Oven
-
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
కెనడా డ్రీమ్స్ : వాక్-ఇన్ ఓవెన్లో శవమై తేలిన వాల్‌మార్ట్ ఉద్యోగి
కెనడాలోని హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్లో వాల్‌మార్ట్ ఉద్యోగి, ఇండియాకు చెందిన సిక్కు యువతి శవమై తేలడం దిగ్భ్రాంతి రేపింది. మృతురాలిని ఈ బేకరీలోనే పనిచేస్తున్న 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్‌గా మారిటైమ్ సిక్కు సొసైటీ ధృవీకరించింది. కౌర్ మృతదేహాన్ని తొలుత గుర్తించిన ఆమె తల్లి అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. బతికి ఉండగానే ఓవెన్లో వేసి కాల్చారనే అనుమానాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హాలిఫాక్స్ వాల్‌మార్ట్ ఆమె మరణంపై విచారంపై ప్రకటించింది. కాగా ఇండియాకు చెందిన కౌర్ , ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. కౌర్ తండ్రి, సోదరుడు భారతదేశంలోనే ఉన్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గత రెండేళ్లుగా మమ్‌ఫోర్డ్ రోడ్ వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ స్థానిక సిక్కు కమ్యూనిటీలోమంచి పేరు తెచ్చుకున్నారు. అక్టోబర్ 19, శనివారం, కౌర్ తల్లి వాల్‌మార్ట్ స్టోర్ తెరిచి ఉండగానే బేకరీ డిపార్ట్మెంట్లో కాలిపోయిన తన బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఇంత విషాదకరమైన నష్టానికి క్షమించండి అంటూ మారిటైమ్ సిక్కు సొసైటీ అధ్యక్షుడు హర్జిత్ సెయాన్ ప్రకటించారు. మరోవైపు అంత్యక్రియల ఖర్చులకు సహాయం, కౌర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించేందుకు గోఫండ్‌బీ కేవలం 10 గంటల్లో (గురువారం మధ్యాహ్నం నాటికి దాదాపు ఒక లక్ష, 30వేల డాలర్ల ఫండ్‌ను సేకరించింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. కౌర్ మరణం ఎలా సంభవించిందని అనేదానిపై ఇంకా ఎలాంటి క్లూ లభించలేదని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ చెప్పారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. -
ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి..
ఎంత రుచికరమైనఫుడ్ అయినా వేడిగా లేకపోతే తినాలనిపించదు. పిజాలూ, బర్గర్లూ వంటివి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. బయటికి వెళ్లి అలా తిందామంటే అన్ని సార్లూ కుదరదు. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటారు. కానీ రోడ్లపై ట్రాఫిక్ వల్ల ఆర్డర్ వచ్చేవరకు అదికాస్త చల్లబడిపోతుంది. ఈ సమస్యకు డోమినోస్ సంస్థ పరిష్కారం ఆలోచించింది. ఏకంగా ఓవెన్‌ను ఏర్పాటు చేసిన సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో వినియోగదారుడి వద్దకు వచ్చాక ఆర్డర్ చేసిన పిజ్జాలు, బర్గర్లను వేడిచేసి డెలివరీ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీతో నడిచే ఈ-సైకిళ్ల వల్ల పర్యావరణానికి హానికలగదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో భారత్‌లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. -
యాదాద్రిని సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్‌కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు. అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ధర?
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ఇలా ప్రతి దానిలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ గ్రిల్. దీని పేరు గ్లాస్ ఓవెన్ కుకర్. సురక్షితమైనది. సౌకర్యవంతమైనది. 60–250 డిగ్రీల సెల్సియస్ మధ్య టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. గ్లాస్ మెటీరియల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో.. సాధారణ మెషిన్స్ కంటే 25% వేగంగా వంట పూర్తి అవుతుంది. డివైజ్ మూతకు.. పైభాగంలో రెగ్యులేటర్స్, ఆప్షన్స్‌తో పాటు.. లోపలి భాగంలో మోటర్ అటాచ్ అయ్యి ఉంటుంది. దీనిలో చిప్స్, రింగ్స్, హోల్ చికెన్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. ఈ మేకర్ని గ్రిలర్లా, బేకర్లా, రోస్టర్లా వినియోగించుకోవచ్చు. ఇందులో తయారైన ఆహారానికి ఎలాంటి నూనె, పిండి వాసనలు రావు. పైగా దీనిలో సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆప్షన్ ఉండటంతో పాత్రలను వేరు చేసి.. క్లీన్ చెయ్యాల్సిన శ్రమా ఉండదు. -ధర : 49 డాలర్లు (రూ.3,895) చదవండి: Decoration Ideas: వినాయకుడి ప్రతిమను పెట్టే చోట ఇలా అలంకరిస్తే.. Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే! -
Solar Oven: వెజ్‌తో పాటు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా.. ధర రూ.48,738
ఈ రోజుల్లో సోలార్ మెషిన్స్‌కి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత ఇంధనం ఖర్చు ఉండదనేది వీటి ప్లస్ పాయింట్. టెక్నాలజీ పెరిగిన తరుణంలో.. సోలార్ కుక్ వేర్ మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఇందులో కూరగాయ ముక్కలతో పాటు చికెన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ ఐటమ్స్.. బ్రెడ్స్, కేక్స్ వంటివెన్నో గ్రిల్ చేసుకో వచ్చు, కుక్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ ఓవెన్ పెద్ద సైజ్ పెట్టెలా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ మూతతో పాటు.. మూడువైపులా (చిత్రంలో గమనించొచ్చు) సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను స్టోర్ చేసే సామర్థ్యం కోసం.. టెంపర్డ్ డబుల్ ప్యాన్డ్ గ్లాస్ మెటీరియల్ అమర్చి ఉంటుంది. థర్మల్ హీట్ రెసిస్టెంట్ లేయర్లు, అధిక నాణ్యత కలిగిన యానోడైజ్డ్ అల్యూమినియం రిఫ్లెక్టర్స్తో ఇందులోని ఆహారం వేగంగా ఉడుకుతుంది. మొత్తానికి ఈ సోలార్ ఓవెన్.. నాణ్యత కలిగినది, అనుకూలమైనది, ఉపయోగించడానికి సులభమైనది. సోలార్ ఓవెన్ ధర: 639 డాలర్లు (రూ.48,738) చదవండి👉🏾 హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు! -
పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్.. పక్కనే కెటిల్.. ధర రూ.5,212!
ఈ రోజుల్లో సమయాన్ని ఆదా చేసే గాడ్జెట్స్‌కి మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. సమయంతో పాటు స్థలం కూడా ఆదా అయితే మరీ మంచిదంటున్నారు వినియోగదారులు. అలాంటి వారికోసమే ఈ డివైజ్. ఇందులో చక్కగా మూడు వెరైటీలను ఒకేసారి తయారుచేసుకోవచ్చు. 8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవెన్‌తో పాటు పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌ను, పక్కనే కెటిల్‌ను ఒకే సమయంలో వినియోగించుకోవచ్చు. ఓవెన్లో పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్.. గ్రిల్ ఐటమ్స్.. ఇలా ఎన్నో తయారు చేసుకోవడంతో పాటు పైన ఉన్న పాన్‌లో ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివి రెడీ చేసుకోవచ్చు. ఇక కుడివైపు టీ లేదా కాఫీ లేదా వేడినీళ్ల కోసం కెటిల్ డివైజ్ కనెక్టర్ ఉంటుంది. దాన్ని అవసరం లేకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. దాంతో స్థలం కలిసి వస్తుంది. కుడివైపు కెటిల్ డివైజ్‌కి ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు అదే హ్యాండిల్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడానికి డివైజ్ ముందువైపు టైమింగ్, టెంపరేచర్‌కి సంబంధించిన 2 రెగ్యులేటర్స్, ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. ధర- 68 డాలర్లు(రూ.5,212) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
ఆడపిల్ల పుట్టిందని... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి...
న్యూఢిల్లీ: కడుపులో ఉన్నది ఆడిపిల్ల అన్న అనుమానంతోనూ లేక స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతోనే చంపేసేవాళ్లు కొందరూ. మరికొందరు పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వదిలి వెళ్లిపోయేవారు మరికొందరూ. ఏది ఏమైన ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఘటనలకు అంతే లేదు అన్నట్లుగా జరుగుతున్నాయి. అచ్చం అలానే ఢిల్లీలో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో నివాసం ఉంటున్న గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌లకు జనవరి నెలలో అనన్య అనే పాప పుట్టింది. ఏమైందో మరి ఏం కష్టం వచ్చిందో ఆ తల్లిక తెలియదు గానీ రెండు నెలల పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆమె తన కొడుకుతో కలసి గదిలోకి వెళ్లి తలుపుకి తాళం వేసుకుని ఉండిపోయింది. కాసేపటికి అనుమానంతో ఆమె అత్తగారు తలుపుతట్టగా తలుపు తీయకపోడంతో ఇరుగు పోరుగు అంతా వచ్చి తలుపు పగలుగొట్టి చూడగానే తల్లి కొడుకులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే వారి వద్ద పాప కనిపించలేదు. వారంతా చుట్టూ గాలించిన ఎంతకీ పాప కనిపించలేదు. కాసేపటికి ఏదో అనుమానంతో మైక్రోవేవ్ ఓవెన్ తెరిచి చూడగా పాప మృతి చెంది ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి వచ్చి విచారించడం మొదలు పెట్టారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో పాప తల్లే ప్రధాన నిందుతురాలని తేలిందని పోలీసులు తెలిపారు. అంతే కాదు ఆ పాప తల్లి ఆడపిల్ల పుట్టడంతో తీవ్రంగా కలత చెందిందని, పైగా ఈ విషయమై భర్తతో పోరాడిందని సంబంధికులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెనిటా మేరీ జైకర్ తెలిపారు. (చదవండి: టీఎంసీలో కుమ్ములాట? కీలక నేత హత్య.. ఆపై ఏడుగురు మృతిపై అనుమానాలు!) -
గాడ్జెట్ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...!
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్‌స్క్రీన్ తో ఆయిల్‌లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. -
భలే హోటల్
చింతామణి: కొలిమిపొయ్యి, బొగ్గుల పొయ్యి, కట్టెలపొయ్యి, పొట్టు పొయ్యి... ఇలాంటివి వినడమే తప్ప నేటి తరం చూడడం లేదు. కరెంటు, గ్యాస్, ఇండక్షన్ స్టౌలు వచ్చాక వీటికి కాలం చెల్లిపోయింది. కట్టెలపొయ్యి మీద చేసిన వంట రుచి అద్భుతం, అలాంటి రుచి గ్యాస్ పొయ్యి వంటకు రాదు.. అని పెద్దలు, పల్లెవాసులు చెబుతుంటారు. విషయమేమిటంటే... కొలిమి పొయ్యి మీద కాఫీ, టీ తాగాలనే కోరిక ఉన్నవారికి ఇది శుభవార్త. చింతామణి సమీపంలో ఇలాంటి సౌలభ్యం అందుబాటులో ఉంది. మాజీ డ్రైవర్ ఒకాయన రోడ్డు పక్కన టెంటు వేసుకొని కొలిమి పెట్టి బొగ్గులతో కాఫీ, టీ, టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. తాలుకాలోని శింగనపల్లి క్రాస్ దగ్గర ఈ టెంట్ ఉంది. రుచి, ఆరోగ్యమని మంచి స్పందన శింగనపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. చాలా ఏళ్ల పాటు వ్యాన్, లారీ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే కొన్ని నెలల నుండి డ్రైవర్ డ్యూటీలు దొరక్క, జీవనోపాధి కోస రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌ను పెట్టారు. రాఘవేంద్ర వినూత్నంగా ఆలోచించి బొగ్గులతో కొలిమి పెట్టి కాఫీ, టీలతో పాటు ఇడ్లీ, దోసె తదితర టిఫిన్లు తయారు చేస్తారు. ఇలాంటి వంట రుచిగాను, ఆరోగ్యంగానూ ఉంటుందని ఎంతోమంది ఈ హోటల్‌ను సందర్శిస్తుంటారు. రాఘవేంద్రకు తోడుగా భార్య విజయలక్ష్మీ ఉంటారు. హోటల్ వ్యాపారం బాగా జరుగుతోందని వారు సంతోషం వ్యక్తంచేశారు. -
వంటింటికి మల్టీపర్పస్ సోకు..!
♦ పెరుగుతున్న కిచెన్ అప్లయన్సెస్ వాడకం ♦ పలు పనులు చేసేలా మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులు ♦ రూ.13,000 కోట్లకు చేరిన మార్కెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జ్యూసర్, కాఫీ మేకర్, ఓవెన్, సాండ్విచ్ మేకర్, టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్స్... ఇలా చెప్పుకుంటూ పోతే వంటగదిలో ఉండే ఉపకరణాలు... అవేనండీ కిచెన్ అప్లయన్సెస్ లిస్టు బోలెడంత ఉంటుంది. చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోవటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, భిన్నమైన ఆహారపు అలవాట్లు.. వెరశి వంటింట్లో ఇప్పుడీ ఉపకరణాల జాబితా పెరుగుతూనే వస్తోంది. దీంతో విభిన్న అవసరాలకు తగ్గట్టుగా వినూత్న, అత్యాధునిక పరికరాలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టేస్తున్నాయి. సమయం వెంట పరుగులు తీస్తున్న నేటి తరం... వంట వేగంగా చేసేందుకు వీలుగా కిచెన్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. రూ.13,000 కోట్ల భారత వ్యవస్థీకృత రంగ కిచెన్ అప్లయన్సెస్ విపణిలో విదేశీ కంపెనీలకు దీటుగా దేశీ బ్రాండ్లు చొచ్చుకు పోతున్నాయి. నెల వాయిదాల్లో వస్తువుల్ని ఆఫర్ చేస్తూ కస్టమర్లకు చేరువవుతున్నాయి. విభిన్న పనులను చేసేలా... ఎగువ మధ్య తరగతి, సంపన్న కుటుంబాలైతే వంటింట్లో అన్ని ఉపకరణాలు ఉండాల్సిందేనని అంటున్నారు. వంట చేసే సమయంలో బంధువులు, స్నేహితులు వంటింట్లోకి కూడా వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు.. కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే రీతిలో కలర్‌ఫుల్ అప్లయన్సెస్‌తో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటితో స్టేటస్ చూపించుకునేవారు కొందరైతే అవసరానికి ఉపకరణాలను కొనేవారూ ఉన్నారు. ఇక వంటింటి స్థలం పరిమితంగా ఉన్న కుటుంబాలైతే విభిన్న పనులను చేసే మల్టీ టాస్క్ ఉపకరణాలు కావాలంటున్నారని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ సీఈవో రూపేంద్ర యాదవ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కొత్త ఇల్లు కొనుక్కున్నా, వివాహ సమయంలోనైనా నూతన ఉపకరణాలను కొంటున్నారని తెలియజేశారు. ‘‘ఇవి ఔరా అనిపించే ఫీచర్లతో వస్తున్నాయి. అయితే తయారీ కంపెనీలు వీటిపట్ల మరింత అవగాహన కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయి’’ అని టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇదీ మార్కెట్ తీరు..: అంతర్జాతీయంగా బ్లెండర్ల వాడకం ఎక్కువ. ఇండియాలోనైతే మిక్సర్ గ్రైండర్ల వాడకం అధికం. వీటి వ్యాపార పరిమాణం దేశంలో రూ.2,600 కోట్లు. కాకపోతే దేశంలో 25-30% ప్రాంతంలోనే వీటిని వినియోగిస్తున్నారు. దక్షిణాదిలో ఇది 40% కాగా, తమిళనాట ఏకంగా 70%. దక్షిణాదికే పరిమితమైన వెట్ గ్రైండర్ల విపణి పరిమాణం రూ.500 కోట్లు. ఎలక్ట్రిక్ కుకర్ల రంగం విలువ రూ.1,000 కోట్లు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 40%. వ్యవస్థీకృత రంగంలో కిచెన్ అప్లయెన్సెస్ విపణి 3-4% వృద్ధి రేటుతో రూ.13,000 కోట్లుందని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ అంటోంది. వినూత్న ప్రొడక్టును రూపొం దించినా దీర్ఘకాలిక ప్రక్రియ కావడంతో పేటెంట్ల దరఖాస్తుకు కంపెనీలు దూరంగా ఉంటున్నాయి. ఉపకరణాల ధర ఏటా 4-5% పెరుగుతోంది. కొన్ని పరికరాల ఉదాహరణలుఇవిగో... ప్రీతి జోడియాక్ మిక్సర్ గైండర్ పండ్ల రసం తీయడం, గోధుమ పిండిని ముద్దగా చేయడం, కూరగాయలను తురమడం, ముక్కలుగా చేయడం వంటి పనులను చక్కబెడుతుంది. ధర రూ.8,960. ప్రీతి కిచెన్ చాంప్ 17 రకాల పనులను ఇట్టే చేస్తుంది. పిండి కలపడం, కూరగాయలు ముక్కలు చేయడం, తురమడం, కలపడం, ఆర బెట్టడం, పిండి రుబ్బడం, పొడి చేయడం వీటిలో కొన్ని. ఏడాది వారంటీతోపాటు లైఫ్ లాంగ్ ఉచిత సర్వీసును కంపెనీ ఆఫర్ చేస్తోంది. ధర రూ.4,199. ఉషా ఇన్ఫినిటీ కుక్ హాలోజెన్ ఓవెన్ ఇది. ఇతర ఓవెన్లతో పోలిస్తే చాలా భిన్నమైంది. నీళ్ల అవసరం లేకుండా కోడి గుడ్లను ఉడికిస్తుంది. బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, ఎయిర్ ఫ్రైస్, ఎయిర్ డ్రయింగ్, టోస్టింగ్ వంటి పనులనూ చేస్తుంది. ఆయిల్ ఫ్రీ కుకింగ్ దీని ప్రత్యేకత. బ్రెడ్ ర్యాక్, చికెన్ రోస్టర్, ఫ్రయింగ్ ప్యాన్ తదితర 9 యాక్సెసరీన్ పొందుపరిచారు. ధర రూ.11,990. ఉషా న్యూట్రిప్రెస్ ఖరైదైన జ్యూసర్లలో ఇది ఒకటి. ధర రూ.27,990. కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, పండ్ల నుంచి రసం తీస్తుంది. ఇతర జ్యూసర్లతో పోలిస్తే అధిక మొత్తంలో రసం అందిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ వ్యవస్థ ఉండడంతో జ్యూస్ తీసే క్రమంలో పోషకాలు, ఎంజైములు, విటమిన్లు కోల్పోవని కంపెనీ తెలిపింది. బజాజ్ మాస్టర్ షెఫ్ 3.0 ఫుడ్ ప్రాసెసర్ దీనితో 15 రకాల అటాచ్మెంట్స్ ఉన్నాయి. పచ్చడి చేయడం, ముక్కలు తరగడం, కొబ్బరి తురమడం, పిండి కలపడం, జ్యూస్, రుబ్బడం, ఫ్రెంచ్ ఫ్రైస్, తురమడం వంటివి చిటికెలో చేసిపెడుతుంది. ధర రూ.5,984. -
ఓవెన్ కొంటున్నారా..
సాక్షి, హైదరాబాద్: కేవలం ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసుకునేందుకు ఓవెన్‌ను కొంటున్నారా...! లేక కుటుంబ సభ్యులందరికీ సరిపడే పదార్థాలను రెగ్యులర్‌గా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా...? ఓవెన్ కొనేముందు కుటుంబ సభ్యులతో చర్చించాల్సిన విషయమిది. అప్పుడే ఓవెన్ సెజైంతో తెలుస్తుంది. - బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. - రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది. - మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు. - సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది. - ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది. - అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారికి టాక్టైల్ కంట్రోల్ ఓవెన్లు ఎంతో సహాయపడతాయి. - చిన్నపిల్లలున్న ఇంట్లో చైల్డ్ సేఫ్టీ లాక్, ఎలక్ట్రానిక్ లాక్ ఉన్న ఓవెన్లను తీసుకోవడం ఉత్తమం. - బజాజ్, శామ్సంగ్, కెన్‌స్టార్, ఎల్జీ వంటి రకరకాల బ్రాండెడ్ కంపెనీలు ఓవెన్లను అందిస్తున్నాయి. వీటి ధరలు రూ.5-40 వేల వరకున్నాయి.