డెలివరీ బాయ్స్‌ లిఫ్ట్‌ ఉపయోగించకూడదట! | A Mall In Udaipur Put Up A Notice Stating Swiggy And Zomato Delivery Boys Cannot Use The Lift | Sakshi
Sakshi News home page

డెలివరీ బాయ్స్‌ లిఫ్ట్‌ ఉపయోగించకూడదట!

Published Wed, Sep 22 2021 11:19 AM | Last Updated on Thu, Dec 23 2021 5:08 PM

A Mall In Udaipur Put Up A Notice Stating Swiggy And Zomato Delivery Boys Cannot Use The Lift  - Sakshi

కరోనా మహమ్మూరి సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జోమాటో, స్విగ్గీ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫుడ్‌ని డెలివరీ చేశాయి. అంతేకాదు ఆ క్లిష్ట సమయంలో డెలివరీ బాయ్స్‌ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్లి ఆహారం, నిత్య అవసరాలను  ఇళ్ల వద్దకే నేరుగా తీసుకు వచ్చి అందించారు. ఈ మహమ్మారీ సమయంలో డెలివరీ బాయ్స్‌ హీరోల్లా సేవంలందించి అందరీ ప్రశంసలను అందుకున్నారు. కానీ ఉదయ్‌పూర్‌లోని ఒక మాల్‌ డెలివరీ బాయ్స్‌ని ఇబ్బందికీ గురి చేసేలా ఒక నోటీస్‌ అంటించింది.  ఈ నోటీస్‌ చాలా మందిని కలవరపాటుకు గురి చేయడమే కాక ఈ ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి వివక్షత కొనసాగుతోందా అని ఒకింత ఆశ్చర్యపోక తప్పదేమో!

(చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి)

ఇంతకీ  ఆ నోటిస్‌ సారాంశం ఏంటంటే  "జోమాటో, స్విగ్గీ ఫుడ్‌ డెలిరీ బాయ్స్‌ లిఫ్ట్‌ యూజ్‌ చేయకండి...మెట్ల వైపు నుంచే వెళ్లండి " అని ఉంది. ఈ క్రమంలో వాళ్లు  వినియోగదారులకు సమయానికీ ఫుడ్‌ అందించలేరు, పైగా మరో ఆర్డర్‌ని కూడా తీసుకోలేరు. ఈ నోటిస్‌ని జర్మలిస్ట్‌ శోభనా నాయర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు " ఆధునిక కాలపు భూస్వామ్యం" అంటూ ట్యాగ్‌ లైన్‌ జోడించారు. 

దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌వుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆగ్రహంతో తమదైన శైలిలో ఘాటుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకే ఈ దేశం ఇంకా వెనుకబడి ఉందని ఒకరు, ఇది డెలివరీ బాయ్స్‌ పట్ల వివక్ష, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని...పలురకాలుగా నెటిజన్లు ట్వీట్‌ చేయడం మొదలు పెట్టారు.

(చదవండి: పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement