వరంగల్: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్‌కి చెందిన యువకుడు అక్కడ గల్లంతయ్యాడు. నగరంలోని కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్ (26) జర్మనీలోని హోట్టోవన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్ సోలార్ ఎనర్జీ విభాగంలో ఫైనలియర్‌లో ఉన్నాడు. కాగా రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. నది ఒడ్డున సెల్పీ దిగే క్రమంలో నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు, అక్కడి ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అఖిల్ తండ్రి కడారి పరుశురాములు వరంగల్‌లో మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతవడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది. మరోవైపు అఖిల్ సోదరి తన సోదరుడి ఆచూకి, వివరాలు తెలిపేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా కోరగా... తన వంతు సాయం చేస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Will speak to the authorities in Germany and do our best Rasagnya
— KTR (@KTRTRS) May 10, 2022
My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh
Comments
Please login to add a commentAdd a comment