అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్‌లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్‌ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!
జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్‌లో ఉంచుతుంది.
ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్‌స్టర్‌డామ్, జ్యూరిచ్‌లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్‌తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్‌లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్‌గా వివరించలేదు.
క్రయోప్రెజర్వేషన్ అంటే..
ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్‌లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.
(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!)
Comments
Please login to add a commentAdd a comment