cryopreservation
-
మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!
అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్లో ఉంచుతుంది. ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్స్టర్డామ్, జ్యూరిచ్లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్‌తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్‌లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్‌గా వివరించలేదు. క్రయోప్రెజర్వేషన్ అంటే..ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!) -
సిటీలో స్పెర్మ్ నిల్వకు ప్రత్యేక సెంటర్లు..
బంగారం.. వజ్రాభరణాలే కాదు.. ‘సంతాన భాగ్యాన్ని’ ప్రత్యేక ‘క్రయో ప్రిజర్వేషన్’ బ్యాంకుల్లో భద్రపరిచే సౌకర్యం సిటీలో అందుబాటులోకి వచ్చింది. మీ కలల ప్రతిరూపాలను సిద్ధం చేసే అండాలనూ పదికాలాల పాటు సురక్షితంగా ఉంచే ఎగ్ బ్యాంక్‌లు ఇప్పడు నగరంలో వెలిశాయి. కెరీర్..ఉద్యోగం...బిజీలైఫ్‌తో పిల్లలను కనడం వాయిదా వేసుకునే దంపతులకు ఈ ఎగ్, స్పెర్మ్ బ్యాంకులు ఆదరువులా మారాయి. నగరంలో ఇప్పటికే పాతిక వరకు ఎగ్ బ్యాంక్‌లు (అండాలను భద్రపరిచే) ఏర్పాటయ్యాయి. వయసులో ఉన్నప్పుడు అండాలను ఆయా బ్యాంకుల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు భద్రపరచి.. తమకు కావాలనుకున్నప్పుడు సంతానం పొందేలా అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి రావడం పలువురికి ఉపయోగకరంగా మారింది. సాక్షి, సిటీబ్యూరో:ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. భార్య ఒక షిప్ట్‌లో పని చేస్తుంటే, భర్త మరో షిప్టులో పని చేస్తుండటం వల్ల కనీస దాంపత్యానికి నోచుకోలేక పోతున్నారు. యుక్తవయసు దాటిన తర్వాత వివాహం చేసుకోవడంతో పాటు కెరీర్ వేటలో పడి చాలా మంది మహిళలు పిల్లలను వాయిదా వేసుకుంటున్నారు. ఒక వయసు దాటిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ముందే జాగ్రత్త పడుతున్నారు. భార్య అండాల(ఎగ్)తో పాటు, భర్త వీర్యకణాల(స్పెర్మ్)ను సేకరించి భద్రపరుచుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. యుక్తవ యసులోనే తమ అండాలను సేకరించి భద్రపరుచుకుంటున్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం నగరంలో ఈ బ్యాంక్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో 28 ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, వీటిలో చాలా వరకు ఈ ‘క్రయో ప్రిజర్వేషన్’ బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. కేన్సర్ బాధితులు కూడా... బిజీ లైఫ్, ఒత్తిడి, నియమాలు లేని ఆహారపు అలవాట్లు స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్ పార్టీల పేరుతో పీకలదాక తాగడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాకు పరుగులు తీస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్(ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ఐసీఎస్ఐ)చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. వైద్యరంగంలో అనేక సాంకేతిక మార్పులు చోటు చేసుకోవడం, చికిత్సలపై దంపతుల్లో అవగాహన పెరగడం వల్ల చాలా మంది ముందే మేల్కొంటున్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎగ్, స్పెర్మ్ సెల్స్ యాక్టివ్‌గా ఉంటుండటంతో పాటు త్వరగా ఫలదీకరణం చెందే గుణంఉండటం వల్ల ముందే భద్రపరుచుకోవాలని భావిస్తున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా కేన్సర్ వంటి జబ్బులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులు కూడా వీటిని ఆశ్రయిస్తుండటానికి మరో కారణం. ఒకసారి భద్రపరిస్తే..పదేళ్ల వరకు డోకా ఉండదు మహిళల్లో పీరియడ్స్ వచ్చిన తర్వాత హార్మోన్స్‌ను సేకరిస్తారు. దీన్ని పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత వరుసగా పది రోజుల పాటు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తారు. ఎగ్(అండం) సైజ్‌ను ఓ స్థాయికి వృద్ధి చేసి, ఆ తర్వాత ప్రత్యేక నీడిల్ సహాయంతో అండాలను బయటికి తీస్తారు. ఇలా సేకరించిన అండాలను లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన క్రయోప్రిజర్వేషన్ బాక్స్‌లో భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన అండాలు పదేళ్ల వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మహిళ వయసు, మోనోపాజ్ను దృష్టిలో ఉంచుకుని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో అండాలను సేకరించి భద్రపరిస్తే..ఐదేళ్లలో వినియోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇందుకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఛార్జీ చేస్తుండటం వల్ల మధ్య తరగతి దంపతులు కూడా ఈ కేంద్రాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇదే తరహాలో పురుషుల నుంచి స్పెర్మ్‌ను కూడా సేకరించి భద్రపరుస్తుంటారు. అయితే ఎగ్బ్యాంక్లను ఆశ్రయిస్తున్న వారిలో పురుషులతో పోలిస్తే..మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. ఎగ్ బ్యాంక్‌లు దంపతులకు ఓ వరం మారిన జీవనశైలి వల్ల చాలా మంది మహిళల్లో చిన్న వయసులోనే మోనోపాజ్ మొదలవుతుంది. శరీరానికి కనీస వ్యాయాయం లేకపోవడం, ఏదీపడితే అది తినడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇవి పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కనాల్సిన వయసులో పిల్లలు కనకపోవడం వల్ల ఆ తర్వాత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. ఇలాంటి వారికి ఎగ్బ్యాంకులు ఓ వరం లాంటివే. మా ఆస్పత్రిలో నాలుగేళ్ల క్రితమే ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ..వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో ఇప్పటికే 15 మంది తమ ఎగ్స్‌ను భద్రపరుచుకున్నారు.– డాక్టర్ సరోజ కొప్పాల, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఆస్పత్రి -
చనిపోయిన మనిషి బతికొస్తాడట!
టెక్సాస్: చనిపోయిన మనిషిని ఎప్పటికైనా బతికించగలమా? అవుననే అంటున్నారు ఈ దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్న క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు. ఇప్పటికిప్పుడు ప్రాణం పోయిన మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో లేదు. కొన్నేళ్లకైనా సరే, అంటే వందేళ్లకైనా మనిషిని బతికించే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి కచ్చితంగా వస్తుందని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ పరిజ్ఞానమే అందుబాటులోకి వస్తే అప్పుడు చనిపోయిన వారికి మాత్రమే ప్రాణం పోయగలరుగదా! ఈలోగా చనిపోయిన వారి సంగతి ఏమిటీ? ఈ ప్రశ్న కారణంగానే క్రియోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చనిపోయిన వారి మృతదేహాలను కూడా క్రియోనిక్స్ పద్ధతిలో భద్రపరిచినట్లయితే తిరిగి ప్రాణంపోసే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రాణం పోయవచ్చని క్రియోనిక్స్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకు క్రియోనిక్స్ అంటే ఏమిటీ? ఇది గ్రీక్ పదం. గ్రీక్‌లో క్రియోస్ అంటే శీతలం అని అర్థం. అతిశీతలంలో అంటే, మైనస్ 130 డిగ్రీల నుంచి మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ శీతలీకరణంలో మానవ శరీరాలు, అంగాలను భద్రపర్చడాన్నే క్రియోనిక్స్ అంటాం. మొత్తం మానవ మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల వద్ద, అవయవాలను మైనస్ 130 సెల్సియస్ డిగ్రీల శీతల పరిస్థితుల్లో భద్రపరుస్తారు. చనిపోయిన మనిషిలోని ఏ జన్యువు కూడా దెబ్బతినకుండా ఉండేందుకు శరీరం రక్తనాళాల్లోని రక్తాన్ని వెలికితీసి ఆ స్థానంలో ‘గ్లుటారల్ డిహైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని ఎక్కిస్తారు. దీనివల్ల మానవ మృతదేహంలోని ఏ అణువు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అయితే క్రయోనిక్స్ పద్ధతిలో మానవ దేహాలను భద్రపరిచే ప్రక్రియను మరణించిన కొన్ని క్షణాల్లోనే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో అతిశీతల వాతావరణంలో మానవ శరీరాలను భద్రపర్చినప్పటికీ మంచు పేరుకొని గడ్డకట్టుకుపోవు. ఇలా క్రయోనిక్స్ పద్ధతిలో మానవ శరీరాలను లేదా తల, గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు లాంటి అవయవాలను భధ్రపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మూడు ల్యాబ్‌లు అమెరికాలో ఉండగా, ఒక ల్యాబ్ రష్యాలో ఉంది. అమెరికాలోని ల్యాబ్‌లు మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 28 వేల డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక అవయవాలను భద్రపర్చేందుకు 12 వేల నుంచి 36 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. 2014లో అమెరికా క్రైయోనిక్స్ ల్యాబుల్లో 250 మంది భద్రపర్చగా మరో 1500 మందిని భద్రపర్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. కేవలం డబ్బుగల వారికే ఈ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు అమెరికాలో మరో ల్యాబ్ పుట్టుకొస్తోంది. టెక్సాస్‌లోని కమ్ఫర్ట్లో వందకుపైగా ఎకరాల సువిశాల ప్రదేశంలో ‘టైమ్షిప్ బిల్డింగ్’ పేరిట ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు. పర్యావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను, టెర్రరిస్టులుల దాడులను తట్టుకునేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం నేలను చదును చూసే ప్రక్రియ ప్రారంభమైందని, రెండు, మూడు రోజుల్లో పునాదులు పడతాయని దీనికి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీఫెన్ వాలెంటైన్ తెలిపారు. ఈ భవనం పూర్తయితే ఏకంగా 50 వేల మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంచెలంచెలుగా ఎలాంటి ముప్పులేకుండా ఈ భవనానికి పటిష్ట భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ‘న్యూసైంటిస్ట్’ తాజా సంచిక చూడాల్సిందే. చనిపోయిన మనిషిని బతికించేందుకు పరిశోధనలు 1962లోనే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఎట్టింగస్ 1962లోనే ‘ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ’ అనే పుస్తకం ప్రచురణ ఈ పరిశోధనలకు దారిచూపింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోవున్న ఈ పుస్తకం 2005 పునర్ముద్రణకు నోచుకుంది. డాక్టర్ జేమ్స్ బెడ్ఫోర్డ్ అనే వ్యక్తి మృతదేహాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1967లో క్రయోనిక్స్ పద్ధతిలో భద్రపరిచారు. ఆయన మృతదేహం ఇప్పటికీ అమెరికా ల్యాబ్‌లో అలాగే ఉంది.