వాల్‌మార్ట్ వాక్-ఇన్ ఓవెన్‌లో శవమై తేలిన భారతీయ సిక్కు యువతి
కెనడాలోని హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్‌లో వాల్‌మార్ట్ ఉద్యోగి, ఇండియాకు చెందిన సిక్కు యువతి శవమై తేలడం దిగ్భ్రాంతి రేపింది. మృతురాలిని ఈ బేకరీలోనే పనిచేస్తున్న 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్‌గా మారిటైమ్ సిక్కు సొసైటీ ధృవీకరించింది. కౌర్ మృతదేహాన్ని తొలుత గుర్తించిన ఆమె తల్లి అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. బతికి ఉండగానే ఓవెన్‌లో వేసి కాల్చారనే అనుమానాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హాలిఫాక్స్ వాల్‌మార్ట్ ఆమె మరణంపై విచారంపై ప్రకటించింది.
కాగా ఇండియాకు చెందిన కౌర్ , ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. కౌర్ తండ్రి, సోదరుడు భారతదేశంలోనే ఉన్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గత రెండేళ్లుగా మమ్‌ఫోర్డ్ రోడ్ వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ స్థానిక సిక్కు కమ్యూనిటీలోమంచి పేరు తెచ్చుకున్నారు. అక్టోబర్ 19, శనివారం, కౌర్ తల్లి వాల్‌మార్ట్ స్టోర్ తెరిచి ఉండగానే బేకరీ డిపార్ట్‌మెంట్‌లో కాలిపోయిన తన బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఇంత విషాదకరమైన నష్టానికి క్షమించండి అంటూ మారిటైమ్ సిక్కు సొసైటీ అధ్యక్షుడు హర్జిత్ సెయాన్ ప్రకటించారు.
మరోవైపు అంత్యక్రియల ఖర్చులకు సహాయం, కౌర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించేందుకు గోఫండ్‌బీ కేవలం 10 గంటల్లో (గురువారం మధ్యాహ్నం నాటికి దాదాపు ఒక లక్ష, 30వేల డాలర్ల ఫండ్‌ను సేకరించింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. కౌర్ మరణం ఎలా సంభవించిందని అనేదానిపై ఇంకా ఎలాంటి క్లూ లభించలేదని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ చెప్పారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment