జర్మన్ పాప్ సింగర్‌తో... ఆంధ్రా డీజే ! | !youngest DJ from hyderabad, pruthvi | Sakshi
Sakshi News home page

జర్మన్ పాప్ సింగర్‌తో... ఆంధ్రా డీజే !

Published Wed, Oct 9 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

ganger pop singer

ganger pop singer

  ఎక్స్‌క్లూజివ్

‘కాస్మిక్ ఎనర్జీ’ ఆల్బమ్‌తో పాప్యులరైన జర్మన్ దేశపు పాప్ సింగర్ స్టెల్లాజి...హైదరాబాద్ కుర్రాడు పృథ్వితో జట్టుకట్టింది. వీరిద్దరూ రూపొందించిన సింగిల్‌ట్రాక్ ఆల్బమ్ బీట్ ద బాక్స్ ఈ నెల 19 న మార్కెట్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో అటు యంగెస్ట్ డీజేగానూ, ఇటు స్టెల్లాతో జోడీ ద్వారానూ టాక్ ఆఫ్‌ది మ్యూజిక్ ఇండస్ట్రీగా మారిన డీజె పృథ్వితో ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు తన మాటల్లోనే...
 
 రీమిక్స్ విని విని...
 నాన్న ఈవెంట్ మేనేజర్‌గా చేసేవారు. ఆయనకు మ్యూజిక్ అంటే కూడా బాగా ఆసక్తి. ఆ అభిరుచితోనే  ‘చిరంజీవి మెగామిక్స్’, ఇళయరాజా పాటలతో‘చలాకీ చిన్నది’ రీమిక్స్ ఆల్బమ్స్ రూపొందించారు. ఆ వర్క్‌ను దగ్గర నుంచి చూడడం వల్ల నాలో రీమిక్స్ పట్ల ఆసక్తి  పెరిగింది. డాడీ చేసే ఈవెంట్లలో పలువురు డీజేల వర్క్ పరిశీలించడం కూడా డీజేయింగ్‌ై వెపు నన్ను లాగింది.
 
 ముందు షాక్ తిన్నా... తర్వాత మెచ్చుకున్నారు
 డీజే అవుతానంటే నాన్న ముందు షాక్ తిన్నారు. అయితే అప్పటికే నేను ఇంటర్నెట్లో వర్చ్యువల్ డీజే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుని కొన్ని పాటలు మిక్స్ చేశాను. అది 15 రోజుల తర్వాత ఎక్స్‌పైర్ అయింది. ఈ విషయం చెప్పి నా మిక్సింగ్ చూపించాను. దాంతో కొత్త సాఫ్ట్‌వేర్ కొనిచ్చారు. ఆ తర్వాత డాడీ ఫ్రెండ్ డీజే అనంత్ నాకు గురువుగా మారారు. గోవాలో తొలి ప్రోగ్రామ్ చేసేటప్పటికి పదేళ్లే కావడంతో యంగెస్ట్ డీజే అని పేరొచ్చింది.
 
 ఫ్యాషన్ షోస్‌కి స్పెషల్...
 చండీఘడ్ నుంచి కొచ్చిన్ దాకా పలుప్రాంతాల్లో డీజేయింగ్ చేశాను. పబ్స్, క్లబ్స్, ఈవెంట్స్... చేసినా ‘ఫ్యాషనాలజీ’, ఇండియా లైఫ్‌స్టైల్ -బ్రైడల్ షో, ఫ్యాషన్ ఎట్ ఫౌండేషన్ షో... ఇలా ఎక్కువ ఫ్యాషన్ ఈవెంట్లకి చేయడంతో ఫ్యాషన్ షోస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లా మారాను.
 
 రెండేళ్ల క్రితం ‘మాస్టర్ బ్లాస్ట్’ ఇంటర్నేషనల్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. ‘లాగిన్’ హిందీ మూవీలో మూడు పాటలకు అఫీషియల్ రీమిక్స్ చేశా. నా అభిమాన సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్‌వి 37 పాటలు కలిపి ఆరు  నిమిషాల రహ్మాన్ మాషప్ చేశాను. అలాగే జర్మన్ సింగర్ స్టెల్లాజి చేసిన కాస్మిక్ ఎనర్జీ ఆల్బమ్ లోని క్యాట్‌వాక్, వీనస్‌పవర్ ట్రాక్స్ రీమిక్స్ చేశా. ఇంటర్నెట్లో నా మిక్సింగ్ వర్క్ చూసిన స్టెల్లా ‘ఇద్దరం కలిసి సింగిల్‌ట్రాక్ చేద్దామా’ అని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టింది. అంత పెద్ద సింగర్ ఆఫర్ కావడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వెంటనే ఓకె అన్నా. మేమిద్దరం చేసిన ట్రాక్‌తో ఆల్బమ్‌ను ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఆ పాటలో కొన్ని ర్యాప్ బిట్స్ పాడాను. తొలిసారిగా మనదేశంలో నా వయసు డీజేతో పాప్ సింగర్  చేయడం ఇదే ఫస్ట్.
 
 ప్రపంచస్థాయి లక్ష్యం...
 స్టడీస్ విషయానికొస్తే టెన్త్ పూర్తిచేశా. ప్రైవేట్‌గా కాలేజీచదువు కొనసాగించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఇంట్లోనే స్టూడియో సెటప్ కూడా చేసుకున్నా. డీజేయింగ్‌కు ఇండియాలో మంచిఫ్యూచర్ ఉంది. ఇప్పుడు సినిమా పాటల్ని రీమిక్స్ చేసేందుకు డీజేలనే సంప్రదిస్తున్నారు. నా ఆదాయంలో అత్యధిక భాగం ఛారిటీకి ఖర్చు చేస్తున్నాను.  మనీ కాదు మ్యూజిక్‌లో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రపంచం గుర్తించే డీజే కావాలి. అదే నా ఆశయం.
 - ఎస్.సత్యబాబు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement