ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) కొన్ని రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుండడంతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘హౌ ఇండియా స్విగ్గీ ఇట్స్ వే త్రూ 2024’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది
2024లో 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా బిర్యానీ(Biryani) నిలిచింది. ముఖ్యంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.
2.3 కోట్ల ఆర్డర్లతో దోశ టాప్ బ్రేక్‌ఫాస్ట్‌గా నిలిచింది. 25 లక్షల మసాలా దోశ ఆర్డర్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.
డిన్నర్‌లోనే ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ పెట్టారు. 21.5 కోట్ల ఆర్డర్లతో లంచ్ ఆర్డర్ల కంటే డిన్నర్ సమయాల్లో 29 శాతం పెరుగుదల నమోదైంది.
అర్ధరాత్రి భోజనం చేయాలనుకునేవారికి చికెన్(Chicken) బర్గర్లు టాప్ ఛాయిస్‌గా నిలిచాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 18.4 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
బెంగళూరు వినియోగదారుడు పాస్తా విందు కోసం రూ.49,900 ఖర్చు చేయగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒకేసారి 250 ఉల్లిపాయ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.
స్విగ్గీ డైనౌట్(Dineout) ద్వారా 2.2 కోట్ల మంది వినియోగదారులకు రూ.533 కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. డిస్కౌంట్లలో రూ.121 కోట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.
స్విగ్గీ డెలివరీ భాగస్వాములు సమష్టిగా 1.96 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భారతదేశం చుట్టుకొలత కంటే చాలా రెట్లు ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment