indigo aeroplane
-
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
కొచ్చి:బెంగళూరు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అంశంపై ఇండిగో స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తిన విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి వినియోగంలోకి తెస్తామని ఇండిగో తెలిపింది.ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.సాంకేతిక లోపంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 91మంది భారతీయ పౌరులు కాగా 49మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. -
విమానంలో చంద్రబాబు భార్య.. గాల్లో 20 నిమిషాలు గందరగోళం
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏం జరిగింది.? హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు. భువనేశ్వరీ ప్రయాణం ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్
విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్లు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఫ్లైట్స్, రూట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో రోజూ రెండు వేల విమానాలు నడిపి భారత విమానయాన రంగంలో చరిత్ర సృష్టించింది. రోజుకు రెండు వేలకు పైగా విమానాలు నడిపి ఇండిగో సంస్థ కొత్త మైలురాయిని చేరింది. దాంతో దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఎయిర్‌లైన్‌గా నిలిచింది. అక్టోబర్ 2023కి సంబంధించిన ఓఏజీ డేటా ప్రకారం.. ఫ్రీక్వెన్సీ, సీట్ కెపాసిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో చోటు దక్కించుకుంది. 'ఇండిగో ఇప్పుడు ప్రణాళికబద్ధంగా రోజు రెండు వేలకు పైగా విమానాలను నడుపుతోంది. ఇందులో కార్గో ఆపరేషన్స్, సీఏపీఎఫ్, ఆర్మీ చార్టర్లు ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 17 ఏళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఆపరేషనల్ సామర్థ్యం, విశ్వసనీయత, కస్టమర్ ఓరియంటేషన్లో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది' అని ఎయిర్‌లైన్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇది కేవలం సంఖ్యాపరమైన ఘనతేకాదని, కనెక్టివిటీతో పాటు ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం కల్పించేదిగా భావిస్తున్నట్లు పీటర్ చెప్పారు. -
TS Crime News: 'ఇండిగో విమానం'లో మందు బాబుల వీరంగం!
హైదరాబాద్: మందుబాబులు విమానంలో వీరంగం చేశారు..తాగిన మైకంలో చేసిన లొల్లితో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోహా నుంచి గురువారం మధ్యాహ్నం ఇండిగో 6ఈ1314 విమాన హైదరాబాద్‌కు బయలుదేరింది. ఖతార్‌లో పనిచేస్తున్న త్రివేండ్రంకు చెందిన నలుగురు ప్రయాణికులు దోహా విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీలో తీసుకున్న మద్యం సీసాలను బయటికి తీసి తాగడం మొదలు పెట్టారు. దీనిని గుర్తించి ఇండిగో ఉద్యోగి తమ అనుమతి లేకుండా మద్యం తాగకూడదని వారికి సూచించారు. అయినా వారు వినకపోగా, తమకు ఇంగ్లీష్‌లో చెప్పింది అర్థం కాలేదని సమాధానం ఇచ్చారు. వీరి వైఖరితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదరు ప్రయాణికులపై ఇండిగో ఉద్యోగి గురువారం సాయంత్రం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే..
ఇండిగో ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. గురువారం (ఫిబ్రవరి 9) హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 409 విమానం 37 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. విశాఖపట్నం చేరుకున్న అనంతరం తమ బ్యాగుల కోసం వెతికిన ప్రయాణికులు.. వాటిని విమాన సిబ్బంది అక్కడే వదిలేసి వచ్చారని తెలుసుకుని ఎయిర్ లైన్స్ యాజమాన్యంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. జరిగిన పొరబాటు మానవ తప్పిదమని, 37 మంది ప్రయాణికుల బ్యాగులను వారి విశాఖపట్నంలోని వారి చిరునామాలకు వీలైనంత త్వరగా, సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలియజేసింది. కాగా లగేజీని విమాన సిబ్బంది హైదరాబాద్‌లోనే వదిలేసి వచ్చారని తెలుసుకున్న ప్రయాణికులు తమ బ్యాగుల కోసం గంటతరబడి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనే ఎదురుచూశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపటికి లగేజీని సురక్షితంగా ప్రయాణికుల ఇళ్లకు చేరుస్తామని విమాన సంస్థ హామీ ఇవ్వడంతో శాంతించారు. (ఇదీ చదవండి: మారిషస్‌కు విస్తారా సర్వీస్) -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి
-
7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దాంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాలిలో చక్కర్లు కొట్టింది. 7 సార్లు చక్కర్లు కొట్టిన అనంతరం దిగేందుకు వీలులేక హైదరాబాద్ వెనుదిరిగింది. -
పొగమంచుతో శంషాబాద్‌లో విమానం అత్యవసర లాండింగ్
సంక్రాంతి వెళ్లిపోయినా పొగమంచు మాత్రం ఇంకా తగ్గలేదు. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఓ ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. దట్టమైన పొగమంచు కారణంగా ఆ విమానం ముందుకు వెళ్లే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో ప్రమాదాన్ని నివారించేందుకు అత్యవసరంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ల్యాండ్ చేశారు. పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే విమానాన్ని మళ్లీ కోల్‌కతాకు పంపే అవకాశం ఉంది.