బేయర్ దక్షిణాసియా హెడ్ సైమన్
పానిపట్: భారత్‌లో సాగు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జర్మన్ కెమికల్స్ దిగ్గజం బేయర్ దక్షిణాసియా ప్రెసిడెంట్ సైమన్ వీబుష్ ప్రశంసించారు. వెనుకబడిన వ్యవసాయ రంగంతో భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించడం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలు వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని సైమన్ చెప్పారు.
భారత్ వినూత్న ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, రెగ్యులేటరీ ప్రక్రియలను మరింతగా డిజిటలీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత నెలకొన్న నేపథ్యంలో తాము కలుపు మందులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. క్రిమిసంహారకాల కన్నా అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. వరి, గోధుమలు, చెరకు వంటి కీలక పంటల కోసం కలుపు మందులను అభివృద్ధి చేస్తున్నామని సైమన్ చెప్పారు. అంతర్జాతీయంగా తాము నిర్వహిస్తున్న ’ఫార్వర్డ్‌ఫామ్స్’ కార్యక్రమం ద్వారా భారత్‌లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను, ఆగ్రో–కెమికల్స్‌ను మెరుగుపర్చే కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment