german
-
చెన్నమనేని జర్మనీ పౌరుడే
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్ చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్‌లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్ మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’అని కోరారు.అప్పీల్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేనిహైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
భారత్‌లో సాగు ఆధునీకరణ చర్యలు భేష్
పానిపట్: భారత్‌లో సాగు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జర్మన్ కెమికల్స్ దిగ్గజం బేయర్ దక్షిణాసియా ప్రెసిడెంట్ సైమన్ వీబుష్ ప్రశంసించారు. వెనుకబడిన వ్యవసాయ రంగంతో భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించడం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలు వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని సైమన్ చెప్పారు. భారత్ వినూత్న ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, రెగ్యులేటరీ ప్రక్రియలను మరింతగా డిజిటలీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత నెలకొన్న నేపథ్యంలో తాము కలుపు మందులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. క్రిమిసంహారకాల కన్నా అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. వరి, గోధుమలు, చెరకు వంటి కీలక పంటల కోసం కలుపు మందులను అభివృద్ధి చేస్తున్నామని సైమన్ చెప్పారు. అంతర్జాతీయంగా తాము నిర్వహిస్తున్న ’ఫార్వర్డ్ఫామ్స్’ కార్యక్రమం ద్వారా భారత్‌లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను, ఆగ్రో–కెమికల్స్‌ను మెరుగుపర్చే కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్‌ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్‌ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
జర్మనీ పర్యాటకుణ్ణి దోచుకున్న పాక్ పోలీసులు
పాకిస్తాన్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్లో జరిగిన ఓ లూటీ సంచలనంగా మారింది.జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ పోన్‌తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్‌పై పాకిస్తాన్లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!
అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్లో ఉంచుతుంది. ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్స్టర్డామ్, జ్యూరిచ్లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్‌తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్‌లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్‌గా వివరించలేదు. క్రయోప్రెజర్వేషన్ అంటే..ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!) -
పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్‌తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.నాటి నుంచి అడ్డంకులేపుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవునియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.కంపెనీలు వెనక్కే!పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆగడాలే కారణంకర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. -
ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు
మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. జర్మనీలోని రాజకీయ సామాజిక పరిస్థితులు విషయం కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో కొత్త ఆవిష్కరణలు చేయడంలో మాత్రం ఆ దేశం చొరవ చూపినట్లు తెలుస్తుంది. మొబైల్లో వాడే సిమ్‌కార్డు, మోటార్‌సైకిల్, న్యూస్‌పేపర్, ఎయిర్‌బ్యాగ్, టెలిస్కోప్..వంటి దాదాపు ప్రపంచం ఉపయోగించే ప్రధానం ఆవిష్కరణలు జర్మనీ దేశానికి చెందిన పరిశోధకులు కనిపెట్టినవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందులో కొన్ని ఆవిష్కరణలు కింది తెలుపబడ్డాయి. కెప్లర్ గ్రహాల చలన నియమాలు ఆధునిక బైనరీ సంఖ్యా వ్యవస్థ ఫారెన్‌హీట్ స్కేల్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ +, - గుర్తులు ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్ అల్జీమర్స్ వ్యాధి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్రోమాటోగ్రఫీ ఎనిగ్మా యంత్రం ఎలక్ట్రిక్ ఎలివేటర్ కాంక్రీటు పంపు "√" చిహ్నం ప్రిగ్నెన్సీ టెస్ట్ వాక్యూమ్ పంపు గైరో కంపాస్ స్పీడో మీటర్ స్ట్రాటో ఆవరణం కిండర్ గార్టెన్ గమ్మీ బేర్ బాక్టీరియాలజీ టాకోమీటర్ హిమోగ్లోబిన్ పాస్ఫరస్(భాస్వరం) కణ విభజన మైక్రోఫోన్ వార్తాపత్రిక హాంబర్గర్ ఆటోమొబైల్ మోటార్ సైకిల్ ఓమ్స్ నియమం అతినీలలోహిత కిరణాలు జిర్కోనియం టెలిస్కోప్ ఎగ్ స్లైసర్ వాల్ ప్లగ్ సిమ్ కార్డు నెప్ట్యూన్ యురేనియం ఇయర్‌ప్లగ్ ఆక్సిజన్ యురేనస్ ఆస్పిరిన్ హెరాయిన్ ఎయిర్ బ్యాగ్ జీన్స్ ఎంపీ3 ప్లేయర్ ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ -
భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!
జర్మనీ సింగర్ నోట ముగ్ధమనోహరంగా భారతీయ సంగీతం.అదీకూడా అన్ని భాషల్లో అవోకగా పాడేస్తోందామె. ఆ గాత్రానికి ఎవవ్వరైన మైమరచిపోవాల్సిందే. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే ఆమె గాత్రానికి ఫిదా అయ్యారు. మనక్ బాత్‌లో ఆమె గురించి ప్రస్తావించారు మోదీ. అంతేగాదు మోదీ ఆమెను కలవడమే కాకుండా ఆమె నోట పాటను స్వయంగా విన్నారు. ఇంతకీ ఎవరా జర్మన్ సింగర్? ఏ భాష అయిన అందర్నీ కట్టిపడేసేది సంగీతమే. జర్మన్ సింగర్ కసాండ్ర మే స్పిట్మన్ను ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా కలిసి ఆమె ప్రతిభను ప్రశంసించారు. భక్తిగీతాలను ఇష్టపడే మోదీ ఎదుటై ప్రసిద్ధ భారతీయ భజన్ గీతమమైన "అచ్చుతం కేశం.. అనే పాట అద్భుతంగా ఆలపించింది. ఇది ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ తెగ హల్చల్ చేస్తోంది. మోదీ తన మన్‌కీ బాత్‌లో కూడా ఆ జర్మన్ సింగర్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. "ఎంత మధురమైన స్వరం. ప్రతి పదంలో ఎంత చక్కగా భావోద్వేగాలను పలికిస్తోంది. దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ అందర్నీ అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ మధురమైన స్వరం ఒక జర్మన్ది అంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆమె పేరు కాసాండ్ర మే స్పిట్మాన్ అంటూ ఆమె గురించి పరిచయం చేశారు. పుట్టుకతో అంధురాలైన అది ఆమె సంగీత ప్రతిభను అడ్డుకోలేదు. ఈ సంగీతంమనందరినీ కలిపే విశ్వభాష. అందమైన రిథమ్‌లు, బీట్లు ఏ హృదయాన్నేనా గెలుచుకోగలవు. అందుకు ఉదాహరణ అంధురాలైన ఈ కాసాండ్రే అని మన్ కీ బాత్లోఆమె గురించి గొప్పగా మాట్లాడారు మోదీ." ఇక ఈ 22 ఏళ్ల కాసాండ్రాకి భారతదేశాన్ని సందర్శించాలనేది అమె సుదీర్ఘ కల. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని తమిళం, హిందీ, సంస్కృతం అస్సామీ, మలయాళం, బెంగాలీ, వంటి అనేక భాషల్లో పాడగలిగేలా ప్రావీణ్యం సంపాదించిది. అందేగాక తన సోషల్ మీడియా ఖాతాలో తాను పాడిన పాటలను పోస్ట్ చేస్తుండేది. ఓ జర్మన్ ఇలా అలవోకగా భారతీయ భాషల్లో పాటలను పాడేయటం అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ నైపుణ్యమే ఆమెను అందరికీ చేరువయ్యేలా చేసింది. అలాగే ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ బయోలో "జర్మన్ సింగర్-సాంగ్ రైటర్ ఇన్ లవ్ విత్ ఇండియా" అని అభివర్ణించి ఉంటుంది. దీంతో ఆమెకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెలో దాగున్న ఈ టాలెంటే మోదీ నెలవారి రేడియో షో మన కీ బాత్ 105 ఎపిసోడ్లో ప్రస్తావించేందుకు దారితీసింది. Cassandra Mae Spittmann's melodious voice is widely known. At Palladam, I met her and her mother. We had a wonderful discussion about Cassmae's love for Indian culture, music and food. The highlight was her singing Sivamayamaga in Tamil and Achyutam Keshavam! pic.twitter.com/fLVoyMUHiW — Narendra Modi (@narendramodi) February 27, 2024 (చదవండి: అనంత్ అంబానీ బరువుకి కారణం ఇదే! ఆ విషయంలో కాబోయే భార్య..) -
FlixBus: భారత్‌లోకి జర్మనీ బస్సులు.. ఎక్కడికైనా రూ.99 టికెట్!
జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ (FlixBus)భారత్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన భారత్‌లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్‌బస్ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ రూ.99 లాంచింగ్ ఆఫర్ కింద ప్రారంభ రూట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి, జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో, అమృత్సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్‌బస్ సమగ్ర నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయి. అన్నీ ప్రీమియం బస్సులు జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్బస్ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్లలో ఒకటైన భారత్‌కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం. అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్‌బస్ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్ అన్నారు. -
హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది. సోషల్ మీడియాలో కనిపించిన వీడియోల దృశ్యాల ప్రకారం కొంతమంది హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి కేకలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. మొదట ఆ మహిళా మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికురాలికి చెందినదని హమాస్ పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన మహిళ తన సోదరి, జర్మన్ పౌరురాలు అని ట్విట్టర్ వేదికగా ఓ మహిళ నివేదించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. The mother of Shani Louk, the woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza, released a statement earlier today. She confirmed she had seen her daughter on the video & asked the public for help with more information pic.twitter.com/LDcPsjGHP8 — Visegrád 24 (@visegrad24) October 8, 2023 ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు -
యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..!
బెంగళూరు: భారత్‌లో యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ డిజిటల్, ట్రాన్స్‌పోర్టు మంత్రి విస్సింగ్ ప్రశంసలు కురిపించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ వాడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతటి సులభతర విధానాన్ని భారతీయులందరూ వాడుతున్నారని పేర్కొంటూ జర్మన్ ఎంబసీ తన ట్వీట్టర్(ఎక్స్ )లో పేర్కొంది. మిస్సింగ్ కూరగాయలు కొని, పేమెంట్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ గణవిజయం సాధించిందని మిస్సింగ్ అన్నారు. సెకన్ల కాలంలోనే చెల్లింపులు చేసుకునే విధానంపై ఆయన ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. సులభతరంగా చెల్లింపులు చేసుకునే యూపీఐ పేమెంట్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించారు. One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C — German Embassy India (@GermanyinIndia) August 20, 2023 జర్మన్ ఎంబసీ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. యూపీఐ పేమెంట్స్‌లో భాగం అయినందుకు మిస్సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత డిజిటల్ విప్లవంపై స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా మారింది.. ఇందులో జర్మనీ ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. యూపీఐ అనేది భారత్‌లో వేగవంతంగా చెల్లింపులు చేసుకునే డిజిటల్ విధానం. ఇందులో శ్రీలంక, సింగపూర్, ఫ్రాన్స్ భాగం అయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
మహేశ్ బాబుకు ఏమైంది? ఆరోగ్యంపై ఎందుకలా పోస్ట్ చేశారు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా మెస్మరైజ్ చేస్తాడు. హాలీవుడ్ హీరోలా తన చార్మింగ్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. కఠినమైన డైట్ ఫాలో అయ్యే మహేశ్‌బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. భార్య, పిల్లలతో వారం రోజులుగా జర్మనీలో గడుపుతున్నారు.అయితే తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన మహేశ్ షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను కలవర పెడుతుంది. డాక్టర్ హ్యారీ కోనిగ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..'థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్! ఆరోగ్యం మెరుగైన చేతుల్లో'.. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఇది చూసి మహేశ్‌కు ఏమైంది?ఆయన అస్వస్థతకు గురైతే డాక్టర్ హ్యారీ నయం చేశారా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్ ఆద్వర్యంలో మహేశ్ చికిత్స తీసుకుంటూ ఇలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారట. అందుకే డాక్టర్ సేవలను అభినందిస్తూ మహేశ్ ఈ పోస్ట్‌ను షేర్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
Rutvi Chaudhary: స్త్రీల సారథ్యంలో స్త్రీలు నేసే తివాచీలు
ఒక చదరపు అంగుళం తివాచీ అల్లాలంటే 197 దారపు ముడులు వేయాలి. ఓపికతో నిండిన ఈ పనిని స్త్రీలే నేర్చుకున్నారు. ‘జైపూర్ రగ్స్’ ఇవాళ 40 వేల మంది నేత కార్మికులతో రగ్గులు తయారు చేయిస్తుంటే వారిలో 30 వేల మంది స్త్రీలే ఉన్నారు. కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన రుత్వి చౌదరి ఈ సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ‘ఇంట అడుగు పెట్టిన కోడలికి ఇంటి సభ్యుల కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇంటి ఘనతను కోడలు నిలబెట్టగలదా లేదా అందరూ గమనిస్తారు. మా మామగారు ఎన్.కె.చౌదరి మొదలెట్టిన జైపూర్ రగ్స్ సంస్థలో డైరెక్టర్‌గా అడుగు పెడుతున్నప్పుడు అదేం సామాన్యమైన బాధ్యతని అనిపించలేదు. కాని సాధించగలననే అనుకున్నాను’ అంటుంది రుత్వి చౌదరి. ఆడపడుచులు ఆశ, అర్చనలు అమెరికాలో జైపూర్ రగ్స్ సంస్థను నడుపుతుంటే మన దేశంలో భర్త యోగేష్ చౌదరితో కలిసి సంస్థను ముందుకు తీసుకెళుతోంది రుత్వి చౌదరి. ‘నేను మొదటగా చెప్పాలనుకుంటున్నది ఏమంటే మాది విమెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. మా సంస్థలో ప్రధాన బాధ్యతలన్నీ స్త్రీలే నిర్వహిస్తారు. మా దగ్గర అల్లే ప్రతి తివాచీ స్త్రీ తన బిడ్డను సింగారించినట్టే ఉంటుంది. చేతి అల్లికతో తయారయ్యే తివాచీలు ఇవి’ అంటుందామె. ► తొమ్మిది మందితో మొదలయ్యి రుత్వి చౌదరి మామగారు ఎన్.కె.చౌదరి 1978లో కేవలం ఇద్దరు నేతగాళ్లతో, రెండు మగ్గాలతో, ఐదు వేల రూపాయల పెట్టుబడితో జైపూర్ రగ్స్ను స్థాపించాడు. చాలా కాలం వరకు ఇది కేవలం విదేశాలకే రగ్గులు పంపేది. 2006లో కొడుకు యోగేష్ చౌదరి పగ్గాలు స్వీకరించాక దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రుత్వి చౌదరి వచ్చాక సంప్రదాయిక డిజైన్లకు డిజైనర్ల సృజన జత చేయడంతో కొత్త తరాన్ని ఆకట్టుకునేలా ఇవి తయారవుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల్లో 600 గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మహిళా నేత కార్మికులు తివాచీలు తయారు చేస్తారు. రాజస్తాన్లాంటి చోట దేశీయ తివాచీ డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. కాని చాలామటుకు మూసగా కనిపిస్తాయి. నేను ఈ సాంప్రదాయికతను చెడగొట్టదలుచుకోలేదు. కాని డిజైనర్ల సృజన జత చేయాలనుకున్నాను. హిరేన్ పటేల్, ఆషిష్ షా, శాంతను గార్గ్లాంటి వాళ్ల చేత కొత్త డిజైన్లు, పాట్రన్లు ఈ దేశవాళి డిజైన్లకు జత చేశాను. మా మహిళా నేతగత్తెలు వాటిని వెంటనే అందుకున్నారు. ఈ కాలపు యూత్‌ను కూడా ఆకర్షించేలా తయారు చేశారు’ అంది రుత్వి. ► స్త్రీలకు దక్కిన మర్యాద ‘తివాచీ ఇంటిని దగ్గరగా కూడేలా చేస్తుందంటారు పర్షియన్లు. ఆ సంగతి ఏమో కాని వేల మంది స్త్రీలను మేము ఒక కుటుంబంగా చేయగలిగాము. రాజస్థాన్‌లో తివాచీల నేత వల్ల స్త్రీలకు గౌరవం పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యం వలసలు ఎంతో తగ్గాయి. భార్య సంపాదిస్తూ ఉండటంతో భర్త కూడా బుద్ధిగా పని చేయడం మొదలెట్టాడు. ఈ అన్ని కారణాల వల్ల మా నేతమ్మలు మా సంస్థను ఎంతో ప్రేమిస్తారు. మేము కూడా వారిని ఎక్కువ విసిగించం. మెటీరియల్ ఇచ్చి సరుకును బదులుగా తీసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్. వారికి వీలున్నప్పుడే పని చేయొచ్చు. అంతర్గతంగా ఏదైనా సమస్య వస్తే చర్చించుకోవడానికి పరిష్కరించుకోవడానికి ‘తనా–బనా’ అనే సొంత యాప్ ఉంది. అందులో సత్వర పరిష్కారాలు చెబుతాం’ అంటుంది రుత్వి. ► జర్మనీలో అవార్డ్ జైపూర్ రగ్స్ సంస్థ తాను ఇచ్చే డిజైన్లనే కాక మహిళలను వారి మనసుకు నచ్చిన డిజైన్లతో వినూత్నమైన తివాచీలను అల్లే వీలు కల్పిస్తుంది. వీటిని ‘మన్చాహా’ తివాచీలు అంటారు. ఇలాంటి తివాచీలకు ఎక్కువ సమయం (కొత్త డిజైన్ ఆలోచించాలి కనుక) పడుతుంది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేయరు. కాని ప్రతిభ ఉన్న మహిళలు పాశ్చాత్యులను సైతం అబ్బుర పడేలా డిజైన్లు చేస్తారు. వీటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. 2018లో బిమలా దేవి అనే నేతమ్మ అల్లిన తివాచీకి ఫ్రాంక్‌ఫర్ట్‌లో ‘జెర్మన్ డిజైన్ అవార్డ్’ దక్కింది. ‘మన వారి ప్రతిభను అలా ప్రపంచ దేశాలకు చాటుతున్నాం. మా మహిళలు తయారు చేస్తున్న తివాచీలు ఇప్పుడు 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని తెలిపింది రుత్వి. ఈ సంస్థలో ఒకసారి కొంతమంది స్త్రీలు 30 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు తివాచీని అల్లారు. దీని కోసం కోటీ 40 లక్షల దారపు ముడులను వేయాల్సి వచ్చింది. ‘మేము తయారు చేసిన వాటిలో అది అత్యంత ఖరీదైనది. దానిని సౌది రాజుకు అమ్మాం’ అని తెలిపింది రుత్వి. ‘దళారులను తొలగించి వారి కమీషన్ కూడా స్త్రీలకే అప్పజెప్పడం వల్ల వారూ మేమూ సంతృప్తిగా ఉన్నాం’ అని ముగించిందామె. -
జర్మన్ స్టార్టప్‌లో టీవీఎస్‌కు 25 శాతం వాటా
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్టులు, విడిభాగాల జర్మన్ స్టార్టప్ కిల్వాట్ జీఎంబీహెచ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా పేర్కొంది. 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కొత్తగా జారీ చేయనున్న 8,500 ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా వాటాను పొందనుంది. ఇందుకు షేరుకి 235.29 యూరోల చొప్పున చెల్లించనుంది. ఇందుకు దాదాపు రూ. 18 కోట్లు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అవసరమయ్యే హైటెక్ ప్రొడక్టులు, విడిభాగాల డిజైన్, తయారీ, పంపిణీ చేపడుతోంది. -
నాటు నాటు పాటకి జర్మన్ అంబాసిడర్ స్టెప్పులు..వీడియో వైరల్
నాటు నాటు పాట యావత్ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్. ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకెర్మాన్ ఓల్డ్ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు. ఆ తర్వాత అకెర్మాన్ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆయన ట్విట్టర్లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్‌లోని కొరియన్ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇప్పుడూ నెక్స్ట్ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్ జే బోక్ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun! Thanks @rokEmbIndia for inspiring us. Congratulations & welcome back @alwaysRamCharan & @RRRMovie team! #embassychallange is open. Who's next? pic.twitter.com/uthQq9Ez3V — Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023 (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్) -
బాప్రే!.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు
ఒకటి రెండు కాదు ఏకంగా వేలమందిని హత్య చేసింది ఒక వృద్ధురాలు. రెండో ప్రప్రంచ యుద్ధం సమయం నాటి కేసులో కోర్టు తాజాగా ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుత పోలాండ్‌కి సమీపంలో ఉన్న స్టట్‌థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో కార్యదర్శిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19 సంవత్సరాల మద్య ఉండటంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యంతో ఉండటంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్‌థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్‌థాప్‌లోని గ్యాస్ చాంబర్లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానికి మీడియా పేర్కొనడం గమనార్హం. (చదవండి: రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్) -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
విమాన ప్రయాణికులకు అలర్ట్.. వాటిని నిషేదిస్తూ కీలక నిర్ణయం!
విమాన ప్రయాణానికి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ప్రమాదం అంటూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ తెలిపింది. అందుకే తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాల్లో యాపిల్ ఎయిర్ ట్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణంలో తమ వెంట తెచ్చుకున్న లగేజీ సేఫ్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అదే ఎయిర్ ట్యాగ్స్‌పై జర్మనీ ఎయిర్‌లైన్ ఆంక్షలు విధించింది. అయితే లుఫ్తాన్సా ఇటీవల ‘ఎయిర్ ట్యాగ్లు ప్రమాదమని.. కాబట్టే యాక్టివేటెడ్ ఎయిర్‌ట్యాగ్‌లను ప్రయాణికుల వినియోగంచుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిలియన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాల కారణంగా లుఫ్తాన్సా ఎయిర్‌ట్యాగ్‌ని నిషేధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు, 15 అంగుళాల యాపిల్ మాక్ ప్రో (సెప్టెంబర్ 2015 ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన)లపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయి. యాపిల్ సంస్థ లిథియం- అయాన్ బ్యాటరీలు వినియోగించదు. ఎయిర్ ట్యాగ్స్ కోసం యాపిల్ సంస్థ సీఆర్2032 సెల్స్‌ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఆ సెల్స్ ప్రమాదకరమని భావిస్తే స్మార్ట్‌వాచ్‌లను విమానాల్లో అనుమతించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. యాపిల్ ఎయిర్ట్యాగ్పై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ ఎందుకు నిషేధం విధించిందో స్పష్టమైన నిషేధాన్ని కారణాలు వివరించనప్పటికీ, అనేక నివేదికలు మాత్రం ప్రయాణికుల లగేజీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
Russia-Ukraine war: ఏళ్ల తరబడి ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు. జవాన్లను కలుసుకున్న జెలెన్స్కీ చాలారోజులుగా రాజధాని కీవ్కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్‌లో జెలెన్స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్డైని, పొసద్–పొక్రోవ్స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు. జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం! ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది. -
జర్మనీలో వరంగల్ యువకుడి గల్లంతు.. కేటీఆర్‌ను సాయం కోరిన కుటుంబం
వరంగల్: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్‌కి చెందిన యువకుడు అక్కడ గల్లంతయ్యాడు. నగరంలోని కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్ (26) జర్మనీలోని హోట్టోవన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్ సోలార్ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్లో ఉన్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. నది ఒడ్డున సెల్పీ దిగే క్రమంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు, అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అఖిల్ తండ్రి కడారి పరుశురాములు వరంగల్‌లో మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతవడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది. మరోవైపు అఖిల్ సోదరి తన సోదరుడి ఆచూకి, వివరాలు తెలిపేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా కోరగా... తన వంతు సాయం చేస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. Will speak to the authorities in Germany and do our best Rasagnya My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh — KTR (@KTRTRS) May 10, 2022 చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
ఉక్రెయిన్ ఆర్మీ ఆసక్తికర ప్రకటన!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 30వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మ్డ్ బలగాల్లోని జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది. ⚡️Ukrainian army: Russia wants to end war by May 9. According to intelligence from the General Staff of the Armed Forces of Ukraine, Russian troops are being told that the war must end by May 9 – widely celebrated in Russia as the day of victory over the Nazi Germany. — The Kyiv Independent (@KyivIndependent) March 24, 2022 ఉక్రెయిన్ పౌరుల కిడ్నాప్! ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరు 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను (అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆంబుడ్స్మన్ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. -
12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!
సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది.