జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన తరువాత.. స్విగ్గీ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. ఇప్పటికే 7 రూపాయలుగా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10లకు చేసింది. అంటే మూడు రూపాయలు పెంచిందన్నమాట. కాబట్టి ఇకపైన స్విగ్గీ ప్రతి ఆర్డర్ మీద రూ. 10 ఫీజు వసూలు చేస్తుంది.
జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తరువాత స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటికే యాప్‌లో కనిపిస్తున్నాయి. పండుగ సమయంలో సేవలను నిర్వీరంగా అందించడానికి ఈ ఫీజులను పెంచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇప్పుడు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా రూ. 10లకు చేరింది.
ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఉచిత డెలివరీతో ప్రారంభమైంది, ఇప్పుడు జీఎస్టీ, డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్‌ఫారమ్ ఫీజు ఇలా భారీగా పెంచేశారు అని వెల్లడించారు. డెలివరీ చార్జీలకంటే కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు భవిష్యత్తులో ఎక్కువవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
🚨 Swiggy Also Increased Platform Fee To ₹10
This Happened Right After Zomato’s Hike
Food Ordering Started With Free Delivery, Now GST, Delivery & Packing Charges, Platform Fee
Zomato & Swiggy Does 3.5 Million Orders Daily— Ravisutanjani (@Ravisutanjani) October 23, 2024
Comments
Please login to add a commentAdd a comment