సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లైన్ ఫుడ్ డెలివరీసంస్థ స్విగ్గీ కొత్త వ్యూహాలతో వ్యాపార విస్తరణకు పూనుకుంటోంది. ఇకపై తమ స్విగ్గీ ద్వారా పండ్లు, కూరగాయలు, కిరణా సరుకులు, ఇతర అత్యవసరమైన వస్తువులను డెలివరీ చేస్తామని మంగళవారం ప్రకటించింది. ఇందుకు వివిధ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. టూత్‌పేస్ట్ నుంచి మీ పెంపుడు జంతువుల ఆహారందాకా అన్నీ గంటలోపలే డెలివరీ చేస్తామని పేర్కొంది. 3500 స్టోర్ల ద్వారా ముందుగా గురుగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.
పళ్లు, కూరగాయలు,మాంసం, శిశు సంరక్షణ వస్తువులతోపాటు, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నామని స్వీగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విగ్జీ స్టోర్స్ ' పేరుతో ఆవిష్కరించిన కొత్త సేవలు మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందుకోసం హెల్త్‌కార్ట్, జాప్‌ప్రెష్, అపోలో సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా 2014లో ఆహార-పంపిణీ సేవల సంస్థ స్విగ్గీ ఒక ప్రస్తుతం 80 కంటే ఎక్కువ భారతీయ నగరాల్లో పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment