visiters
-
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త రికార్డ్: పండుగ సీజన్లో..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించినట్లు సమాచారం.కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.ఎక్కువ మంది పండుగ సీజన్లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.సమర్థ్ సేల్ ఈవెంట్పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్లతో పండుగ సీజన్‌ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్లక్షకు పైగా ఉద్యోగాలుపండుగ సీజన్లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్లో ఫ్లిప్‌కార్ట్.. కస్టమర్లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది. -
అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుని సంహరించాడు. అందుకే దసరా నాడు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు.దేశరాజధాని ఢిల్లీలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. దసరా రోజున రావణ దహనంతో పాటు పలు చోట్ల మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో రావణుడు, కుంభకరుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.రామ్‌లీలా మైదాన్ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, వాటిని దహనం చేస్తారు. ఇక్కడి జరిగే మేళాలో రకరకాల వంటకాలు, వినోదాల కోసం పలు స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహనాన్ని దూరదర్శన్‌లో ప్ర్యత్యక్ష ప్రసారం చేస్తారు. న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోవచ్చు.ఎర్రకోటప్రతి సంవత్సరం ఎర్రకోటలో దసరా సందర్భంగా మేళా నిర్వహిస్తారు. అనేకమంది కుటుంబ సమేతంగా ఎర్రకోటకు తరలివచ్చి, దసరా వేడుకలను తిలకిస్తారు. మేళా సందర్భంగా ఇక్కడ పలు షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.గీతా కాలనీనవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇక్కడ పెద్దఎత్తున మేళా నిర్వహిస్తారు. చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి తరలివచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాల్స్‌లో ఆహరం తినడాన్ని చాలామంది ఇష్టపడతారు.రోహిణి- జనక్పురిఢిల్లీలోని రోహిణి- జనక్‌పురిలో జరిగే ఈ జాతరను సెక్టార్ 11 ఫెయిర్ అని అంటారు. ఇక్కడ దసరా మేళా భారీ స్థాయిలో జరుగుతుంది. పిల్లల కోసం ఇక్కడ లెక్కకు మించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.ఇది కూడా చదవండి: షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే -
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్ జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్ ఆఫర్. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ 1977 నుండి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం డేని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ఎంత ముఖ్యమైనవో అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియమ్స్ కౌన్సిల్ (ఐకామ్) ఈ పిలుపు నిచ్చింది. 2022లో ‘పవర్ ఆఫ్ మ్యూజియమ్స్’ అనే థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల్లో పాల్గొంటాయి. గత సంవత్సరం, సుమారు 158 దేశాల్లో 37వేలకు పైగా మ్యూజియంలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. 75 వసంతాల ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డా.నాగేందర్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మ్యూజియంను తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకు మ్యూజియం సందర్శన అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా సెల్పీ, ఫోటో పాయింట్లను ఈ సందర్భంగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించేలా దివ్యాంగులు, అనాథ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజైన 21వ తేదీన వివిధ విదేశీ కార్యాలయాల ప్రతినిధులు కూడా మ్యూజియాన్ని సందర్శిస్తారని నాగేందర్ చెప్పారు. అలాగే చక్కటి పెయింటింగ్స్‌తో ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సెక్రటరీ రమణారెడ్డి వెల్లడించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజేతలకు క్యాష్ అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. ఆరు రోజుల ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మ్యూజియం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరు 25 దాకా ఎంట్రీలను పంపవచ్చన్నారు. భాగ్య నగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ సౌజన్యంతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సెక్రటరీ కే జనార్థన్ తెలిపారు. వీటితో పాటు ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిద్రి ఆర్ట్‌పై ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రివెంటివ్ కన్జర్వేషన్ మీద ఒక వెబ్‌నార్ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన కలాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు. ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాలార్ జంగ్ మ్యూజియంలోని విశేషాలను కనులారా వీక్షించండి. -
12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!
సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది. -
Covid Effect: 19 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక ప్రదేశాల పునఃప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో గత మార్చి నెలలో పర్యాటక ప్రదేశాలకు సందర్శకుల రాకను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో వీటిని తిరిగి సందర్శకుల కోసం తెరవాలని భావించింది. అయితే, మన రాష్ట్రంలో సాయంత్రం ఐదు గంటల వరకే లాక్డౌన్ నుంచి సడలింపులు ఉన్నందున.. పర్యాటకులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో చర్చించిన తర్వాతే ఈ నెల 19వ తేదీ అనంతరం నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ స్మితా ఎస్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో చార్మినార్, గోల్కొండ, వరంగల్ కోట ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: విషాదం: ఆ పాప ఇక లేదు.. మీ విరాళాలు తిరిగిచ్చేస్తాం! -
‘టోల్’ తీస్తున్నారు
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రాజెక్ట్ వద్ద పార్కు నిర్వాహకుల దోపిడిని చూసి శ్రీరామా.. ఇదేమీ దోపిడి అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సందర్శనకు రావాలంటే జంకుతున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధిలో భాగంగా గత నాలుగేళ్ల క్రితం 6 కోట్ల నిధులతో పార్కు నిర్మించారు. పార్కు నిర్వహణనను యువజన సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకుల వద్ద పార్కింగ్ వసూలు కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పార్కు నిర్వహణ చేపడుతూ.. పార్కు సందర్శనకు వచ్చే పర్యాటకుల వద్ద నిర్ణయంచిన రుసుం ప్రకారం టికెట్ తీసుకోవాలి. కాని ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న ప్రతి పర్యాటకుని వద్ద వాహనాలకు పార్కింగ్ ఫీజు పేరిట ద్విచక్ర వాహనానికి 10 రూపాయాలు, కారులకు 20 రూపాయాల చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానికులనూ వదలడం లేదు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నుంచే సోన్‌పేట్ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా లెఫ్ట్ పోచంపాడ్ వాసులు ఎస్సారెస్పీ డ్యాం పై నుంచే వెళ్లాలి. వాళ్లను కూడా వదలకుండా టోల్ వసూలుకు పాల్పడుతున్నారు. ఫలాన గ్రామం అని చెప్పినా వినకుండా వాహనాలను ఆపుతున్నారు. గ్రామ నివాసి అని గుర్తింపు కార్డు చూపాలంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదే దోపిడి దానికి గుర్తింపు కార్డులు చూపాలనడం విడ్డూరంగా ఉందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటోలకూ ఫీజు వసూలు..! పార్కు ఎంట్రీ ఫీజుకు తోడు పార్కులో ఫోటోలు దిగాలంటే నిర్వహకులకు 350 రూపాయాల నుంచి 500 రూపాయాలు సమర్పించుకుంటేనే ఫోటోలు దిగే అవకాశం ఇస్తారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వారికి అండగా ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దోపిడిని అరికట్టాలని పర్యాటకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నోటీసులు అందించాం: శ్రీనివాస్‌రెడ్డి,ఎస్ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పార్కులో వసూళ్లకు పాల్పడుతున్నారని దృష్టికి రావడంతో నిర్వహకులకు నోటీసులను జారీ చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం. -
వీసా గడువు దాటినా వెళ్లడంలేదట
వాషింగ్టన్: చిన్న చిన్న కారణాలకే భారతీయ విద్యార్థులను అమెరికా తిప్పి పంపేస్తుంటే.. సందర్శకులుగా, వ్యాపార పనుల నిమిత్తం వెళ్లిన భారతీయులు మాత్రం గడువు దాటినా అక్కడే ఉంటున్నారట. ఇలా ఉంటున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది 8.8 లక్షల మంది భారతీయులు బి1, బి2 వీసాలు తీసుకొని అమెరికాకు వెళ్లినా అందులో 14,000 మంది గడువు దాటినా ఆ దేశాన్ని వీడలేదట. 2014లో 7.6 లక్షల మంది తిరిగొచ్చే అనుమతితో అమెరికాకు వెళ్లగా అందులో 11,653 మంది గడువు దాటినా తిరిగి రాలేదట. ఈ వివరాలను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా వెల్లడించింది. మొత్తంగా చూస్తే అమెరికాకు వచ్చిన ప్రతి వందమంది విదేశీయుల్లో ఒకరు గడువులోగా దేశాన్ని వీడడం లేదని, 98.83 శాతం మంది మాత్రం నిర్ణీత గడువులోనే వెళ్లిపోతున్నారని అధికారులు తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజిటర్స్‌కు నో ఎంట్రీ
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు అనుమతిని రద్దు చేశారు. దాడులకు తెగబడతామని ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి విమానాశ్రయ సందర్శకుల పాసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు.