German Couple Traveling Trip: Around 91 Countries In Luxury Car Details Inside - Sakshi
Sakshi News home page

German Couple Traveling Trip: 12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!

Published Tue, Mar 1 2022 9:54 AM | Last Updated on Tue, Mar 1 2022 12:01 PM

German Couple Traveling Trip With Luxury Car Around 91 Countries - Sakshi

సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్‌(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు.

12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్‌ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్‌ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement