సాక్షి, హైదరాబాద్: నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనుననారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్.. పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతోంది. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్. ఒకవేళ స్విగ్గి యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.
స్స్విగ్గి డెలివరీ బాయ్స్ డిమాండ్స్
1. డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి.
2. ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి.
3. నెల రేటింగ్స్ కి 4000 బోనస్ ఇవ్వాలి.
4. కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి.
5. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్ జోన్స్ తీసేయాలి.
స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ముందుగానే స్విగ్గీ బాయ్స్ సమ్మెకు దిగారు. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అధికం..!
డెలివరీ బాయ్స్ నిరసనలపై స్విగ్గీ యాజమాన్యం స్పందించింది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ మేర సంపాదిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అధిక ఆదాయాలను పొందుతున్నారు. పేఅవుట్ స్ట్రక్చర్‌లో ఏలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్‌లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు గత ఏడాదితో పోలిస్తే గంటకు 30 శాతం ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా స్విగ్గీ ఇంధన ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టిందని వెల్లడించింది. దురదృష్టవశాత్తూ, కొంతమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని కంపెనీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌లోని వేలాది మంది ఎగ్జిక్యూటివ్‌లకు మెడికల్ ఇన్సూరెన్స్, కోవిడ్ కవర్ ఎక్స్‌టెన్షన్, యాక్సిడెంట్ కవర్ వంటి ప్రయోజనాలతో పాటుగా విశ్వసనీయమైన, స్థిరమైన సంపాదన అవకాశాలను కల్పిస్తున్నందుకు కంపెనీ గర్విస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment