
images credit: Newatlas
ఎంత రుచికరమైనఫుడ్ అయినా వేడిగా లేకపోతే తినాలనిపించదు. పిజాలూ, బర్గర్లూ వంటివి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. బయటికి వెళ్లి అలా తిందామంటే అన్ని సార్లూ కుదరదు. అందుకని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతుంటారు. కానీ రోడ్లపై ట్రాఫిక్ వల్ల ఆర్డర్ వచ్చేవరకు అదికాస్త చల్లబడిపోతుంది.
ఈ సమస్యకు డోమినోస్ సంస్థ పరిష్కారం ఆలోచించింది. ఏకంగా ఓవెన్‌ను ఏర్పాటు చేసిన సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దాంతో వినియోగదారుడి వద్దకు వచ్చాక ఆర్డర్ చేసిన పిజ్జాలు, బర్గర్లను వేడిచేసి డెలివరీ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.
బ్యాటరీతో నడిచే ఈ-సైకిళ్ల వల్ల పర్యావరణానికి హానికలగదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో భారత్‌లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment