓ వంటామే. ఆ అపార్ట్మెంట్లో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. బిజీబీజీగా ఉండే ఆ కుటుంబాలు ఎక్కువ సార్లు ఈ వంటామేపైనే ఆధారపడుతున్నారు. ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ల వారు కూడా ఈ మధ్య ఆ వంటామనే ఆశ్రయిస్తున్నారట. ఇలాంటి వంటామే ఒక్క మహాదేవపురలోనే కాదు, సర్జాపూర్, బన్నేర్‌గట్టా, హెన్నూర్ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లకు విస్తరించారు. పక్క పక్కనే ఉన్న ఆపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారందరితోని వాట్సాప్‌లో స్నాక్స్ అనో, బ్రేక్‌ఫాస్ట్ అనో, లంచ్ అనో, డిన్నర్ అనో, హోం ఫుడ్ అనో ఓ గ్రూప్‌ను చేసుకొని వంటామెలు (కొన్ని చోట్ల వంటాయనలు కూడా ఉండవచ్చు) మంచి ఓ హోమ్ ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారితోనే కొంత పెద్ద మొత్తంలో ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్ పుట్టుకొచ్చింది. దీన్ని రచనా రావు, అనూప్ గోపీనాథ్, అకిల్ సేతురామన్ ఇదివరకే ఏర్పాటు చేయగా, కొత్తగా ఊటాబాక్స్, మసాలా బాక్స్ అనే గ్రూపులు పుట్టుకొచ్చాయి. ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్‌లో 20 వేల మంది ఉండగా, పూటకు రెండున్నర వేల ఆర్డర్లు వస్తున్నాయట. అందరిదీ ఒకటే సూత్రం. హోం ఫుడ్. రుచితోపాటు పరిశుభ్రతను పాటించడం, బయట హోటళ్ల కంటే తక్కువ రేటుకు విక్రయించడం వల్ల వీటి ప్రాబల్యం పెరుగుతోంది. ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బెంగళూరు ఆహార పరిశ్రమలో ఈ పూటకూళ్ల పరిశ్రమలు రేపు ప్రముఖ పాత్ర వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటోలాంటి ఆహార సరఫరా సంస్థలకు ఈ పూటకూళ్లమ్మలను చూసి భయం పట్టుకుందట. ఈ ఆహార సరఫరా సంస్థల బిజినెస్ దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్లకు చేరుకోగా, అందులో 32 శాతం వాటా ఒక్క బెంగళూరు నుంచే వస్తోందట. ఇప్పుడు దానికి చిల్లు పడుతుందన్నది వారి చింత. ఫుడ్‌కు పేరుపోందిన కోరమంగళ ప్రాంతంలోనే దాదాపు 500 రెస్టారెంట్లు ఉన్నాయని, అవి ఉన్నంత వరకు తమకు ఢోకాలేకపోవచ్చని కూడా వారు భావిస్తున్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఓ పూటకూలమ్మ పుట్టుకొస్తే ఆహార పరిశ్రమలో గుత్తాధిపత్యం మాత్రం తగ్గుతుంది. అపార్ట్మెంట్ వాసుల అభిరుచులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ‘ఇంటి వంట’కు కూడా మరింత వన్నె తేవచ్చు. కాకపోతే ఇలాంటి వాటికి ఆర్డర్ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక వంటకాల కోసం ఓ రోజు ముందుగా కూడా ఇవ్వాల్సి రావచ్చు. -
డెలివరీ బాయ్స్‌పై పోలీసుల సీరియస్
సాక్షి, ముంబై: ఇళ్లకు, కార్యాలయాలకు వేడివేడి ఫుడ్ సరఫరా చేస్తున్న ప్రముఖ స్విగ్గీ, జొమాటో కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని ట్రాఫిక్ శాఖ భావిస్తోంది. ఇందులో పనిచేసే డెలివరీ బాయ్‌లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతూట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్నారు. దీంతో వారిని నియంత్రించాలని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయనుంది. డెలివరీ తొందరగా ఇవ్వడానికి.. నేటి ఆధునిక యుగంలో బయట ఫుడ్‌కు చాలా మంది అలవాటు పడ్డారు. డబ్బుకు విలువలేకుండా పోయింది. ఉద్యోగం చేసే దంపతులతోపాటు ఇళ్లలో ఉండే సామాన్య ప్రజలు కూడా రెడీమేడ్ ఫుడ్‌కు ఆకర్షితులయ్యారు. డోమినోజ్ ఫిజ్జా,పాశ్చత్యదేశాల ఫుడ్‌పై కూడా మోజు పెంచుకున్నారు. కేవలం ఫోన్ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లోనే ఇంటి గుమ్మం ముందుకు తము ఆర్డర్ చేసిన ఫుడ్ ప్రత్యక్షమైతుంది. ఇలాంటి వారికి తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గి, జోమేటో కంపెనీలునగరంలో అక్కడక్కడ తమ బ్రాంచ్‌లు తెరిచాయి. కానీ, అందులో పనిచేస్తున్న డెలీవరి బాయ్‌లు పనితీరు సక్రమంగా లేదు. అడ్డగోలుగా బైక్‌లు వేగంగా నడుపుతున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బాయ్‌లు తొందరగా డెలీవరి చేసి మరో ఆర్డర్ దక్కించుకోవాలనే తపనతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు బైక్‌లను ఆపే ప్రయత్నం చేసినా తప్పించుకు పారిపోతున్నారు. వీరి ప్రాణాలకు రక్షణ లేకపోవడమేగాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే ఆస్కారముంది. దీంతో డెలీబాయ్‌లకు మార్గదర్శనం చేయాలని లేదంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయకతప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. -
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
ఆన్లైన్లో అక్షయ పాత్ర!
సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల నగర జీవనంలో తమకు నచ్చే దైనందిన ఆహారాన్ని తామే తయారు చేసుకొని తినే వెసులుబాటు ఏ కొద్ది మందికో ఉంటుంది. రోడ్డు పక్కన టిఫిన్, హోటల్లో మధ్యాహ్న భోజనం, రాత్రి ఆలస్యమైందని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకుని వచ్చి కాస్త నింపాదిగా తినే సమయం కూడా ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారి తిప్పలు వర్ణనాతీతం. ఇలాంటి వారికి కోరుకున్న రుచులను, కోరుకున్న చోటికే కావాల్సిన సమయానికే అందిస్తూ ఆదరణ పొందుతున్నాయి ఆన్లైన్ ఆహార సరఫరా సంస్థలు, యాప్‌లు. ఇవి ఆహార శాలల్ని ప్రజలకు మరింత చేరువ చేశాయి. క్లిక్ చేస్తే చాలు పది నిమిషాల్లోనే కోరుకున్న చోటికి ఆహారం సరఫరా చేస్తున్నాయి. చిన్నస్థాయి నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్నీ టేక్ అవే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయంటే.. ఆహార పదార్థాల సరఫరాకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి నెలా దాదాపు 15 లక్షలకుపైగా యాప్, ఆన్లైన్ ఆర్డర్లు ఉంటున్నాయి. ఏడాది కాలంలో బుకింగ్‌లు దాదాపు పది రెట్లు పెరిగాయి. స్విగ్గీ, జోమాటో, ఫుడ్‌పాండా తదితర సంస్థలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతోంది. టిఫిన్ల నుంచి భోజనం వరకు.. ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం ఇంటికే తెప్పించుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లేవారు, అనారోగ్య సమయంలో వంటచేసే పరిస్థితులు లేనపుడు ఈ యాప్ సేవలపై ఆధారపడుతున్నారు. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్‌లు ఎక్కువగా కార్యాలయాలకు ఉంటున్నాయి. రుచి, సేవలు, నాణ్యతపై ప్రజల నుంచి సమాచారం తీసుకుంటున్నాయి. ఆ మేరకు రేటింగ్ ఇవ్వడం ద్వారా ప్రజలు ఆహార నాణ్యతపై స్పష్టతకు వస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాల కోసం వస్తున్న ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉంటోంది. మిడ్నైట్ బిర్యానీ కోసం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకూ సేవలు అందిస్తున్నాయి. మొబైల్ యాప్‌ల్లో ఆహారాన్ని బుక్‌చేసేవారు 90శాతం వరకు ఉంటున్నారు. నోరూరిస్తున్న బిర్యానీ.. ఇంటి వద్దకే భోజనం డిమాండ్‌లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. మొబైల్ ఆధారిత యాప్‌ల బుకింగ్‌లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. చికెన్ 65, కబాబ్, పలావ్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి హైదరాబాదీలతో పాటు తెలుగేతర ప్రజలూ ఎక్కువగా ఈ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసేటపుడు శాకాహారానితో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్ ఉంటోందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. యాప్ ఆధారిత ఆహార సరఫరా వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైంది. ప్రతి 3 నెలలకోసారి కనీసం సగటున 15శాతం చొప్పున పెరుగుతోంది. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్‌పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. స్వయంగా ఏజెంట్లను నియమించుకుని.. ఇంటి వద్దకే ఆహార సరఫరా (డోర్ డెలివరీ) అన్ని రెస్టారెంట్లకూ విస్తరిస్తోంది. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, పూర్తిస్థాయి ఏజెంట్లుగా పనిచేసేందుకు యువత ముందుకు వస్తోంది. చదువుకుంటూ పనిచేస్తూ కొందరు ఉపాధి పొందుతున్నారు. సగటున 18 నుంచి 30 ఏళ్లలోపు యువత ఈ రంగంలో పనిచేస్తోంది. 18 ఏళ్ల వయసు, సొంత వాహనం, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ పరిశీలించి, ఇంటర్వ్యూలు చేసి ఆన్లైన్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. కొన్నిసంస్థలు మహిళలనూ డెలివరీ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని కంపెనీలు ఒక్కో ఆర్డరుకు గరిష్టంగా రూ.120 వరకు డెలివరీ బాయ్స్‌కి చెల్లిస్తున్నాయి. -
‘అతడి వల్ల అన్నం కూడా సహించడం లేదు’
బెంగళూరు : స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన కారణంగా మానసిక వేదన అనుభవించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదును స్వీకరించిన స్విగ్గీ యాజమాన్యం.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పడంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్ పంపింది. అయితే కేవలం క్షమాపణలే సరిపోవన్న ఆమె అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో డెలివరీ బాయ్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. వివరాలు... కర్ణాటకకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో భోజనం ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్.. డోర్ తీయగానే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తనకు సహకరించాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే తేరుకున్న సదరు మహిళ.. త్వరగా తలుపు మూసేసి లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గురువారం ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అతడి ప్రవర్తన కారణంగా తనకు ఇప్పటికీ అన్నం సహించడం లేదని.. ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. తనలాగా మరికొంత మంది మహిళలకు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని షేర్ చేశానని పేర్కొన్నారు. దీంతో దిగి వచ్చిన స్విగ్గీ యాజమాన్యం.. ఈ నేపథ్యంలో మొదట కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా జరిగి ఉంటుందని చెప్పిన స్విగ్గీ యాజమాన్యం ఎట్టకేలకు ఆమెకు క్షమాపణలు చెప్పింది. దాంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్‌ను ఆమెకు అందజేసింది. అలాగే ఆమె డిమాండ్ మేరకు సదరు డెలివరీ బాయ్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్.. ఆహా!!
న్యూఢిల్లీ: ఆన్లైన్ వంటకు భారతీయులు అంతకంతకూ అలవాటుపడుతున్నారు. నచ్చిన ఆహారాన్ని ఆన్లైన్లో, మొబైల్ యాప్స్ నుంచి సులభంగా ఆర్డర్ చేసి, తామున్న చోటుకు తెప్పించుకుని తినేస్తున్నారు. పెద్ద పట్టణాల్లోనే కాదు, చిన్న పట్టణాలకూ ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇంటి వంటకే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. పెరుగుతున్న మహిళల ఆర్జన, టెక్నాలజీ అందుబాటు... ఆహారం విషయంలో ఆధునికతవైపు అడుగులు వేయిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో ఈ రెండూ టాప్–2 ఫుడ్ డెలివరీ కంపెనీలు. స్వల్ప కాలంలోనే భారీ మార్కెట్‌ను సృష్టించుకున్న ఈ స్టార్టప్‌లు ఇప్పుడు చిన్న పట్టణాలకూ జోరుగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, అదే సమయంలో ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్లతో ఆహార సంస్కృతి కూడా మారిపోతోందంటున్నారు విశ్లేషకులు. చిన్న పట్టణాల్లోకి చొచ్చుకుపోతున్నాయ్... గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న జొమాటో ఇప్పటికే 165కు పైగా పట్టణాలకు చేరుకుంది. 2018 జూలై నుంచే 150 పట్టణాలను చేరుకోవడం కార్యకలాపాల వేగాన్ని తెలియజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ 2018 అక్టోబర్ నాటికి 30 పట్టణాల్లో సేవలను ఆఫర్ చేయగా, తాజాగా ఈ సంఖ్య 100 దాటింది. ఇదే తరహా కంపెనీలు ఫుడ్ పాండా (ఓలాకు చెందిన) 100 పట్టణాలకు చేరుకోవడం గమనార్హం. ఉబర్ ఈట్స్ 40 పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరింత వినూత్న నమూనాలతో తాము రావాల్సి ఉందంటున్నారు జొమాటో సీఈవో మోహిత్ గుప్తా. భారత్ వంటి దేశంలో కనీసం 500 పట్టణాలకు అయినా చేరుకోవడం సులభమేనన్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలపై ఈ కంపెనీలు పెద్ద అంచనాలతోనే ఉన్నాయి. ఇక్కడ తమకు భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని అవి భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కేవలం మెట్రో సంస్కృతిగానే భావించే పరిస్థితి ఉంటే, అది కాస్తా పూర్తిగా మారిపోవడాన్ని ప్రస్తుతం గమనించొచ్చు. పంజాబ్‌లోని ముక్త్సర్ పట్టణ జనాభా లక్షన్నర. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ పుట్టి పెరిగింది ఇదే పట్టణం. ఇక్కడ జొమాటో ఎప్పటి నుంచో ఉండగా, ప్రతి రోజూ 3,500 ఆర్డర్లను సొంతం చేసుకుంటోంది. జనవరిలో ఇక్కడికి ప్రవేశించిన స్విగ్గీ రోజూ 1,000 ఆర్డర్లను దక్కించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తుని పట్టణంలో జొమాటో నిత్యం 50,000 ఆర్డర్లను సొంతం చేసుకుంటుండడం విస్తరిస్తున్న ఈ సంస్కృతికి నిదర్శనం. జైపూర్ పట్టణ జనాభా 37 లక్షలు. నిత్యం ఇక్కడ 50వేల ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు నమోదవుతున్నాయి. భారీ విస్తరణ బాటలో... స్విగ్గీ, జొమాటో తమ కార్యకలాపాల విస్తరణ కోసం గతేడాది నుంచి 2 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు) మేర నిధులను సమీకరించాయి. జొమాటోకు చైనాకు చెందిన ఆంట్ ఫైనాన్షియల్ అండగా నిలవగా, స్విగ్గీ వెనుక దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ ఉంది. ప్రతీ ఒకటి రెండు రోజులకు కొత్తగా ఓ పట్టణంలో ఇవి అడుగుపెడుతున్నాయి. స్విగ్గీ మొత్తం ఆర్డర్లలో 20–25 శాతం టాప్ 10 పట్టణాలకు వెలుపలి నుంచే వస్తుండడం గమనార్హం. జొమాటో టాప్ 15 పట్టణాలు కాకుండా ఇతర పట్టణాలను వర్ధమాన పట్టణాలుగా భావిస్తుండగా, ఈ ఏడాది చివరికి ఈ పట్టణాల మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఈ రెండు సంస్థలు కలిపి ప్రతి నెలా మూడున్నర కోట్ల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాయి. టాప్ ఏడు పట్టణాలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, కోల్‌కతా నుంచే మొత్తం మీద 85–90 శాతం విలువ మేర ఆర్డర్లు గతంలో వస్తుండగా, వీటి వాటా 65–70 శాతానికి తగ్గిపోయినట్టు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అధ్యయనంలో వెల్లడైంది. తర్వాతి 15–20 వర్ధమాన పట్టణాలు జైపూర్, అహ్మదాబాద్, విశాఖపట్నం, కోయంబత్తూరులో ఆర్డర్ల సంఖ్య రోజువారీ 60వేలకు చేరుకుంది. 2018లో 10–11 కోట్ల మంది ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై లావాదేవీలు నిర్వహించగా, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఇచ్చిన వారి సంఖ్య ఇందులో పావు వంతే ఉంది. కానీ, ఇప్పుడు నిత్యం 20 లక్షల లావాదేవీలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై జరుగుతున్నాయి. 17 లక్షల ఈ కామర్స్ లావాదేవీలను ఇవి మించిపోయినట్టు రెడ్‌సీర్ విశ్లేషణ. 2023 నాటికి రూ.1.20 లక్షల కోట్లకు మన దేశంలో ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ ఏటా 16 శాతం చొప్పున పెరిగి 2023 నాటికి 17 బిలియన్ డాలర్ల (1.20 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెట్రో నగరాల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుండడం ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ వృద్ధికి చోదకంగా నిలుస్తున్నట్టు ఈ సంస్థ తెలిపింది. సర్వేయర్లు చెప్పిన అంశాలు ►ఆఫర్లు, డిస్కౌంట్లు నచ్చి తాము ఆన్లైన్లో ఆహారం కోసం ఆర్డర్ చేసినట్టు 95 శాతం మంది చెప్పారు. ►సమయం ఆదా, సౌకర్యం అని చెప్పిన వారు 84%. ►సౌకర్యం కారణంగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారు 78 శాతం మంది అయితే, ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉండడం వల్లే ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టు 73 శాతం మంది చెప్పారు. ►ఎక్కువ మంది మధ్యాహ్న భోజనం (లంచ్) ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్డుల ద్వారా ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి. ►మొత్తం ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్యాపరంగా బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉంది. 20 శాతం వాటా ఈ నగరానిదే. ► 18 శాతం వాటాతో ముంబై, 17 శాతం వాటాతో పుణే, 15 శాతం వాటాతో ఢిల్లీ, 12 శాతం వాటాతో హైదరాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
కిరాణా సేవల్లోకి ‘స్విగ్గీ’
బెంగళూరు: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్ డెలివరీ సేవల్లోనే ఉన్న ఈ సంస్థ.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ తరహాలో ఇక నుంచి కిరాణా వస్తువులు, మందులు, శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఇతర రోజువారీ సదుపాయాలను అందించనుంది. ఇందుకోసం ‘స్టోర్స్’ పేరిట ఒక ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ఫ్లాట్‌ఫాంను మంగళవారం ఆవిష్కరించింది. తొలుత ఈ సేవలను హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ఇక్కడి 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టోర్‌కు మా సేవలను అనుసంధానం చేయడంలో భాగంగా ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్ కేర్ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానం చేశాం అని వ్యాఖ్యానించారు. -
ఇకపై స్విగ్గీలో ఇవి కూడా
సాక్షి, న్యూఢిల్లీ : అన్లైన్ ఫుడ్ డెలివరీసంస్థ స్విగ్గీ కొత్త వ్యూహాలతో వ్యాపార విస్తరణకు పూనుకుంటోంది. ఇకపై తమ స్విగ్గీ ద్వారా పండ్లు, కూరగాయలు, కిరణా సరుకులు, ఇతర అత్యవసరమైన వస్తువులను డెలివరీ చేస్తామని మంగళవారం ప్రకటించింది. ఇందుకు వివిధ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. టూత్‌పేస్ట్ నుంచి మీ పెంపుడు జంతువుల ఆహారందాకా అన్నీ గంటలోపలే డెలివరీ చేస్తామని పేర్కొంది. 3500 స్టోర్ల ద్వారా ముందుగా గురుగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. పళ్లు, కూరగాయలు,మాంసం, శిశు సంరక్షణ వస్తువులతోపాటు, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నామని స్వీగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విగ్జీ స్టోర్స్ ' పేరుతో ఆవిష్కరించిన కొత్త సేవలు మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందుకోసం హెల్త్‌కార్ట్, జాప్ప్రెష్, అపోలో సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా 2014లో ఆహార-పంపిణీ సేవల సంస్థ స్విగ్గీ ఒక ప్రస్తుతం 80 కంటే ఎక్కువ భారతీయ నగరాల్లో పనిచేస్తోంది. -
స్విగ్గీలో నూడుల్స్ ఆర్డర్ చేస్తే..
సాక్షి, చెన్నై: ఆన్లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వారికి మరో షాకింగ్ న్యూస్. మొన్న జొమాటో డెలివరీ బాయ్ మధ్య దారిలో.. కస్టమర్ ఫుడ్‌ను తింటూ కెమేరాకు చిక్కిన వైనాన్ని ఇంకా మర్చిపోక ముందు మరో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ నిర్వాకం కలకలం రేపింది. స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన ప్యాక్‌లో బ్యాండేజ్ దర్శనమివ్వడంతో సదరు కస్టమర్‌కు వాంతులు ఒకటే తక్కువ. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన బాలమురుగన్ స్విగ్గీ ద్వారా సెలైయూర్ సమీపంలోని ‘చాప్ ఎన్ స్టిక్స్’ చైనీస్ రెస్టారెంట్ నుంచి చికెన్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. వేడి వేడి ప్యాకెట్ ను చూడగానే నోరూరింది. వెంటనే పార్శిల్ తెరిచి ఆరగిస్తుండగా అందులో రక్తంతో తడిచిన బ్యాండేజ్ కనిపించింది. దీంతో షాకైన బాలమురుగన్ వెంటనే ఆ రెస్టారెంట్‌కు ఫోన్‌చేసి ప్రశ్నించాడు. అయితే, ఆ హోటల్ వారు ఫుడ్ రీప్లేస్ చేయడానికి అంగీకరించలేదు. రిఫండ్ కూడా ఇవ్వమని కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే, స్విగ్గీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడేందుకు ఫోన్ నెంబరు లేదు. దీంతో చాటింగ్ ద్వారా మాత్రమే మురుగన్ స్విగ్గీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం శూన్యం. దీంతో దిక్కుతోచని మురుగన్ ఫేస్బుక్లో స్విగ్గీ పేజ్‌లో తన కంప్లయింట్ పోస్ట్ చేశాడు. తాను ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో బ్లడ్ బ్యాండేజ్ ఉంది. దీనిపై తక్షణమే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని భావిస్తున్నాననీ, వివిధ హోటళ్లతో భాగస్వామ్యం విషయంలో స్వీగ్గీ మరింత అప్రమత్తంగా ఉంటూ లోపాలను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల తనకేమైనా అనారోగ్యం సోకితే కంపెనీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇది వైరల్ కావడంతో చివరికి స్విగ్గీ దిగి రాకతప్పలేదు. వినియోగదారుడికి ఎదురైన అనుభవంపై చింతిస్తున్నామంటూ ఆయనకు క్షమాపణలు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత మాకు ఎంతో ముఖ్యం. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని బాధితుని ఫిర్యాదు మేరకు రెస్టారెంటును మా జాబితా నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది దీనిపై థర్డ్ పార్టీ విచారణ జరుపుతామని పేర్కొంది. -
స్విగ్గీ చేతికి కింట్ ఐవో
న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ‘కింట్ డాట్ ఐవో’ను స్విగ్గీ సొంతం చేసుకుంది. దీంతో కింట్ ఐవో వ్యవస్థాపకులు పవిత్ర సోలాని జవహర్, జగన్నాథన్ వీరరాఘవన్ స్విగ్గీ బృందంలో చేరతారని కంపెనీ తెలిపింది. తన ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపునకు ఈ కొనుగోలు చేసింది. యూబీఎస్ మార్పులతో యమహా స్కూటర్లు న్యూఢిల్లీ: భారత నూతన ప్రమాణాలకు తగినట్లుగా తమ కంపెనీ స్కూటర్లను ఆధునికరిస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకీకృత బ్రేకింగ్ వ్యవస్థను (యూబీఎస్) తమ స్కూటర్లలో అమర్చనున్నట్లు తెలియజేసింది. 125 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలకు ఈ వ్యవస్థ తప్పనిసరికావడంతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ కంపెనీ చైర్మన్ మెటొఫుమీ షితార వివరించారు. -
స్విగ్గి, జోమాటో, ఉబర్ డెలి‘వర్రీ’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే కంపెనీల వాహన చోదకులు ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో సైబరాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ తదితర సంస్థలకు చెందిన అధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం ‘సెన్సిటైజేషన్ కమ్ సేఫ్టీ’ సమావేశం నిర్వహించారు.ఫుడ్ డెలివరీ వాహనాల ప్రమేయమున్న ప్రజల భద్రత, రోడ్డు భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్, శాంతిభద్రతలు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. తీరు మార్చుకోవాల్సిందే... మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, వ్యతిరేక దశలో డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హారన్లు ఇష్టారీతిన మోగించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్ డెలివరీ వాహనచోదకులు ఆందోళన కలిగిస్తున్నారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిథులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై ఆయా కంపెనీలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే డ్రైవర్లను తీసుకునే సమయంలో వారి పూర్వపరాలు, కస్టమర్ డాటా నిర్వహణ, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు తరచూ అతిక్రమించే వారిపై నిఘా వేసి తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు హామీ ఇచ్చారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సమావేశానికి ఆహ్వనించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించే తమ కంపెనీ వాహన డ్రైవర్లపై కఠినంగా ఉంటామన్నారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు ప్రవీణ్‌కుమార్, అమర్‌కాంత్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు.