
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన నాలుగవ రోజు కూడా కొనసాగుతోంది. తమ బేస్ పే తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ(శుక్రవారం) తమ 14 డిమాండ్లను తీర్చాలని యాజమాన్యాన్ని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు. ఇందులో ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చకపోయినా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి డెలివరీ చేస్తున్నప్పటికి తమ బేస్ పేను తగ్గించడం దారుణమన్నారు. గతంలో మాదిరిగా తమ బేస్ పే 35 రూపాయలను ఇవ్వాల్సిందిగా స్విగ్గీ బాయ్స్ డిమాండ్ చేశారు. (చదవండి: స్విగ్గీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment