
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.
ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.
ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
ఆన్‌లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment