ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్‌లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించినట్లు సమాచారం.
కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్‌లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.
ఎక్కువ మంది పండుగ సీజన్‌లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.
సమర్థ్ సేల్ ఈవెంట్
పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీఓలు, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్‌లతో పండుగ సీజన్‌ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.
ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్
లక్షకు పైగా ఉద్యోగాలు
పండుగ సీజన్‌లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్.. కస్టమర్‌లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment