reliance general insurance
-
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు జీఎస్టీ నోటీసులు
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ– రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీ) రూ. 922.58 కోట్ల పన్ను డిమాండ్‌తో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నుండి నాలుగు షోకాజ్ నోటీసులను అందుకుంది. ఈ నోటీసులు రూ.478.84 కోట్లు, రూ.359.70 కోట్లు, రూ.78.66 కోట్లు, రూ.5.38 కోట్ల చొప్పున డిమాండ్‌తో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులు రీ–ఇన్సూరెన్స్, కో–ఇన్సూరెన్స్ వంటి వివిధ సేవల నుంచి వచ్చిన ఆదాయాలకు సంబంధించనవి కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. పన్ను నిపుణుల సమాచారం ప్రకారం, ఆర్జీఐసీ ఆడిటర్లు సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ పన్ను డిమాండ్‌కు సంబంధించిన అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడే తెలుసుకోండి..!
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ టైఅప్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని.. దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ద్వారా రిలయన్స్ జనరల్ అందించనుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద ఔట్ పేషెంట్ చికిత్సలతోపాటు.. ఆస్పత్రిలో చేరినప్పుడు, మేటర్నిటీ కవరేజీ తదితర ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ప్రమాద మరణం ఏర్పడితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. లేదా శాశ్వత వైకల్యం పాలైనా పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యం కలిగితే ఆ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రమాదం కారణంగా మొబైల్ ఫోన్ దెబ్బతింటే రూ.5,000 పరిహారం లభిస్తుంది. రూ.31 కోట్ల చెల్లింపులు 2022–23 సంవత్సరంలో స్విగ్గీ తన డెలివరీ భాగస్వాములకు రూ.31 కోట్ల బీమా క్లెయిమ్‌ల చెల్లింపులకు సాయం అందించినట్టు ప్రకటించింది. 2015 నుంచి స్విగ్గీ తన డెలివరీ ఏజెంట్లకు బీమా కవరేజీ అందిస్తోంది. -
రిలయన్స్ సాధారణ బీమాపై కన్ను
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికల్లో ఉన్న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకి ప్రయివేట్ రంగ కంపెనీలు పిరమల్ గ్రూప్, జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ భాగస్వామ్య ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ) ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ భారంతో కుదేలైన రిలయన్స్ క్యాపిటల్ దివాలా చట్ట(ఐబీసీ) చర్యలను ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా సాధారణ బీమా అనుబంధ సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పిరమల్, జ్యూరిక్ విడిగా నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేశాయి. రెండు సంస్థలూ ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో చెరి సగం(50 శాతం చొప్పున) వాటాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కోసం విడిగా బిడ్‌ను వేసినట్లు జ్యూరిక్ వెల్లడించింది. రిలయన్స్ సాధారణ బీమా బిజినెస్ విలువను పిరమల్ రూ. 3,600 కోట్లు, జ్యూరిక్ రూ. 3,700 కోట్లుగా మదింపు చేశా యి. అయితే అసలు విలువ రూ. 9,450 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార ప్రణాళికను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి, సీవోసీ బిడ్స్ దాఖలు గడువును అక్టోబర్ 30వరకూ పొడిగించాయి. -
రిలయన్స్ జనరల్ కస్టమైజ్డ్ హెల్త్ ప్లాన్
ముంబై: కస్టమర్లు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ గెయిన్’ పేరుతో పాలసీని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో ప్లస్, పవర్, ప్రైమ్ అనే మూడు రకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. రెట్టింపు కవరేజీ (ఒకసారి కవరేజీ అయిపోతే తిరిగి పునరుద్ధరించడం), గ్యారంటీడ్ క్యుములేటివ్ బోనస్ ఇలా పరిశ్రమలో 38 రకాల ప్రధాన ఫీచర్లు ఈ పాలసీలో అందుబాటులో ఉన్న ట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. -
వాహనదారులకు ఇన్సూరెన్స్,రిలయన్స్‌తో వన్ మోటో ఇండియా జట్టు!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ వన్ మోటో ఇండియా తమ కస్టమర్లకు వాహన బీమా సదుపాయం కల్పించేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపింది. కస్టమర్లకు సులభతరంగా ఇన్సూరెన్స్ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని వన్ మోటో ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆనంద్ సింఘి తెలిపారు. బైకా, ఎలెక్టా, కమ్యూటా పేరిట వన్ మోటో ఇండియా మొత్తం మూడు స్కూటర్లను ఆవిష్కరించింది. తొలి దశలో రూ. 250 కోట్లతో 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. -
రిలయన్స్ బీమా ఐపీఓ మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబా నీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికను అటకెక్కించింది. సెబీకి సమర్పించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీఓను ఎందుకు ఉపసంహరించుకుందో వివరాలను కంపెనీ గానీ, ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ గానీ వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారమైతే, ఈ ఐపీఓలో భాగంగా రూ.200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రిలయన్స్ క్యాపిటల్ 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. 2017లో కూడా అంతే..! రిలయన్స్ బీమా ఐపీఓ డాక్యుమెంట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 8నే మోతిలాల్ ఓస్వాల్ సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను ఉపసంహరించుకుంటున్నామని ఈ నెల 24న సెబీకి ఒక మెయిల్ పంపించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. 2017, అక్టోబర్‌లో ఐపీఓ పత్రాలను సమర్పించి ఆ మరుసటి నెలలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అప్పుడు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగడం, ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఐపీఓ ప్లాన్‌ను అటకెక్కించింది. -
రిలయన్స్ ఇన్సూరెన్స్ లాభంలో 28 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 28 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.165 కోట్లకు పెరిగినట్లు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష ప్రీమియమ్ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.5,069 కోట్లకు చేరిందని కంపెనీ సీఈఓ, ఈడీ రాకేశ్ జైన్ చెప్పారు. నికర లాభం మెరుగుపడడం, ప్రీమియం పెరుగుతుండడంతో వృద్ధి జోరును కొనసాగిస్తున్నామని చెప్పారాయన. -
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా 1.67 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ షేర్లతో పాటు రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన 5.03 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేస్తారు. తాజాగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించే నిధులను సాల్వెన్సీ మార్జిన్‌ను, సాల్వెన్సీ రేషియోను మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తు మూలధన అవసరాలకు వినియోగించుకోవాలని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యోచిస్తోంది. ఈ ఐపీఓకు మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్(ఇండియా), ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూబీఎస్ సెక్యూరిటీస్, హైతంగ్ సెక్యూరిటీస్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్.. లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
రిలయన్స్ ఇన్సూరెన్స్‌కు ఫోరం మొట్టికాయ
హైదరాబాద్: వాహనంలో అనుమతించిన సంఖ్య కంటే అదనంగా మనుషులు ఉన్నారన్న కారణంగా బీమా మొత్తాన్ని తిరస్కరించడం సరికాదని బీమా సంస్థలకు రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. మనుషుల ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఉండదని, ఈ నేపథ్యంలో సంఖ్యను ఎలా సాకుగా చూపుతారని ప్రశ్నించింది. వాహనంలో ఒక్కరే ఉండాలని, ఆరుగురు ఉన్నారన్న కారణంగా బీమా మొత్తాన్ని తిరస్కరించడం సరికాదని తేల్చిచెప్పింది. విద్యుత్ఘాతం కారణంగా పూర్తిగా కాలిపోయిన బోర్వెల్ వాహనానికి రూ.37.5 లక్షలను 12 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని ఫోరం సభ్యులు ఆర్.లక్ష్మీనరసింహారావు, టి.అశోక్‌కుమార్, ఎస్.భుజంగరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. అలాగే ఇతర ఖర్చుల కింద మరో రూ.35 వేలు ఇవ్వాలని తీర్పులో స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సీతా కళావతి బోర్వెల్ వాహనానికి 2012 ఏప్రిల్ 18న ఏడాది కాలానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా పాలసీ తీసుకున్నారు. 2012 నవంబర్ 19న బోర్ వేసేందుకు వెళ్తున్న వాహనం విద్యుత్ఘాతానికి గురై పూర్తిగా కాలిపోయింది. పాలసీ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బీమా మొత్తం రూ.45 లక్షలు చెల్లించాలని కోరినా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్పందించడం లేదంటూ సీతాకళావతి ఫోరంను ఆశ్రయించారు.