హైదరాబాద్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ టైఅప్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని.. దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ద్వారా రిలయన్స్ జనరల్ అందించనుంది.
గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద ఔట్ పేషెంట్ చికిత్సలతోపాటు.. ఆస్పత్రిలో చేరినప్పుడు, మేటర్నిటీ కవరేజీ తదితర ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ప్రమాద మరణం ఏర్పడితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. లేదా శాశ్వత వైకల్యం పాలైనా పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యం కలిగితే ఆ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రమాదం కారణంగా మొబైల్ ఫోన్ దెబ్బతింటే రూ.5,000 పరిహారం లభిస్తుంది.
రూ.31 కోట్ల చెల్లింపులు
2022–23 సంవత్సరంలో స్విగ్గీ తన డెలివరీ భాగస్వాములకు రూ.31 కోట్ల బీమా క్లెయిమ్‌ల చెల్లింపులకు సాయం అందించినట్టు ప్రకటించింది. 2015 నుంచి స్విగ్గీ తన డెలివరీ ఏజెంట్లకు బీమా కవరేజీ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment