airoplane
-
బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో?
ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్సర్వీస్కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 అది డంకీ విమానమేనా? ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది. వాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ మీడియా చానెల్స్ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 ఏం జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఏ340 ఛార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యూఏఈ(దుబాయ్) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇన్నిరోజులు అదుపులోనా? ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా వెళ్లే క్రమంలో? అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆందోళన కలిగించే అంశమే! ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ & బార్డర్ ప్యాట్రోల్(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!
దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటువంటి ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో 16 విమానాలను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విమానాలను సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మళ్లించినట్లు ఆ అధికారి తెలిపారు. జైపూర్‌కు పది, లక్నోకు మూడు, అమృత్‌సర్‌కు రెండు, అహ్మదాబాద్‌కు ఒక విమానాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఐదు ఎయిర్ ఇండియా విమానాలను ఇతర ప్రాంతాలకు పంపినట్లు మరో అధికారి తెలిపారు. వీటిలో సిడ్నీ నుంచి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు పంపించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం, విమాన ట్రాఫిక్ కారణంగా గౌహతి నుండి ఢిల్లీకి విస్తారా విమానం యూకే 742ను జైపూర్‌కు మళ్లించినట్లు ఆ సంస్థ మీడియాకు తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియజేసింది. విమాన ప్రయాణికులు సహాయం కోసం తమ అధికారులను సంప్రదించాలని తెలియజేసింది. కాగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఢిల్లీలో కాలుష్యం కొంతమేర తగ్గవచ్చని అంచనా. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం కారణంగా ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు. ఇది కూడా చదవండి: గుజరాత్లో అకాల వర్షాలు.. #6ETravelAdvisory : Flight operations to/from #Delhi are impacted due to heavy rain. You may keep a tab on your flight status by visiting https://t.co/TQCzzykjgA. For any assistance, feel free to DM. — IndiGo (@IndiGo6E) November 27, 2023 -
ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు!
చెన్నై: ఇండిగో విమానంలో ఆరుగురు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కేవలం అరుగురు ప్రయాణికులే ఉన్నందున విమాన ప్రయాణాన్ని సిబ్బంది నిలిపివేశారు. మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని ప్రయాణికుల్ని సిబ్బంది తెలివిగా దించేశారు. అనంతరం ఎలాంటి ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండిగో 6E478 విమానం అమృత్సర్ నుంచి చెన్నై వెళుతుంది. మధ్య బెంగళూరు చేరుకునే సరికి రాత్రి 9:30 అయింది. కెంపెగౌడ విమానాశ్రయంలోనే ప్రయాణికులందరూ దిగిపోయారు. కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆరుగురు ప్రయాణికుల కోసం బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్లడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని తెలివిగా కిందకు దించేశారు. రాత్రి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులను గాలికి వదిలేశారు. 'కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే సిబ్బంది తమకు ఫోన్ చేసి మరో విమానం అందుబాటులో ఉందని చెప్పారు. బోర్డింగ్ పాస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి రాత్రి 9:30 సమయంలో విమానం కిందికి దించేశారు. కానీ రాత్రి ఎలాంటి ఏర్పాటు చేయలేదు' అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం.. ఉదయాన్నే వారిని ఇతర విమానంలో చెన్నైకి పంపించామని తెలిపింది. ఇదీ చదవండి: PM Modi Met Team India Video: డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ -
ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!
బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
ఆకాశయానం అందని ద్రాక్షేనా?
భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ఎయిర్‌పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్‌పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. విమానాశ్రయం ముచ్చట సాగిందిలా.. ► కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు. ► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఎయిర్‌పోర్టు పనుల్లో దూకుడు పెంచారు. ► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది. ► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. ► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు. ► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు. దృష్టిపెట్టండి.. పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్‌బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఇప్పటికై నా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. -
లాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం..
సోమాలియా: హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయ్యింది. సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న సుమారు 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. అడెన్ అడె విమానాశ్రయంలో ఒక విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చి క్రాష్ లాండింగ్ అయ్యింది. విమాన తాకిడికి ప్రహారీ కంచె తునాతునకలైంది. ఇంతటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేచిన వేళా విశేషం బాగుంది కాబట్టే బ్రతికి బట్టకట్టామని ప్రయాణికులు షాక్ నుండి బయటపడి ఆశ్చర్యంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేఖరి ఒకరు వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన E 120 తరహా విమానం అడెన్ అడె అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ నెంబర్ రన్ వే మీద క్రాష్ లాండింగ్ అయ్యింది. సోమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 34 మంది పాసింజర్లు ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారని ఒక్కరికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు. వీడియో చూశాక అందులోని వారికెవ్వరికీ ఏమీ కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time. All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY — Harun Maruf (@HarunMaruf) July 11, 2023 ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
తప్పతాగి విమానంలో రచ్చ చేసిన యువకుడు.. గెంటేసిన పోలీసులు
ఇంగ్లండ్: విమానంలో తాగి రచ్చ రచ్చ చేశాడు ఓ వ్యక్తి. 11 ఏళ్ల తర్వాత స్నేహితుడితో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానే ఎగ్జైట్మెంట్లో అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు విమానంలోని సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదరు వ్యక్తి కూర్చున్న సీటు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతడు తాగి ఉన్నాడని, వోడ్కా బాటిల్లో మూడో వంతు కాళీ చేశాడని సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో అతడ్ని విమానం నుంచి దిగిపోమని పోలీసులు సూచించారు. అతడు మాత్రం పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. నా లగేజ్‌ను మీరు మోసుకొస్తారా? అని పోలీసులను ప్రశ్నించాడు. అంతేకాదు తనతో పోట్లాటకు రావాలని వాగాడు. చివరకు పోలీసులు అతడ్ని విమానం నుంచి దింపి వ్యానులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ విమానంలోకి వెళ్లి సదరు వ్యక్తి స్నేహితుడ్ని కూడా విమానం నుంచి దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. తాగి రచ్చ చేసిన వ్యక్తి పేరు ఆశ్లే క్రచ్లీ(27). ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసముంటాడు. హాలిడే ట్రిప్‌కు పోర్చుగల్‌కు వెళ్లే సమయంలో ఇలా చేశాడు. 11 ఏళ్ల తర్వాత తనకు హాలిడే వచ్చిందనే ఉత్సాహంలోనే అతడు ఎగ్జైట్ అయి ఇలా చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. క్రచ్లీ తన ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఇబ్బందికర ప్రవర్తనకు క్రచ్లీ రూ.30వేలు జరిమాన కట్టాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు రూ.8వేలు, బాధిత సిబ్బందికి రూ.12వేలు చెల్లించాలని చెప్పింది. చదవండి: మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ! -
ఆకాశవీధిలో.. వేసవిలో పెరగనున్న విమానాలు
న్యూఢిల్లీ: రాబోయే వేసవి షెడ్యూల్‌కు సంబంధించి దేశీ విమానయాన సంస్థలు .. వారంవారీగా ఫ్లయిట్ సర్వీసులను 10.1 శాతం మేర పెంచనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. గత సీజన్లో ఈ సంఖ్య 22,980గా ఉండగా ఈ సీజన్లో 25,309గా ఉంటుందని పేర్కొంది. ఇండిగో అత్యధికంగా దేశీ రూట్లలో తన ఫ్లయిట్స్ సంఖ్యను 10.4 శాతం పెంచి 11,130 వీక్లీ సర్వీసులను నడపనున్నట్లు వివరించింది. ఎయిర్పోర్ట్ స్లాట్లపై గత నెల జరిగిన వర్చువల్ సమావేశం అనంతరం దేశీ విమానయాన సంస్థల వేసవి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షల కారణంగా గత 24 నెలలుగా దేశీ ఏవియేషన్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. గత కొద్ది వారాలుగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. వేసవి షెడ్యూల్ ప్రకారం వారంవారీగా ఎయిర్ఏషియా 1,601 (16 శాతం అధికం), ఎయిరిండియా 2,456 (10 శాతం అధికం) ఫ్లయిట్ సర్వీసులు నడపనున్నాయి. -
5జీతో మన విమానాలకు ప్రమాదం? సమాధానం ఇచ్చిన కేంద్రం
మొబైల్ సర్వీసుల్లో 5జీని ప్రవేశపెట్టడంపై అమెరికన్ ఏవియేషన్ సెక్టార్ గజగజ వణికిపోయింది. ఇండియా నుంచి యూఎస్ఏ వెళ్లే విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. త్వరలో ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభించనున్నందున మన విమాన సర్వీసుల భద్రతపై పార్లమెంటులో కేంద్రాన్ని వివరణ అడిగారు మన ఎంపీలు. 5జీ ట్రయల్స్‌కి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు 5జీ సర్వీసుల వల్ల విమానాలకు ఏమైనా ప్రమాదమా ? దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఏదైనా రిపోర్టు ఉందా అంటూ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్‌తో పాటు 5జీకి కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌తో ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. 5జీ సర్వీసుతో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎయిరోనాటికల్ వ్యవస్థకు భద్రత ఉందని కేంద్రం భరోసా ఇచ్చింది. మనదేశంలో జియో, వోడాఐడియా, ఎయిర్ఎట్, ఎంఎన్టీఎల్ సంస్థలకు 5జీ ట్రయల్స్ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎంపిక చేసిన ఏరియాల్లో ఈ ట్రయల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలోనే 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్లో తెలిపింది. ఇటీవల అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభించగా ... విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎయిరోనాటికల్ కమ్యూనికేషన్స్‌కి ఇబ్బంది అంటూ విమానాలను గాల్లోకి ఎగురనివ్వలేదు. చదవండి:అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. భయాలతో విమానాల రీషెడ్యూల్! -
విమానంలో కూర్చుని బిర్యానీ తింటూ.. ప్రకృతి అందాలను చూస్తుంటే..కిక్కే కిక్కు!
సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు.. ఇక దానిలో భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. విజయవాడ వాసులకు ఈ అవకాశం దొరకుతోంది. చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్! విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది ‘డియర్ ఫుడ్ లవర్స్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్.. స్పెషల్ డిన్నర్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు సర్వ్’ అంటూ ఆహ్వానం పలుకుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’.. ఎలాగంటే!
న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్ వెళ్లే ఎయిర్ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ఆపేశారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఉన్నారు. ఎయిర్ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని) -
Afghanistan: ‘సిగ్గుందా? శవాలపై వ్యాపారమా?’
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత.. నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓవైపు తాలిబన్లు భద్రతా హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. అఫ్గన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు భయాందోళన నిండిన పౌరులు.. పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారగా.. పసిపిల్లలనైనా రక్షించాలనే తాపత్రయంతో కంచె అవతల ఉన్న విదేశీ సైన్యానికి అందిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా అనిపిస్తున్నాయి. అఫ్గన్ పరిస్థితులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓ దుస్తుల కంపెనీ.. అఫ్గన్ దుస్థితిని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రయత్నాన్ని దారుణంగా తిప్పికొట్టారు కస్టమర్లు. తాలిబన్ ఆక్రమణ పూర్తయ్యాక అమెరికా సీ-17 విమానం ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో.. ఇద్దరు వ్యక్తులు గగనతలం నుంచి ఓ బిల్డింగ్ మీద పడి ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. అఫ్గన్ల భయానికి అద్దంపట్టే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. As Afghans are fleeing and clinging to planes out of desperation, someone decided to capitalize on their pain and misery with this repulsive t-shirt. It’s being sold on at least half a dozen t-shirt printing websites right now. Humans can be so cruel. pic.twitter.com/du5cCbD2QA — Holly Dagres (@hdagres) August 18, 2021 అయితే ఈ ప్రాణభీతి ఘటనను ఉద్దేశిస్తూ.. కాబూల్ స్కై డైవింగ్ క్లబ్ పేరుతో ఓ దుస్తుల కంపెనీ లేటెస్ట్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఆకాశంలో విమానం నుంచి కిందపడ్డ పౌరులను ఉద్దేశిస్తూ ఆ టీషర్ట్ ఉంది. Kabul Skydiving Club Est. 2021 పేరుతో లేటెస్ట్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. కొన్ని ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు వీటిని అమ్మకానికి ఉంచడం విశేషం. దీంతో ‘సరదానా? శవాలపై వ్యాపారమా?’ అంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే రాజకీయ ఉద్దేశాలు, అఫ్గన్ల దీనస్థితిని తెలియజేసేందుకు తాము ఆ టీషర్టులను రూపొందించినట్లు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కానీ, వివరణపై నెటిజన్స్ మాత్రం తగ్గట్లేదు. విషాద ఘటన ద్వారా టీషర్టులను అమ్మే ప్రయత్నాన్ని ‘క్రూరం.. ఘోరం’గా అభివర్ణిస్తూ నెటిజన్స్ మండిపడుతున్నారు. చదవండి: మా కంటి పాపలనైనా కాపాడండి -
ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..
చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది. వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది. -
వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్!
సాక్షి, చెన్నై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. జీవితంలో ఒకసారి జరిగే ఈ వేడుకను కుటంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. దీంతో వివాహాలకు కూడా పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కావాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది జంటలు తమ వివాహాన్ని మమ అంటూ జరిపించేస్తున్నారు. కానీ కోవిడ్‌యే కాదు ఏ మహమ్మారి వచ్చిన తమ పెళ్లిని ఆపలేవంటూ, అందరి సమక్షంలో ఓ జంట ఒకటయ్యింది. అయితే వీరి వివాహం నేల మీద జరగలేదు.. వినూత్నంగా గాల్లో అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి మదురై అమ్మవారిలో సన్నిధిలో మంగళవారం జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ విషయం తెలియడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి ఒకటవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ -
విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఇటాలియన్ స్మూచ్ ఇవ్వనందుకు ఓ ప్రయాణికుడు విమానంలో బట్టలిప్పి మరీ రచ్చ చేశాడు. విమాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తోన్న ఎయిర్ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి లైఫ్ జాకెట్ ఇవ్వాలంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపటికి క్రూ దగ్గరకి వెళ్లి తనకు ఇటాలియన్ స్మూచ్ కావాలి అని అడిగాడు. వారు లేదని చెప్పడంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు తన ల్యాప్‌టాప్ విసిరి కొట్టాడు. తరువాత ఒంటి మీద బట్టలు విప్పుకుని.. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి.. తనకు దుస్తులు వేయాల్సిందిగా కోరాడు. లేదంటే ముద్దిమ్మని అడిగాడు. సదరు ప్యాసింజర్ బిత్తిరి చర్యలకు మిగతా ప్రయాణికలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా మరోసారి బట్టలిప్పి రచ్చ చేశాడు. సిబ్బంది ఎలాగో కష్టపడి అతడికి దుస్తులు తొడిగి సీట్లో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అతడిని అప్పగించారు. విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు గాను అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి వింత ప్రవర్తన చూసిన మిగతా ప్రయాణికులు అతడు డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! -
‘నా భార్యతో గొడవపడ్డాను.. పీఎంతో మాట్లాడాలి’
ఢాకా : గన్‌తో కాక్‌పిట్‌లోకి ప్రవేశించి.. విమనాన్ని హై జాక్ చేసేందుకే ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరిపి ప్రయాణికులను రక్షించారు భద్రతాసిబ్బంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగింది ఈ సంఘటన. వివరాలు.. 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు ప్రయత్నించాడు హైజాకర్. ఛత్రోగ్రామ్ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద గన్, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భార్యతో తనకు గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తనను వెంటనే మాట్లాడించాలంటూ నిందితుడు విమాన సిబ్బందిని డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ఉన్నతాధికారులు హైజాకర్‌తో చర్చలు జరిపి.. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అడగగా అందుకు హైజాకర్ ఒప్పుకున్నాడు. దాంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించారు. కానీ అతడు నిరాకరించడంతో కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు అధికారులు. ఈ విషయం గురించి దర్యాప్తు చేసిన అధికారులు ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. భార్యతో మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. అయితే అతడి వద్దకు పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి.. వాటిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్నది మాత్రం తెలియరాలేదని తెలిపారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
వైరల్ వీడియో: హోరు గాలిలో విమానం
లండన్ : హోరున తుపాను గాలులు. ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా ఊగిసలాడుతుందంటే.. తుపాను గాలుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు పైలెట్. కానీ కుదరలేదు. మరోవైపు తుపాను గాలులు విమానాన్ని కుదిపేస్తున్నాయి. పరిస్థితి చూసి ముందు భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై తన శాయశక్తుల ప్రయత్నించి.. ఎటువంటి ప్రమాదం లేకుండా విమానాన్ని మరో విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో జరిగింది ఈ సంఘటన. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ప్రస్తుతం లండన్‌లో ఎరిక్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. హీత్రో విమానాశ్రయానికి చేరుకున్న విమానం మరో రెండు సెకన్లలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ తుపాను గాలులు విమానాన్ని కుదిపేశాయి. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ కుదరలేదు. దాంతో విమానం రన్‌వేను తాకిన సెకన్ల వ్యవధిలోనే మళ్లీ టేకాఫ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని వేరే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. We are live now on our Elite Channel from #Heathrow and witnessed this insane #TOGA ! Well done pilot! @British_Airways #BA276 #StormErik pic.twitter.com/WMEvJ4P387 — BIG JET TV (@BigJetTVLIVE) February 8, 2019 బిగ్ జెట్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విమానం ల్యాండింగ్ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.32 మిలియన్ల మంది చూశారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. -
తప్పతాగి విమానంలో గొడవ చేసిన మహిళ..
లండన్ : తప్పతాగి విమాన సిబ్బందినే కాక.. తోటి ప్రయాణికులను కూడా ఇబ్బందులకు గురి చేసిన ఓ భారత సంతతి మహిళకు లండన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. వివరాలు.. కిరణ్ జాదవ్(41) అనే మహిళ ఈ ఏడాది జనవరిలో స్పెయిన్‌లోని టెనెరిఫే నుంచి బ్రిటన్‌కి ప్రయాణిస్తుంది. బోర్డింగ్‌కు నాలుగు గంటల ముందే కిరణ్ దాదాపు 6 - 8 బీర్లు.. విమానంలో మరో 6 గ్లాసుల వైన్ తాగింది. అంతటితో ఆగక మరింత మద్యం ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరింది. కానీ వారు అందుకు నిరాకరించడంతో నానా యాగి చేసింది. కింద కూర్చుని బిగ్గరగా నవ్వుతూ, ఏడుస్తూ.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తిని పట్టుకుని గందరగోళం సృష్టించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ ఆఫ్ డ్యూటీ పోలీసధికారి కిరణ్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతడిని బూతులు తిట్టడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తా ఎగుడుదిగుడుగా ఉండటంతో విమానం కుదుపులకు గురయ్యింది. దాంతో కిరణ్ ‘మనం చనిపోబోతున్నాం’ అంటూ గొడవ చేయడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం (నిన్న) జరిగింది. విమానంలో తప్ప తాగి ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను లండన్ కోర్టు కిరణ్ జాదవ్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. -
కల కోసం రూ. 2 కోట్లు వెచ్చించాడు
బీజింగ్ : చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరం ఎన్నో కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని నిజం చేసుకుంటారు. వీరి కోవలోకే వస్తాడు చైనాకు చెందిన ఓ రైతు. జూ యూ అనే వ్యక్తికి బాల్యం నుంచే సొంత కారు, బైక్ లాగానే సొంతంగా విమానం ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉండేది. ఈ క్రమంలో తన నలభయ్యో ఏట విమానాన్ని తయారు చేసే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి.. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి తన కలకు ప్రాణం పోశాడు. 124 అడుగుల పొడవు.. 118 అడుగుల వెడల్పు.. 40 అడుగుల ఎత్తుతో ఎయిర్‌బస్ ఏ320కి ప్రతీకగా రూపొందించిన ఈ విమానం వచ్చే ఏడాది మే వరకూ పూర్తి కానున్నట్లు తెలిసింది. అనంతరం ఈ విమానంలో రెస్టారెంట్ లేదా హోటల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు జూ యూ తెలిపాడు. తన కల గురించి తెలిసిన ఐదుగురు స్నేహితులు ఈ విమానం రూపకల్పనలో తనకి తోడుగా నిలిచారని తెలిపాడు జూ యూ. -
విమానం రెక్క మీద షూటింగ్.. రాపర్ మృతి
ఒట్టావా : ఓ వీడియో షూట్లో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న విమానం రెక్క మీద చిత్రీకరణ జరుపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ కెనడా రాపర్ జాన్ జేమ్స్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిటీష్ కొలంబియా వెర్నాన్లో జరిగిన ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చోసుకుంది. ఈ విషయం గురించి జాన్ మేనెజర్ ‘ఈ వీడియో షూట్ కోసం జాన్ జేమ్స్ ముందుగానే శిక్షణ తీసుకున్నాడు. అన్ని విధాలుగా తయారయ్యాకే విమానం రెక్కపైకి వచ్చాడు. కానీ విమానం రెక్క కిందకు వంగి ఉండటం వల్ల పట్టు తప్పాడు. ప్రమాదాన్ని గ్రహించిన జాన్ పారాచూట్ ఒపెన్ చేసే లోపే కింద పడి మరణించాడ’ని తెలిపారు. ఇలాంటి స్టంట్లు చేయడం జాన్‌కి చాలా ఇష్టమని వెల్లడించాడు. -
‘ట్రంప్ చెప్పాడు.. ఏం కాదని’
వాషింగ్టన్ : ఎన్ని చట్టాలు, ఉద్యమాలు వచ్చినా ఆడవాళ్ల పట్ల జరిగే వేధింపులకు, అత్యచారాలకు అంతమంటూ ఉండదనిపిస్తోంది. ఓ వైపు మహిళా లోకమంతా తమ పట్ల జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మరోపక్క మృగాళ్లు కూడా అదే రీతిలో రెచ్చిపోతున్నారు. ఇన్ని దరిద్రాల మధ్య ఇలాంటి పనులు చేసిన నీచులను మన నాయకులు వెనకేసుకురావడం మరీ దరిద్రం. ఇది ఒక్క మన దేశంలో పరిస్థితి మాత్రమే కాదు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఇదే దుస్థితి. మహిళను వేధించడమే తప్పంటే.. మహిళల వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని మా అధ్యక్షుడే చెప్పాడంటూ వితండవాదం ప్రారంభించాడు ఓ ప్రబుద్ధుడు. వివరాలు బ్రూస్ మైఖేల్ అలెగ్జాండర్(49) అనే ప్రయాణికుడు విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు మైఖేల్‌ను అరెస్ట్ చేశారు. అయితే మైఖేల్ తన తప్పును ఒప్పుకోకపోవడమే కాకా.. ‘ఆడవారి వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు’ అంటూ పోలీసులతో వాదించడం ప్రారంభించాడు. అయితే కోర్టు, పోలీసులు మైఖేల్ వాదనను పట్టించుకోలేదు. అతను చేసిన తప్పుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 2, 50, 000 అమెరికన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో 1,83,93,200) జరిమాన కూడా విధించింది. -
ఆగస్టు 15 నుంచి కోల్‌కతాకి మరో విమానం
గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో కోల్‌కతాకు మరో విమాన సర్వీసు వాలబోతోంది. ఇండిగో విమాన సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి సర్వీసులకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విమాన సంస్థ్ధ విశాఖ నుంచి భువనేశ్వర్ మీదుగా కోల్‌కతాకు సర్వీసులు అందిస్తోంది. కొత్త సర్వీసు షెడ్యూలు ఇదీ... కోల్‌కతాలో ఉదయం 10.30కు బయలుదేరి విశాఖకు మధ్యాహ్నం 12.25కు చేరుతుంది. ఇక్కడ 12.55కు బయలుదేరి మధ్యాహ్నం 3గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.