
అబిడ్స్: అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో విద్యుత్ వైరు తెగిపడడంతో స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని గోడేకికబార్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ముస్తాఫ్‌ఉద్దీన్(40) స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గోషామహల్ పాన్‌మండి నుండి మంగళ్‌హాట్ ప్రాంతానికి గురువారం అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది.
భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి అతనిపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్ ఉద్దీన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న కొంత మంది స్థానికులు షాహినాయత్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్‌ఐ కిషన్‌లు విద్యుత్ అధికారులను రపించి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దాదాపు 3 గంటల పాటు శుక్రవారం తెల్లవారు జాము వరకు గోడేకికబర్, మంగళ్‌హాట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు
న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment