చెన్నై,పెరంబూరు: అర్ధరాత్రి నటి యాషికా కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికి నుంగంబాక్కం సమీపంలో శనివారం రాత్రి ఒక ఖరీదైన కారు వేగంగా వచ్చింది. స్థానిక హారింగ్‌టన్ రోడ్డు వద్ద అదుపు తప్పి వ్యక్తిని ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సంఘటనపై పాండిబజార్ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వచ్చారు. కాగా పోలీసుల విచారణలో ఆ కారులో నటి యాషిక తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ముగించుకుని వస్తూ ఈ యాక్సిడెంట్ చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment