సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులను మోసంగించిందన్న ఆరోపణలతో డోమినోస్ పిజ్జాకు నోటీసులు అందాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీఎస్) డోమినోస్ సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌కు నోటీసులిచ్చింది. జీఎస్‌టీ నిబంధనల ప్రకారం డొమినోస్ పిజ్జా వినియోగదారులకు పన్ను కోత ప్రయోజనాలను అందించడం లేదంటూ ఈ చర్యకు దిగింది.
గత ఏడాది నవంబరులో జీఎస్‌టీ కౌన్సిల్ అన్ని హోటళ్లకు పన్నురేట్లను తగ్గించింది. రూ. 7,500 లేదా అంతకు మించి అద్దె వసూలు చేసే హోటళ్లకు పన్ను రేటును 18శాతంనుంచి 5 శాతానికి తగ్గించింది. అయినా డొమినోస్ ఇంకా అధిక చార్జీలను వసూలు చేస్తోందన్న కస‍్టమర్ల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీజీఎస్ ఈ నోటీసులిచ్చింది. సంబంధిత వివరాలను సమర్పించాల్సిందిగా సంస్థను కోరింది. అటు నోటీసులు విషయాన్ని జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రతినిధి ధృవీకరించారు. అయితే తాము ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల‍్పడలేదని వివరించింది.
కాగా గతంలో కూడా డీజీఎస్ హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, వెస్ట్, సౌత్‌లోని మెక్‌డొనాల్డ్స్, రిటైల్ లైఫ్‌స్టయిల్, హోండా డీల్స్ లాంటి సంస్థలకు ఈ తరహా నోటీసులు జారీ చేసింది. తప్పుడు జీఎస్టీతో వినియోగదారులను మోసం చేస్తున్నాయనీ ఆరోపించింది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నందున ఈ సంస్థలపై చర్యలకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment