
ప్రమాదంలో మరణించిన కెనడా రాపర్ జాన్ జేమ్స్ (ఫైట్ ఫోటో)
ఒట్టావా : ఓ వీడియో షూట్‌లో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న విమానం రెక్క మీద చిత్రీకరణ జరుపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ కెనడా రాపర్ జాన్ జేమ్స్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిటీష్ కొలంబియా వెర్నాన్‌లో జరిగిన ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటు చోసుకుంది.
ఈ విషయం గురించి జాన్ మేనెజర్ ‘ఈ వీడియో షూట్ కోసం జాన్ జేమ్స్ ముందుగానే శిక్షణ తీసుకున్నాడు. అన్ని విధాలుగా తయారయ్యాకే విమానం రెక్కపైకి వచ్చాడు. కానీ విమానం రెక్క కిందకు వంగి ఉండటం వల్ల పట్టు తప్పాడు. ప్రమాదాన్ని గ్రహించిన జాన్ పారాచూట్ ఒపెన్ చేసే లోపే కింద పడి మరణించాడ’ని తెలిపారు. ఇలాంటి స్టంట్లు చేయడం జాన్‌కి చాలా ఇష్టమని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment