
హైదరాబాద్: జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి తనను వాట్సాప్‌లో వేధిస్తున్నాడంటూ నగరానికి చెందిన యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. జూబ్లీహిల్స్‌లో నివసించే ఓ యువతి(31)కి కొద్ది కాలం క్రితం ఓ ప్రాజెక్టు విషయంలో అదే ప్రాంతంలో ఉన్న బీడీ అగ్రికల్చరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ న్యూమన్‌తో పరిచయం ఏర్పడింది.
న్యూమన్ తన వాట్సాప్ నంబర్ ద్వారా ఆ యువతికి అసభ్యకర సందేశాలను పంపాడు. దీనిపై ఆమె డిసెంబర్ 19న పోలీసులకు ఫిర్యాదుచేసింది. యువతిని వేధిస్తున్నది జర్మనీకి చెందిన టోర్‌స్టెన్ రీనర్ న్యూమన్(52)గా పోలీసులు గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354ఏ, 354డీ కింద క్రిమినల్ కేసులు నమోదుచేశారు. నిందితుడు కూకట్‌పల్లి సమీపంలోని లోధా టవర్స్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. న్యూమన్ రెండ్రోజుల క్రితం కోర్టులో లొంగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment