‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్‌లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్‌లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్‌క్రూ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
‘ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment