రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు జీఎస్‌టీ నోటీసులు | GST notices to Reliance General Insurance | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు జీఎస్‌టీ నోటీసులు

Published Mon, Oct 9 2023 8:09 AM | Last Updated on Mon, Oct 9 2023 8:16 AM

GST notices to Reliance General Insurance - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌  అనుబంధ సంస్థ– రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఆర్‌జీఐసీ) రూ. 922.58 కోట్ల పన్ను డిమాండ్‌తో  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ నుండి  నాలుగు షోకాజ్‌ నోటీసులను అందుకుంది. ఈ నోటీసులు రూ.478.84 కోట్లు, రూ.359.70 కోట్లు, రూ.78.66 కోట్లు, రూ.5.38 కోట్ల చొప్పున డిమాండ్‌తో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

నోటీసులు రీ–ఇన్సూరెన్స్, కో–ఇన్సూరెన్స్‌ వంటి వివిధ సేవల నుంచి వచ్చిన ఆదాయాలకు సంబంధించనవి కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. పన్ను నిపుణుల సమాచారం ప్రకారం, ఆర్‌జీఐసీ ఆడిటర్లు సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ పన్ను డిమాండ్‌కు సంబంధించిన అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement