Dominos Pizza
-
డోమినోస్ పిజ్జా కంపెనీ లాభం తగ్గింది..
న్యూఢిల్లీ: ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 67 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 97 కోట్లకుపైగా ఆర్జించింది.డోమినోస్ పిజ్జా, డంకిన్ స్టోర్ల కంపెనీ మొత్తం అమ్మకాలు మాత్రం రూ. 1,955 కోట్లకు ఎగశాయి. గత క్యూ2లో రూ. 1,369 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,290 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగాయి. అయితే ఫలితాలు పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. సొంత అనుబంధ సంస్థ జూబిలెంట్ ఫుడ్ నెదర్లాండ్స్ బీవీ.. 2024 మార్చికల్లా డీపీ యూరేషియా ఎన్వీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఈ కాలంలో 139 స్టోర్లను కొత్తగా జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,467 కోట్లను తాకింది. అంతర్జాతీయ అమ్మకాలు దాదాపు రూ. 461 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 602 వద్ద ముగిసింది. -
ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి..
ఎంత రుచికరమైనఫుడ్ అయినా వేడిగా లేకపోతే తినాలనిపించదు. పిజాలూ, బర్గర్లూ వంటివి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. బయటికి వెళ్లి అలా తిందామంటే అన్ని సార్లూ కుదరదు. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటారు. కానీ రోడ్లపై ట్రాఫిక్ వల్ల ఆర్డర్ వచ్చేవరకు అదికాస్త చల్లబడిపోతుంది. ఈ సమస్యకు డోమినోస్ సంస్థ పరిష్కారం ఆలోచించింది. ఏకంగా ఓవెన్‌ను ఏర్పాటు చేసిన సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో వినియోగదారుడి వద్దకు వచ్చాక ఆర్డర్ చేసిన పిజ్జాలు, బర్గర్లను వేడిచేసి డెలివరీ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీతో నడిచే ఈ-సైకిళ్ల వల్ల పర్యావరణానికి హానికలగదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో భారత్‌లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. -
పిజ్జా ప్రియులకు శుభవార్త.. సగానికి తగ్గిన ధరలు - కారణం ఇదే!
ఆధునిక కాలంలో పిజ్జాలకు ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ (Domino’s) విపరీతమైన ధరలకు విక్రయిస్తోంది. కాగా తాజాగా కంపెనీ ధరలను దాదాపు 50 శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి భారతదేశంలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) మాత్రమే కాకుండా టాసిన్, గోపిజ్జా, లియోస్ పిజ్జేరియా, మోజోపిజ్జా, ఓవెన్‌స్టోరీ, లా పినోజ్ వంటి సంస్థలు పుట్టుకురావడం, తక్కువ ధరలకే పిజ్జాలను అందించడంతో క్రమంగా డొమినోస్ ఆదరణ తగ్గుముఖం పట్టింది. కానీ పోటీ ప్రపంచంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి డొమినోస్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ధరలను తగ్గించడం జరిగింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి డొమినోస్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే వెజిటేరియన్ లార్జ్ పిజ్జా ధరలను రూ. 799 నుంచి రూ. 499కి తగ్గించింది. అదే సమయంలో లార్జ్ నాన్‌వెజ్ పిజ్జా ధరలను రూ. 919 నుంచి రూ. 549కి దగ్గించింది. ఇదీ చదవండి: మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్! తక్కువ చెల్లించి ఎక్కువ పిజ్జా పొందండి అంటూ కంపెనీ పిజ్జా ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశంలో 1800కి పైగా డొమినోస్ పిజ్జా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిని డొమినోస్ మాతృ సంస్థ 'జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్' నిర్వహిస్తోంది. ఈ కంపెనీ డొమినోస్ కంపెనీతో పాటు డంకిన్ రెస్టారెంట్లను, పాప్ఐస్ ఔట్ లెట్లను నిర్వహిస్తోంది. భారతదేశంలో కేవలం డొమినోస్ మాత్రమే కాకుండా, పిజ్జా హట్, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ధరలను తగ్గించనున్నాయి. కాగా దేశీయ మార్కెట్లో పిజ్జా చైన్స్ కూడా ఎక్కువ కావడంతో కస్టమర్లు తక్కువ ధరకు పిజ్జా అందించే సంస్థల నుంచే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి చిన్న సంస్థల దెబ్బకు డొమినోస్ దిగి వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్‌టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?
డామినోస్ మాజీ సీఈవో రిచ్ అల్లిసన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 2022లో ఆయన కంపెనీని విడిచిపెట్టినప్పుడు ఈ పదవి తనకు జీవితకాల ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు. తాజాగా గత సంవత్సరం డామినోస్ మాజీ సీఈవో ఖర్చులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యక్తిగత పిజ్జా ఖర్చు కోసం దాదాపు 4,000 డాలర్లు (రూ.3లక్షలకు పైగా) చెల్లించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం... డామినోస్ ఎగ్జిక్యూటివ్ పరిహారం కింద 2021 సంవత్సరంలో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసమే అల్లిసన్‌కు కంపెనీ 3,919 డాలర్లు చెల్లించింది. దీంతోపాటు వ్యక్తిగత జెట్, బృంద సభ్యుల బహుమతులు, ఇతర ఖర్చులకు ఆ సంవత్సరానికి అల్లిసన్ మొత్తంగా 7,138,002 డాలర్లు (దాదాపు రూ.59 కోట్లు) అందుకున్నారు. 2020లో మరీ ఎక్కువ.. 2021లో అల్లీసన్ పిజ్జాల ఖర్చు అంతకుముందు సంవత్సరం అంటే 2020తో పోల్చుకుంటే తక్కువే. 2021లో 3,919 డాలర్లు ఖర్చు చేస్తే అదే 2020 కరోనా మహమ్మారి సమయంలో ఆయన పిజ్జా ఖర్చు 6,126 డాలర్లు అంటే రూ.5 లక్షలకు పైనే. డామినోస్ ప్రస్తుత సీఈవో రస్సెల్ వీనర్ కూడా 2021లో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసం 2,810 డాలర్లు ఖర్చు చేశారు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? అల్లిసన్ డామినోస్ కోసం పదేళ్లకుపైగా పనిచేశారు. ఇందులో నాలుగేళ్లు కంపెనీ సీఈవోగా వ్యవహరించారు. 2022లో ఆయన పదవీ విరమణ పొందారు. అల్లిసన్ సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీని పురోగతి వైపు నడిపించడమే కాకుండా రిస్క్ తీసుకునే వాతావరణాన్ని ప్రోత్సహించారు. -
డోమినోస్‌కు లాభాల పంట, క్యూ2లో రూ. 131 కోట్ల ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ పటిష్ట ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 131 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 120 కోట్లు ఆర్జించింది. డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ కంపెనీ ఆదాయం 17 శాతం ఎగసి రూ. 1,301 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 20 శాతం పెరిగి రూ. 1,154 కోట్లకు చేరాయి. ఈ కాలంలో 76 డోమినోస్ స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. -
కస్టమర్‌కు చేదు అనుభవం.. పిజ్జాలో గాజు ముక్కలు రావడంతో..
ప్రస్తుత జనరేషన్ దాదాపు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి తినేందుకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక, పిజ్జా, బర్గర్ వంటివి స్పెషల్‌గా ఆర్డర్ ఇస్తుంటారు. తాజాగా డోమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పిజ్జాలో ఏకంగా గాజు ముక్కలు ఉండటంతో కస్టమర్ షాకయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కస్టమర్ డోమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ పెట్టాడు. దీంతో, జొమాటో నుంచి సదరు కస్టర్ పిజ్జాను అందుకున్నాడు. అనంతరం, ఎంతో ఇష్టంగా పిజ్జా తినడానికి రెడీ అయిపోయాడు. కవర్ ఓపెన్ చేసి పిజ్జా తింటున్న క్రమంలో మొదట ఒక గాజు ముక్క తగిలింది. ఒక్కటే కదా మిస్టేక్ అనుకొని లైట్ తీసుకున్నాడు. ఇంతలో మరో రెండు గాజు ముక్కలు తగలడంతో చిర్రెత్తుకుపోయాడు. కోపంతో వెంటనే ఫోన్ తీసి పిజ్జాలో వచ్చిన గాజుముక్కలను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం, తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు. ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. ముందుగా కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. ఒకవేళ వారు స్పందించకపోతే అప్పుడు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వండి అంటూ సలహా ఇచ్చారు. ఇక, ఈ ఘటనపై డొమినోస్ సంస్థ స్పందించింది. డొమినోస్ తరఫున కస్టమర్‌కు క్షమాపణలు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఫుడ్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కాగా, తమ తనిఖీల్లో రెస్టారెంట్లో ఎలాంటి గాజు సామాగ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు. 2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk — AK (@kolluri_arun) October 8, 2022 -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
ఛీ.. యాక్! ఈ ఫొటో చూశారంటే పిజ్జా తినలేరు.. వైరల్ ఫొటో
ఇటీవల కాలంలో బయట తినడం ప్రజలకు అలవాటుగా మారింది. రుచితో పాటు కాస్త శుచిగా ఉంటే చాలు ఆ పుడ్‌ని తెగ లాగించేస్తుంటారు భోజన ప్రియులు. ఈ తరహా నిబంధనలు పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న జాబితాలో డోమినాస్ పిజ్జా, కేఎఫ్‌సీ వంటి విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఎంత ఫేమ్ ఉన్న కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థకున్న మంచి పేరు, గుర్తింపు కూడా ఒక్క సెకనులో పొగుట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక ఫోటో వల్ల ఓ ప్రముఖ సంస్థ పేరు నెట్టింట నెగిటివ్‌గా మారింది. ఆ ఫోటోలో ఏముంది.. పిజ్జా అంటే గుర్తుకు వచ్చే పేరు డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని కస్టమర్లు అక్కడికి ఎగబడుతుంటారు. అయితే బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్‌లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా మీ క్వాలిటీ పుడ్ అని డొమినోస్ సంస్థ పై మండిపడుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ఈ ఘటనపై స్పందిస్తూ.. డొమినోస్ ఎప్పుడూ పుడ్ విషయంలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ రెస్టారెంట్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Photos from a Domino's outlet in Bengaluru wherein cleaning mops were hanging above trays of pizza dough. A toilet brush, mops and clothes could be seen hanging on the wall and under them were placed the dough trays. Please prefer home made food 🙏 pic.twitter.com/Wl8IYzjULk — Tushar ॐ♫₹ (@Tushar_KN) August 14, 2022 చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్
కాశ్మీర్‌లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ పాకిస్తాన్‌లోని తమ వ్యాపార డీలర్లు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల వల్ల భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాము భారత దేశానికి క్షమాపణలు తెలియజేస్తున్నాము అని డొమినోస్, ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా పేర్కొన్నాయి. ఒక సోషల్ మీడియా పోస్టులో.. "మేము ఈ దేశంలో 25 సంవత్సరాలకు ఉన్నాము. ఈ దేశ ప్రజలు, సంస్కృతి, జాతీయతా స్ఫూర్తిపట్ల మాకు అత్యంత గౌరవం ఉంది. ఈ దేశ ఔన్నత్యాన్ని మేము గౌరవిస్తున్నాము. దేశం వెలుపల నుంచి డొమినోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచురితమైన అవాంఛనీయ సోషల్ మీడియా పోస్టులకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఒక బ్రాండ్‌గా మేము భారతదేశాన్ని గౌరవిస్తాము, ఈ దేశ వినియోగదారులకు & సమాజానికి వినయ, విధేయతలతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము" అని డొమినోస్ కంపెనీ తెలిపింది. This is the country we have called our home for the last 25 years, and we stand here to protect its legacy forever. We respect and honour everything the country has to offer. pic.twitter.com/8II6XuLxb0 — dominos_india (@dominos_india) February 8, 2022 అదేవిధంగా, హోండా కార్ ఇండియా ట్విటర్ హ్యాండిల్స్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో "హోండా పనిచేసే ప్రతి దేశంలో అక్కడి చట్టాల, నిబందనలను అనుసరిస్తాము. ఆ దేశ ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటాము. ఈ విషయంలో దేశ ప్రజలకు ఏదైనా బాధ కలిగితే మేము చింతిస్తున్నాము. తమ కంపెనీ విధానంలో భాగంగా, హోండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, జాతి, రాజకీయాలు, మతం & సామాజిక సమస్యలపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదు" అని తెలిపింది. ఈ కంపెనీలతో పాటు ఇతర ప్రపంచ స్థాయి సంస్థలు హ్యుందాయ్, సుజుకి, టయోటా, కెఎఫ్సి, పిజ్జా హట్ వంటివి కూడా దేశానికి క్షమాపణలు చెప్పాయి. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీలన్ని కాశ్మీర్‌లోని ఏర్పాటువాదులకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆ కంపెనీ ఉత్పత్తులను అన్నీ మన దేశంలో నిషేదించాలని ప్రజలు కేంద్రాన్ని కోరారు. (చదవండి: ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) -
డొమినోస్ పిజ్జా కొత్త నిర్ణయం... పొల్యూషన్ ఫ్రీ డెలివరీ !
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాచానుకి జీవితాంతం ఫ్రీ ఆఫర్ ప్రకటించి దేశ ప్రజల మన్ననలు అందుకున్న డోమినోస్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. వాతవారణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు బైకులు, స్కూటర్ల స్థానంలో ఇక నుంచి కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని డొమినోస్ నిర్ణయించింది. అక్కడ సానుకూల ఫలితాల వస్తే క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలో పని చేస్తున్న డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉన్న పెట్రోలు బైకుల స్థానంలో ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగించేలా మార్పులు తేనుంది. రివోల్ట్ 300 కాలుష్య నియంత్రణలో భాగంగా రివోల్ట్ 300 మోడల్ ఎలక్ట్రిక్ బైకులను డొమినోస్ పిజ్జా ఉపయోగించనుంది. ఈ మేరకు రివోల్ట్‌తో సంప్రదింపులు చేపడుతోంది. డెలివరీకి అనుగుణంగా ఈ బైకులను కష్టమైజ్ చేయనున్నారు. ఈ బైకులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 150 కి,.మీ రేంజ్ మైలేజీ ఇవ్వగలవు. గరిష్ట వేగం గంటలకు 65 కిలోమీటర్లు. వేలల్లో డెలివరీ పర్సన్స్ డొమినోస్ పిజ్జాకి దేశ వ్యాప్తంగా వేలాది అవుట్లెట్లు ఉన్నారు. వేలాది మంది డెలివరీ బాయ్స్ నిత్యం నగరాల్లో బైకులపై తిరుగుతూ పిజ్జాలను డెలివరీ చేస్తున్నారు. వేలల్లో ఉన్న ఈ డెలివరీ పర్సన్స్ నిత్యం పెట్రోలు బైకులపై తిరుగుతూ తమ విధులు నిర్వహ్తిన్నారు. -
డొమినోస్ పిజ్జాతో రివోల్ట్ మోటార్స్ ఒప్పందం
డొమినోస్ పిజ్జా తన ప్రస్తుత పెట్రోల్ బైక్ ఫ్లీట్ ను ఈ-బైక్ లుగా మార్చడానికి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు రివోల్ట్ మోటార్స్ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, డొమినోస్ రివోల్ట్ ఆర్ వీ 300 బైక్ మోడల్ ను ఫుడ్ డెలివరీ చేయడం కోసం మారుస్తున్నట్లు తెలిపింది. డొమినోస్ పైలట్ ప్రాజెక్టు కింద రివోల్ట్ బైక్లును గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీల కోసం వాడుతున్నారు. రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ బిజినెస్ ఛైర్మన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. "ఈ భాగస్వామ్యంలో భాగంగా డొమినోస్ సంస్థతో చేతులు కలపడం సంతోషంగా ఉంది, ఇది పర్యావరణపరంగా మంచి నిర్ణయమే కాకుండా, సంస్థకు భారీగా ఖర్చు తగ్గిస్తుంది" అని పేర్కొన్నారు. ఈ బైక్ లు వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా వాతావరణానికి హాని కలిగించవని రివోల్ట్ మోటార్స్ తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో డెలివరీ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్ వినియోగించడానికి ఈ భాగస్వామ్యం ఒక ప్రారంభమని రివోల్ట్ విశ్వసిస్తుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఉత్పత్తి ఖర్చులు, కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు భారీగా తగ్గిపోతుండటం ఈ బైక్ లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి అని కంపెనీ తెలిపింది. -
మీరాబాయి చానుకు డొమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా హీరో అయిపోంది. ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డు సృష్టించింది. దేశానికి సిల్వర్ అందించిన ఆమెపై ప్రశంసలతోపాటు అవార్డులు, రివార్డులు కూడా కురుస్తున్నాయి. తాజాగా డొమినోస్ పిజ్జా కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరాబాయికి పిజ్జా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని పతకం గెలిచిన తర్వాత మీరాబాయి ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ''నేను పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి గుర్తుగా ముందు నేను పిజ్జా తింటాను. దానిని తిని చాలా రోజులైంది'' అని ఆమె చెప్పింది. మీరాబాయి చెప్పిన మాట విన్న డొమినోస్ పిజ్జా వెంటనే ఓ ట్వీట్ చేసింది. '' మెడల్‌ను తీసుకొస్తున్నందుకు కంగ్రాట్స్. వంద కోట్లకుపైగా భారతీయుల కలలను సాకారం చేశావు. అందుకే నీకు జీవితకాలం ఉచితంగా పిజ్జా ఇవ్వడం కంటే సంతోషం మాకు మరొకటి ఉండదు అని డొమినోస్ ట్వీట్ చేసింది. #NDTVExclusive | “First of all, I will go and have a pizza. It has been a long time since I ate it. I will eat a lot today”: Mirabai Chanu (@mirabai_chanu), Olympic athlete, on winning India’s first silver medal in #TokyoOlympics pic.twitter.com/kmuW1zDb5J — NDTV (@ndtv) July 24, 2021 -
10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్
ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన కో-ఫౌండర్ & సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్ల ప్రకారం.. ఈ డేటా సామర్ధ్యం 13 టెరాబైట్లు(టీబీ). డేటాలో 10 లక్షల యూజర్ల క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్ వివరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపాడు. జూమినెంట్ ఫుడ్‌వర్క్స్ డొమినోస్ ఇండియా మాతృ సంస్థ. అలాగే, 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 550,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే. Threat actor claiming to have hacked Domino's India (@dominos) and stealing 13TB worth of data. Information includes 180,000,000 order details containing names, phone numbers, emails, addresses, payment details, and a whopping 1,000,000 credit cards. pic.twitter.com/1yefKim24A — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) April 18, 2021 మా నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేము ఎప్పుడు స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18 కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో చాలా కంపెనీల డేటా లీక్ అవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. చదవండి: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి! -
బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం
ముంబై, సాక్షి: అటు నిపుణులు, ఇటు ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తూ కేవలం మూడు రోజుల్లోనే అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌కింగ్ షేరు మూడు రెట్లు రిటర్నులు అందించింది. ఇటీవల రూ. 60 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బర్గర్ కింగ్ తొలి రోజు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. బీఎస్ఈలో ఏకంగా 91 శాతం ప్రీమియంతో రూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రెండు రోజులుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో ఈ షేరు రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడింది! ఇందుకు ఈ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడం ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) మూడేళ్లుగా ఈ ట్రెండ్ రూ. 1,000 కోట్లలోపు పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బలమైన కంపెనీలు మూడేళ్లుగా తొలి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నట్లు టార్గెట్ ఇన్వెస్టింగ్‌కు చెందిన కల్రా పేర్కొన్నారు. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రేడర్లు, లేదా ఇన్వెస్టర్లకు కంపెనీ వేల్యుయేషన్స్ గుర్తుకురావని వ్యాఖ్యానించారు. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేరు సైతం ఇదేవిధంగా లిస్టింగ్‌లో పటిష్ట లాభాలు ఆర్జించినట్లు ప్రస్తావించారు. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2014 నవంబర్‌లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్‌కింగ్ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్ఫ్రాంచైజీలున్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రానున్న కాలంలో వ్యాపార విస్తరణ ద్వారా కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్‌కు చెందిన కేశవ్ లహోటీ పేర్కొన్నారు. అయితే క్యూఎస్ఆర్ విభాగంలో జూబిలెంట్ ఫుడ్ వాటా 21 శాతంకాగా.. మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ 11 శాతం, కేఎఫ్‌సీ 10 శాతం, సబ్వే 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన బర్గర్‌కింగ్ 5 శాతం వాటాతో వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదేళ్లలో బర్గర్‌కింగ్ అమ్మకాలు 56 శాతం జంప్‌చేయగా.. వెస్ట్‌లైఫ్ 17 శాతం, జూబిలెంట్ 12 శాతం చొప్పున వృద్ధి చూపాయి. బర్గర్‌కింగ్ 2020 మార్చికల్లా రూ. 835 కోట్ల ఆదాయం సాధించింది. -
భారత రైల్వే వినూత్న ఆలోచన
సాక్షి, న్యూఢిల్లీ: సరుకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు భారత రైల్వే ఓ వినూత్న ఆలోచన చేసింది. గూడ్స్ రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను ఇకపై డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను అవలంబించన్నట్లు తెలుస్తోంది. అంటే జాతీయ రవాణాదారు ఉత్పత్తులతో పాటు, వస్తువులను నిర్థిష్టకాలంలో రవాణా చేయడమే కాకుండా ఆలస్యం జరిగితే తగిన పరిహారం కూడా రైల్యే శాఖ చెల్లించనుంది. ఈ పరిహారం గంటల ప్రాతిపదికన ఉంటుంది. వస్తువుల పంపిణీకి రైల్యే నిర్ణీత కాలపరిమితిని నిర్ణయిస్తుంది. ఆ సయయానికి వస్తువుల పంపిణీ జరగకపోతే ప్రతి గంట చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి న్యూఢిల్లీకి సరుకులు రవాణాకు గరిష్టంగా 3 రోజులు (72 గంటలు) పడుతుంది. ఒకవేళ ఈ 72 గంటలలోపు సరుకులను పంపిణీ చేయకపోతే, నిర్ణీత గడువు ముగిసిన ప్రతి గంట ఆలస్యానికి రైల్వే పరిహారం చెల్లిస్తుంది. (చదవండి: ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి) అయితే పరిమిత రంగాలపై ఈ పద్దతిని అమలు చేయాలని, 2021 నాటికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తైన తర్వాత క్రమంగా దీనిని అవలంభించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన బృందాన్ని కోరినట్లు సమాచారం. అలాగే ఇది దీర్ఘకాలంలో ఆదాయ ఉత్పత్తి పరంగా జాతీయ రవాణాదారునికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్కు, బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్ కంపెనీల రవాణా దృష్టిని ఆకర్షించేందుకే ఈ రవాణా విధానం ఉద్దేశించబడినట్లు తెలుస్తోంది. సరుకు రవాణా డెలివరీ మోడల్ కోసం ఇ-కామర్స్ కంపెనీలు, ఆటో సెక్టార్లతో పాటు ఫార్మా సెక్టార్లను ఆకర్షించే దిశగా కూడా రైల్వే శాఖ ప్రయత్నం చేస్తుంది. -
కింగ్ వడా పావ్
మెక్ డొనాల్డ్, డోమినోస్...అమెరికా టు ఇండియా...అబ్బో... అంటూ లొట్టలేస్తున్నశబ్దాలు వినిపించాయి.ఆ శబ్దాలు ధీరజ్‌కి కూడావినిపించాయి.తను కూడా లొట్టలువేయించాలనుకున్నాడు...తన మెదడుకు పదును పెట్టాడు.ముంబైలోని వడాపావ్పరిమాణం పెంచాడు.జంబో కింగ్‌ను ప్రారంభించాడు.అందరినీ ఆకట్టుకున్నాడు.ముంబైకి చెందిన ధీరజ్ గుప్తా...అతడు తన విజయం కోసం వేసినఅడుగులే ఈ నాటి ఫుడ్ ప్రింట్స్... రెండు దశాబ్దాల క్రితం అంటే 1998లో ముంబైలో ఎంబిఏ పూర్తి చేసిన ధీరజ్ గుప్తా సొంతంగా ఒక వ్యాపార సంస్థను స్థాపించాలనుకున్నాడు. ముందుగా స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అందుకోసం చాలా కృషి చేశాడు. శ్రమకు తగ్గ ఫలితం లభించలేదు. రెండు సంవత్సరాల కాలంలో గుప్తా సుమారు 50 లక్షల సొమ్ము పోగొట్టుకున్నాడు. దురదృష్టమేమిటంటే, చేబదులు అడిగి తీసుకుని పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ఇది. స్వీట్స్ వ్యాపారం గుప్తా జీవితంలో తీపి జ్ఞాపకాలను కాదు, పచ్చి వగరు చేదులను కలగలిపిన అనుభవాలను మిగిల్చింది. కొత్త రుచులు... ప్రతి పరాజయం విజయానికి మెట్టు కావాలనుకున్నాడు. ఈ రెండు సంవత్సరాల కాలం తన దృష్టిని మెక్‌డొనాల్డ్, డొమినోస్ సంస్థలు అమ్మే పిజ్జాలు, బర్గర్ల మీద కేంద్రీకరించాడు. ఇప్పుడు అందరికీ కొత్త రుచుల మీద మనసు మళ్లిందని అర్థం చేసుకున్నాడు. తన స్వీట్స్ బిజినెస్‌కు స్వస్తి పలికి, కొత్త రుచుల బాటలో అడుగులు ప్రారంభించాడు. విదేశాల నుంచి దిగుమతైన బర్గర్లు, పిజ్జాలకు బదులుగా స్థానిక వడాపావ్‌ను పాపులర్ చేయాలనుకున్నాడు. అప్పటికే మహారాష్ట్ర వీధులలో బాగా పాపులర్ అయిన వడాపావ్‌ను వీధినుంచి స్టార్ స్థాయికి తీసుకురావాలనుకున్నాడు. తన ఖరీదైన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండు లక్షల రూపాయలు అప్పు చేసి, తన వడాపావ్‌కు ‘జంబో కింగ్’ అని పేరు పెట్టాడు. ఆ పేరున రిటైల్ చైన్ మార్కెట్ ప్రారంభించాడు. లాభాలతో ప్రారంభం... ముంబై మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో 200 చదరపు అడుగుల స్థలంలో 2001, ఆగస్టు 23న మొట్టమొదటి జంబో కింగ్ ఔట్లెట్ ప్రారంభమైంది. వడపావ్ సైజును 20 శాతం పెంచి, కంటికి ఇంపుగా కనిపించేలా తయారుచేసి, అమ్మకానికి సిద్ధం చేశాడు. ధీరజ్ గుప్తా ఆలోచన, శ్రమలకు ఫలితంగా మొట్టమొదటి రోజునే ఐదు వేల రూపాయల సరుకు అమ్మగలిగాడు. ఆ సంవత్సరం 40 లక్షల లాభం సంపాదించినా, మరో ఔట్లెట్ ప్రారంభించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2003లో మరో ఔట్లెట్ ప్రారంభమై, 2005 నాటికి ఐదు ఔట్లెట్ల స్థాయికి ఎదిగింది. మరింత ఎదగాలనుకున్నాడు. పరిశుభ్రత, ప్యాకింగ్ విషయాలలో జాగ్రత్త వహించాడు. జంబో కింగ్‌కు వచ్చి వడాపావ్ తిన్న వారంతా వాహ్! క్యా టేస్ట్ హై!! అంటూ ఇరుగుపొరుగువారిని కూడా రుచి చూసేలా చేశారు. పైసా ఖర్చు లేకుండా జంబో కింగ్‌కి ప్రచారం వచ్చేసింది. వారిని చూసి... 2006 నాటికి 100 మెక్‌డొనాల్డ్ స్టోర్లు దేశవ్యాప్తంగా విస్తరించడం చూసిన ధీరజ్ గుప్తా తాను కూడా ముంబై నుంచి బయటకు అడుగులు వేయాలనుకున్నాడు. తన కల సాకారం కావడానికి చాలా కాలం పట్టింది. 2007 నాటికి తన కల ఫలించింది. ఒక మల్టీ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జంబో కింగ్‌ను మార్కెటింగ్ చేయడానికి అంగీకరించింది. దాంతో గుప్తాకు బాలారిష్టాలన్నీ తొలగినట్లయింది. అన్ని నగరాలకు జంబో కింగ్ ఫ్రాంచైజ్ ఇచ్చేశారు గుప్తా. ఇప్పుడు జంబో కింగ్ 12 మహానగరాలకు వ్యాపించింది. వంద స్టోర్లు తెరుచుకున్నాయి. మరిన్ని నగరాలకు విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు గుప్తా. వడ పావ్ స్టాల్స్‌ని ఏటిఎంలలాగ దేశమంతా అందుబాటులోకి తీసుకు రావడమే గుప్తా కోరిక. ప్రతి ఫ్రాంచైన్ ఓనర్ ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతున్నాడు. ప్రతి స్టోర్ విజయవంతంగా నడుస్తోంది. అందువల్ల జంబో కింగ్ కూడా వృద్ధిలోకి వస్తోంది. లాభాలతో ప్రయాణిస్తున్న జంబో కింగ్ ఇప్పుడు ఏడాదికి 35 శాతం నికర లాభంతో నడుస్తోంది. సైజులో మార్పు తెచ్చాడు. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు ధీరజ్ గుప్తా. నాణ్యతప్రమాణాలు పాటిçస్తున్నారా లేదా, వినియోగదారులు తృప్తిగా ఉన్నారా లేదా అనే అంశం మీద ఆడిట్ చేస్తుంటాను. ఇందుకోసం కొందరు యువకులను నియోగించాను. వారు ఒక సాధారణ కస్టమర్లాగ స్టాల్‌కి వెళ్లి, పరీక్షిస్తుంటారు. ఇలా చేయడానికి ఒక్కో స్టోర్‌కి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఏ స్టోర్‌కి సంబంధించి నెగిటివ్ రిపోర్టు వచ్చినా, ఆ స్టోర్ మీద తగు చర్యలు తీసుకుంటాను. 100వ ఔట్లెట్ ప్రారంభించేనాటికి మా టర్నోవర్ 50 కోట్లకు ఎదగాలని కోరుకుంటున్నాను.– ధీరజ్ గుప్తా, జంబో కింగ్, ముంబై -
జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ బంపర్ ఫలితాలు
న్యూఢిల్లీ: డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ బ్రాండ్లపై ఫుడ్ స్టోర్లను నిర్వహించే జుబిలంట్ ఫుడ్ వర్క్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 60 శాతం పెరిగి రూ.77.67 కోట్లకు చేరుకుంది. డామినోస్ పిజ్జా స్టోర్ల నుంచి అధిక అమ్మకాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.48 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం సెప్టెంబర్ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ.892 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.657 కోట్ల నుంచి రూ.772 కోట్లకు పెరిగినట్టు జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ తెలిపింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో స్టోర్ల ప్రారంభాన్ని పెంచాం. 24 కొత్త డామినోస్ స్టోర్లను తెరిచాం. గత ఏడు త్రైమాసికాల కాలంలో ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించింది సెప్టెంబర్ క్వార్టర్‌లోనే’’ అని జుబిలంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ఇక జూలై– సెప్టెంబర్ కాలంలో ఐదు డంకిన్ డోనట్స్ స్టోర్లను మూసేసింది. గతేడాదితో పోలిస్తే నష్టాలు సగానికంటే తగ్గినట్టు కంపెనీ తెలిపింది. ‘‘డెలివరీ ఆర్డర్లలో బలమైన వృద్ధి నెలకొంది. డిజిటల్‌పై దృష్టి పెట్టడంతో ఆన్లైన్ అమ్మకాలు పెరిగాయి. నూతన డామినోస్ యాప్‌కు యూజర్ల నుంచి మంచి రేటింగ్ ఉంది’’ అని కంపెనీ సీఈవో ప్రతీక్ పోట తెలిపారు. జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 269 పట్టణాల్లో 1,167 డామినోస్ పిజ్జా స్టోర్లు ఉన్నాయి. అలాగే, 10 పట్టణాల్లో 32 డంకిన్ డోనట్స్ స్టోర్లు సైతం ఉన్నాయి. -
డోమినోస్ పిజ్జా మోసం : నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులను మోసంగించిందన్న ఆరోపణలతో డోమినోస్ పిజ్జాకు నోటీసులు అందాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీఎస్) డోమినోస్ సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌కు నోటీసులిచ్చింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం డొమినోస్ పిజ్జా వినియోగదారులకు పన్ను కోత ప్రయోజనాలను అందించడం లేదంటూ ఈ చర్యకు దిగింది. గత ఏడాది నవంబరులో జీఎస్టీ కౌన్సిల్ అన్ని హోటళ్లకు పన్నురేట్లను తగ్గించింది. రూ. 7,500 లేదా అంతకు మించి అద్దె వసూలు చేసే హోటళ్లకు పన్ను రేటును 18శాతంనుంచి 5 శాతానికి తగ్గించింది. అయినా డొమినోస్ ఇంకా అధిక చార్జీలను వసూలు చేస్తోందన్న కస్టమర్ల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీజీఎస్ ఈ నోటీసులిచ్చింది. సంబంధిత వివరాలను సమర్పించాల్సిందిగా సంస్థను కోరింది. అటు నోటీసులు విషయాన్ని జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రతినిధి ధృవీకరించారు. అయితే తాము ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని వివరించింది. కాగా గతంలో కూడా డీజీఎస్ హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, వెస్ట్, సౌత్‌లోని మెక్‌డొనాల్డ్స్, రిటైల్ లైఫ్‌స్టయిల్, హోండా డీల్స్ లాంటి సంస్థలకు ఈ తరహా నోటీసులు జారీ చేసింది. తప్పుడు జీఎస్టీతో వినియోగదారులను మోసం చేస్తున్నాయనీ ఆరోపించింది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నందున ఈ సంస్థలపై చర్యలకు దిగింది. -
డామినోస్ పిజ్జా ఆపరేటర్‌కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే.