దసరా, దీపావళి ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయ్. ఈ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం మొదలుపెట్టేస్తాయి. ఇదే అదనుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు కూడా తమదైన రీతిలో దోచుకోవడానికి సిద్దమైపోతారు. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించాలి.. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా.. అధికారిక వెబ్‌సైట్లలోనే సెర్చ్ చేయాలి. తక్కువ రేటుకు లభిస్తున్నాయి కదా.. అనుకుని అనధికార వెబ్‌సైట్లలో బుక్ చేయడం వంటివి చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే డబ్బు చెల్లించిన తరువాత బహుశా డెలివరీ రాకపోవచ్చు. ఒకవేళా వచ్చిన నాణ్యమైనవి వస్తాయనే గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు ఎంచుకునే వెబ్‌సైట్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
మెసేజ్ అలర్ట్ లేదా ఈ-మెయిల్ అలర్ట్.. ఈ పండుగ సీజన్‌లో గుర్తు తెలియని నెంబర్స్ నుంచి భారీ ఆఫర్స్ అనే విధంగా మెసేజిలు లేదా ఈ మెయిల్ అలర్ట్ వంటివి వస్తుంటాయి. ఇలాంటి వాటికి స్పందించకపోవడమే ఉత్తమం. తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పిన్ నెంబర్ ఉపయోగించడంలో జాగ్రత్త వహించడం.. మీరు ఆన్‌లైన్ షాపించి చేసేటప్పుడు ఒక్కో పోర్టల్‌కు ఒక్కో పాస్‌వర్డ్ ఉపయోగించడం ఉత్తమం. అన్ని పోర్టల్‌లకు ఒకటే పాస్‌వర్డ్ ఉపయోగిస్తే.. ఎవరైనా హ్యాక్ చేసే సమయంలో అన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
సాఫ్ట్‌వేర్ అప్డేట్స్.. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లలో మీ డేటాను రక్షించడానికి సులభమైన మార్గాలలో ఒకటి సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం. ఇది మీ డేటా భద్రతకు సహాయపడతాయి. ఇది సైబర్ దాడుల నుంచి కూడా రక్షిస్తుంది. పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ అవసరం ఉంటే తప్ప ఇవ్వకూడదు.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
ఫ్రీ హాట్‌స్పాట్‌ల వాడకం.. పబ్లిక్ ప్రదేశాల్లో.. ఉచితంగా అందుబాటులో ఉండే హాట్‌స్పాట్‌లను ఉపయోగించే షాపింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. ఇలాంటి సమయంలోనే హ్యాకర్స్ ఎక్కువగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది.
యాప్స్ డౌన్‌లోడ్.. మీకు అవసరమైన లేదా డౌన్‌లోడ్ చేయాలనుకునే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ వంటి వాటిలో ఉన్నాయా? లేదా? అని నిర్థారించుకోండి. ఎందుకంటే.. కొంతమంది ఫేక్ యాప్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాంటివి డౌన్‌లోడ్ చేస్తే అనుకోని నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment