చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండిగో 6E478 విమానం అమృత్‌సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు.
'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది.
ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
Comments
Please login to add a commentAdd a comment