సాక్షి, విజయవాడ : నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సేవలు నిలిచిపోనున్నాయి. కమీషన్ పెంచమని తమపై ఒత్తిడి తెస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల తమకు నష్టం జరుగుతుందని, దీంతో ఈ నెల 11 నుంచి స్విగ్గీతో లావాదేవీలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment